Liger Movie: డబుల్ ఎనర్జీతో దుమ్మురేపిన అనన్య, విజయ్.. ఫ్యాన్స్‌ను ఫిదా చేస్తున్న కోకా 2.0 సాంగ్..
Liger Movie: ప్రస్తుతం బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ఎక్కడ చూసినా లైగర్ చర్చ జరుగుతోంది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. రౌడీ హీరో విజయ్ దేవరకొండ తొలిసారి చేస్తున్న పాన్ ఇండియా చిత్రం కావడం...
Liger Movie: ప్రస్తుతం బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ఎక్కడ చూసినా లైగర్ చర్చ జరుగుతోంది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. రౌడీ హీరో విజయ్ దేవరకొండ తొలిసారి చేస్తున్న పాన్ ఇండియా చిత్రం కావడం, కరణ్ జోహర్ వంటి అగ్ర నిర్మాత భాగస్వామి కావడం, మైక్ టైసస్ స్పెషల్ రోల్‌లో నటించడంతో ఈ సినిమాపై అందరిలోనూ క్యూరియాసిటీ పెంచేసింది. ఈ చిత్రాన్ని ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ ఎత్తున విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.
విడుదల తేదీ దగ్గర పడ్డ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌లో వేగాన్ని పెంచేసింది. ఇందులో భాగంగానే ఇప్పటికే విజయ్, అనన్యలు ముంబై వీధుల్లో షికార్లు కొడుతున్నారు. మునుపెన్నడూ లేని విధంగా టీ కొట్ల వద్ద, రైల్వేల్లో చక్కర్లు కొడుతూ ప్రమోషన్స్‌లో సరికొత్త పంథాకు తెర తీశారు. ఇక విజయ్ హాజరవుతోన్న ఈవెంట్స్‌కు ఫ్యాన్స్ కూడా పెద్ద ఎత్తున హాజరవుతుండడం రౌడీ హీరోకు బాలీవుడ్‌లో ఉన్న క్రేజ్‌కు అద్దం పడుతోంది. ఇక తాజాగా చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌లో భాగంగా సినిమా నుంచి మరో కొత్త పాటను విడుదల చేసింది.
గతంలో చెప్పినట్లుగానే చిత్ర యూనిట్ శుక్రవారం సాయంత్రం కోకా 2.0 సాంగ్‌ను విడుదల చేసింది. గతంలో లైగర్ నుంచి వచ్చిన పాటలకు ఏ మాత్రం తీసిపోకుండా ఈ కొత్త సాంగ్ ఉంది. ముఖ్యంగా విజయ్ తలపాగ, కుర్తా పైజామా, అనన్య లెహాంగాలో ట్రెడిషనల్ లుక్స్‌లో అదరగొట్టారు. చిత్ర యూనిట్ చెప్పినట్లుగానే ఈ పాట.. డబుల్ ఎనర్జీ, డబుల్ స్వాగ్, డబుల్ బీట్‌తో ఉంది. ఇక ఈ పాట ఇలా విడుదలైందో లేదా అలా వైరల్ అవుతోంది. విజయ్ ఫ్యాన్స్ సాంగ్‌ను తెగ వైరల్ చేస్తున్నారు.