AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Movie News: మళ్లీ ఫెయిల్ అయిన బాలీవుడ్‌.. బ్యాడ్ టైమ్ ఇంకా ఎన్నాళ్లు..?

బాలీవుడ్‌కు బ్యాడ్ టైమ్ కొనసాగుతుంది. ఈవారం రిలీజైన సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద తుస్సుమన్నాయి.

Movie News: మళ్లీ ఫెయిల్ అయిన బాలీవుడ్‌.. బ్యాడ్ టైమ్ ఇంకా ఎన్నాళ్లు..?
Bollywood Movies
Ram Naramaneni
|

Updated on: Aug 12, 2022 | 9:25 PM

Share

Bollywood: బాలీవుడ్‌కి బ్యాడ్ టైమ్ కంటిన్యూ అవుతోంది. ఈ వారం ఆడియన్స్ ముందుకు వచ్చిన సినిమాలు కూడా అనుకున్న స్థాయిలో పెర్ఫామ్ చేయలేకపోయాయి. క్లాసిక్ అవుతుందనుకున్న సినిమాకు కూడా నెగెటివ్ టాక్ రావటంతో మళ్లీ తలపట్టుకున్నారు ఇండస్ట్రీ జనాలు. లాల్‌ సింగ్‌ చడ్డా… ఈ సినిమా బాలీవుడ్‌ను గ్యారెంటీగా గాడిలో పెడుతుందని ఇండస్ట్రీ అంతా గట్టిగా నమ్మింది. నార్త్‌లో మళ్లీ వందల కోట్ల వసూళ్లు పక్కా అని నమ్మారు సినీ జనాలు. కానీ ఆఫ్టర్ రిలీజ్ అంచనాలు తల కిందులు అయ్యాయి. యూనానిమస్‌ పాజిటివ్ టాక్ వస్తుందని ఎక్స్‌పెక్ట్‌ చేసిన లాల్‌ సింగ్ చడ్డా(Laal Singh Chaddha) మూవీ డివైడ్‌ టాక్‌తో సరిపెట్టుకుంది. ముందు నుంచే లాల్‌ సింగ్‌ చడ్డా మూవీ మీద నెగెటివ్‌ ట్రోల్‌ గట్టిగా జరిగింది. ఇప్పుడు రిజల్ట్ కూడా తేడా పడటంతో సినిమాను ఎపిక్ డిజార్ట్ అన్న మాటను వైరల్‌ చేస్తున్నారు నెటిజెన్స్‌. దీంతో కోలుకుంటుందన్న ఎక్స్‌పెక్టేషన్స్‌లో ఉన్న బాలీవుడ్ కాస్త డీలా పడిపోయింది.

ఈ వారమే రిలీజ్ అయిన మరో మూవీ రక్షా బంధన్‌( Raksha Bandhan Movie) కూడా నిరాశపరిచింది. ఇప్పటికే కష్టాల్లో ఉన్న అక్షయ్‌కి మరో ఫ్లాప్ పడిందంటున్నారు బాలీవుడ్ ఆడియన్స్‌. ఓవర్‌ మెలో డ్రామా, ఓవర్ సెంటిమెంట్స్‌తో రక్షాబంధన్ ఆడియన్స్‌ను ఇబ్బంది పెట్టిందన్న టాక్‌ వినిపిస్తోంది. ఈ వారం కూడా బాలీవుడ్‌లో సక్సెస్‌ సౌండ్ వినిపించకపోవటంతో మంచి రోజులెప్పుడొస్తాయా అని ఎదురుచూస్తున్నారు ఆడియన్స్‌.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.