Pawan Kalyan: పవన్‌ ఫ్యాన్స్‌కు ఇక పూనకాలే.. జల్సా కొత్త ప్రింట్ నెక్స్ట్ లెవెల్ అంటూ డైరెక్టర్ ట్వీట్..

Pawan Kalyan: పాత సినిమాలను కొత్తగా విడుదల చేయడం ఇప్పుడు లేటెస్ట్‌ ట్రెండ్‌. ఇప్పటికి టెక్నాలజీకి అనుగుణంగా 4కే రిజల్యూషన్‌, డాల్బీ ఆటమ్స్‌ సౌండ్‌తో సినిమాలను రీ రిలీజ్‌ చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికే పోకిరి చిత్రాన్ని..

Pawan Kalyan: పవన్‌ ఫ్యాన్స్‌కు ఇక పూనకాలే.. జల్సా కొత్త ప్రింట్ నెక్స్ట్ లెవెల్ అంటూ డైరెక్టర్ ట్వీట్..
Follow us

|

Updated on: Aug 12, 2022 | 8:21 PM

Pawan Kalyan: పాత సినిమాలను కొత్తగా విడుదల చేయడం ఇప్పుడు లేటెస్ట్‌ ట్రెండ్‌. ఇప్పటికి టెక్నాలజీకి అనుగుణంగా 4కే రిజల్యూషన్‌, డాల్బీ ఆటమ్స్‌ సౌండ్‌తో సినిమాలను రీ రిలీజ్‌ చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికే పోకిరి చిత్రాన్ని విడుదల చేసిన విషయం తెలిసిందే. సూపర్ స్టార్ మహేష్‌ బాబు పుట్టిన రోజు సందర్భంగా 4కే రిజల్యూషన్‌తో రిలీజ్‌ చేసిన సినిమా మరోసారి అభిమానులను ఉర్రూతలూగించింది.

ఆగస్ట్ 9న రీ-రిలీజ్ అయిన పోకిరి ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపించింది. ఏకంగా రూ. 1.73 కోట్ల భారీ గ్రాస్ వసూలు చేశాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు పవర్ స్టార్‌ పవన్ కళ్యాణ్‌ వంతు వచ్చింది. పవన్‌ పుట్టిన రోజు అయిన సెప్టెంబర్‌ 2వ తేదీన జల్సా చిత్రాన్ని రీ-రిలీజ్‌ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్‌ ముందు కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ సినిమా విడుదలై ఇప్పటికి సరిగ్గా 14 ఏళ్లు పూర్తయింది. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత ఈ చిత్రాన్ని మరోసారి విడుదల చేయనున్నారు.

పవన్‌ పుట్టిన రోజు దగ్గర పడుతోన్న నేపథ్యంలో ఇప్పటికే కొత్త ప్రింట్ పూర్తయినట్లు తెలుస్తోంది. తాజాగా ప్రముఖ దర్శకుడు, రచయిత సాయి రాజేశ్‌ కొత్త ప్రింట్‌ను చూసినట్లు ట్విట్టర్‌ వేదికగా తెలిపాడు. ‘కొత్త ప్రింట్‌లో బాబు కొత్తగా కొన్న అద్దంలా మెరిసిపోతున్నాడు. సౌండ్‌ క్వాలిటీ అద్భుతంగా ఉంది. మీ సెలబ్రేషన్స్‌ మొదలు పెట్టండి’ అంటూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌ చూసిన పవన్‌ ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. 14 ఏళ్ల క్రితం థియేటర్లలో సినిమా చూసిన వాళ్లు, అప్పుడు థియేటర్లలో సినిమాను మిస్‌ అయిన వారు మరోసారి జల్సా చేయడానికి సిద్ధమవుతున్నారు.

ఇది కూడా చదవండి..  

టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
తొక్కే కదా అని తీసిపారేయకండి.. వీరికి ఇది బ్రహ్మాస్త్రం.!
తొక్కే కదా అని తీసిపారేయకండి.. వీరికి ఇది బ్రహ్మాస్త్రం.!
'వరంగల్‎కి త్వరలో ఎయిర్ పోర్టు'.. జనజాతర సభలో సీఎం రేవంత్..
'వరంగల్‎కి త్వరలో ఎయిర్ పోర్టు'.. జనజాతర సభలో సీఎం రేవంత్..
జాక్ పాట్ కొట్టిన ప్రశాంత్ వర్మ..
జాక్ పాట్ కొట్టిన ప్రశాంత్ వర్మ..
ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో తెలుసా..
ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో తెలుసా..
పంత్ విధ్వంసం, అక్షర్, స్టబ్స్ మెరుపులు .. ఢిల్లీ భారీ స్కోరు
పంత్ విధ్వంసం, అక్షర్, స్టబ్స్ మెరుపులు .. ఢిల్లీ భారీ స్కోరు