దేశ రాజధానిలో భారీగా పట్టుబడ్డ పిస్టల్స్, మ్యాగజైన్స్
దేశ రాజధాని కేంద్రంగా ఆయుధాలను అక్రమంగా సరఫరా చేస్తున్న ముఠాకు ఢిల్లీ స్పెషల్ పోలీసులు చెక్ పెట్టారు. పక్కా సమాచారం అందడంతో.. ఢిల్లీ పోలీసు విభాగానికి చెందిన స్పెషల్ సెల్..
దేశ రాజధాని కేంద్రంగా ఆయుధాలను అక్రమంగా సరఫరా చేస్తున్న ముఠాకు ఢిల్లీ స్పెషల్ పోలీసులు చెక్ పెట్టారు. పక్కా సమాచారం అందడంతో.. ఢిల్లీ పోలీసు విభాగానికి చెందిన స్పెషల్ సెల్ తనిఖీలు చేపట్టింది. ఈ క్రమంలో అంతర్ రాష్ట్ర ముఠాను అదుపులోకి తీసుకోగా.. వారి వద్ద నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలు లభించాయి. 20 పిస్టల్స్, 40 మ్యాగజైన్లు, 50 లైవ్ కార్‌ట్రేడ్జ్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.
Delhi Police Special Cell busts interstate illegal arms syndicate. One arms trafficker arrested; 20 pistols, 40 magazines, & 50 live cartridges seized. pic.twitter.com/BWIbo7xpKY
— ANI (@ANI) August 21, 2020
Read More :