Darlings Movie: సౌత్‌ను టార్గెట్ చేస్తున్న ఆలియా.. ‘డార్లింగ్స్’ రీమేక్‌తో ప్రొడ్యూసర్‌గా ఎంట్రీ.. హీరోయిన్ ఎవరంటే..
Darlings Movie: బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ హీరోయిన్ తెరకెక్కిన చిత్రం 'డార్లింగ్స్'. ఈ చిత్రానికి ఆలియా నిర్మాతగా వ్యవహరించిన విషయం తెలిసిందే. రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి రూపొందించిన ఈ సినిమాను ఆగస్టు 5వ తేదీన నేరుగా...
Darlings Movie: బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ హీరోయిన్ తెరకెక్కిన చిత్రం ‘డార్లింగ్స్’. ఈ చిత్రానికి ఆలియా నిర్మాతగా వ్యవహరించిన విషయం తెలిసిందే. రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి రూపొందించిన ఈ సినిమాను ఆగస్టు 5వ తేదీన నేరుగా ఓటీటీ వేదికగా విడుదల చేశారు. విభిన్న కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాను సౌత్‌లో రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. సౌత్ నిర్మాణ బాధ్యతలను కూడా స్వయంగా ఆలియానే చూసుకోనుంది. అయితే హీరోయిన్‌గా మాత్రం సౌత్ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్‌ను తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఫ్యామిలీ ఎమోషన్స్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా సౌత్ ప్రేక్షకులను మెప్పిస్తుందన్న ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో రీమేక్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ప్రస్తుతం ఈ కథకు సూట్ అయ్యే హీరోయిన్‌ను వెతికే పనిలో ఉన్నారు. ఇక ఈ రీమేక్‌లో ఎవరు నటించనున్నారన్నదానిపై చర్చ మొదలైంది. ఉమెన్ ఓరియెంటెడ్ మూవీ కావడంతో మొదటగా అనుష్క, నయనతార పేర్లే గుర్తుకొస్తాయి. అయితే వీరిద్దరూ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.
అనుష్క యూవీ బ్యానర్‌లో ఓ సినిమాలో నటిస్తుండగా, నయనతార షారుఖ్‌తో జవాన్‌లో నటిస్తోంది. దీంతో వీరిద్దరూ నటించడం కష్టమేననే వాదన వినిపిస్తోంది. ఇక ఈ జాబితాలో వినిపిస్తోన్న మరో పేరు కీర్తి సురేశ్.. ఆలియా పాత్రకు మహానటి కీర్తి సురేశ్ అయితే సరిగ్గా సరిపోతుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరి ఆలియా ఎవరికి ఓటేస్తుందో చూడాలి.