జమ్ము-శ్రీనగర్‌ హైవేపై స్థంభించిన రాకపోకలు

జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్‌ జామ్ అయ్యింది. ఎన్‌హెచ్ 44పై రాంబన్‌‌- రాంసు ప్రాంతం మధ్య కొండచరియలు విరిగినపడ్డాయి. దీంతో ఆ ప్రాంతంలో వాహనాల రాకపోకలు..

జమ్ము-శ్రీనగర్‌ హైవేపై స్థంభించిన రాకపోకలు
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Aug 21, 2020 | 7:12 PM

జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్‌ జామ్ అయ్యింది. ఎన్‌హెచ్ 44పై రాంబన్‌‌- రాంసు ప్రాంతం మధ్య కొండచరియలు విరిగినపడ్డాయి. దీంతో ఆ ప్రాంతంలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. గత రెండు రోజులుగా భారీగా కురుస్తున్న భారీ వర్షాలు కురియడంతో పెంటియల్, త్రిశూల్ మోడ్, మరోగ్, మంకీ మోడ్, ఐరన్ షెడ్, డిగ్డోల్, అనోఖీ ఫాల్, బ్యాటరీ చాష్మా ప్రాంతాల్లో రహదారిపై కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో ఆ ప్రాంతం గుండా ప్రయాణించే వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. అందులో నిత్యవసర సరుకులు తీసుకువచ్చే 250 నుంచి 300 ట్రక్కులు కూడా నిలిచిపోయాయి. అటు ఉధంపూర్‌లోనూ వందల కొద్ది వాహనాలు రహదారులపై నిలిచిపోయాయి. రంగంలోకి దిగిన రెస్క్యూ టీం.. సహాయక చర్యలు చేపడుతోంది. వీలైనంత త్వరగా కొండచరియలను తొలగించి రాకపోకలకు అడ్డంకులను తొలగిస్తామని అధికారులు తెలిపారు.

Read More :

గుండెపోటుతో బీజేపీ ఎమ్మెల్యే కన్నుమూత

కేంద్రమంత్రికి పాజిటివ్‌.. క్వారంటైన్‌లోకి హర్యానా సీఎం