AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Atrangi Re : విడుదలైన అత్రంగి రే ట్రైలర్‌.. సినిమా రిలీజ్ ఎప్పుడంటే..

బాలీవుడ్‌ స్టార్‌ హీరో అక్షయ్ కుమార్‌, యంగ్‌ బ్యూటీ సారా అలీ ఖాన్‌, కోలీవుడ్‌ స్టార్‌ ధనుష్‌లు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'అత్రంగి రే'..

Atrangi Re : విడుదలైన అత్రంగి రే ట్రైలర్‌.. సినిమా రిలీజ్ ఎప్పుడంటే..
Basha Shek
|

Updated on: Nov 24, 2021 | 9:19 PM

Share

బాలీవుడ్‌ స్టార్‌ హీరో అక్షయ్ కుమార్‌, యంగ్‌ బ్యూటీ సారా అలీ ఖాన్‌, కోలీవుడ్‌ స్టార్‌ ధనుష్‌లు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘అత్రంగి రే’ . ‘తను వెడ్స్‌ మను’ సిరీస్‌, ‘రాన్‌జానా’ సినిమాలతో ఆకట్టుకున్న ఆనంద్‌ ఎల్‌.రాయ్‌. ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అక్షయ్‌, ధనుష్‌ లాంటి స్టార్‌ హీరోలు నటిస్తుండడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. సినీ ప్రేక్షకులు కూడా ఆ చిత్రం విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ నిరీక్షణకు చిత్రబృందం తెరదించింది. మంగళవారం ఈ సినిమాలో అక్షయ్‌, ధనుష్‌, సారాల ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసిన చిత్రబృందం బుధవారం సినిమా ట్రైలర్‌ను రిలీజ్‌ చేసింది. అదేవిధంగా చిత్రం విడుదల తేదీని కూడా ప్రకటించింది. క్రిస్మస్‌ కానుకగా ఈ ఏడాది డిసెంబర్‌ 24న ఈ సినిమా డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌లో స్ట్రీమింగ్‌ కానుంది.

ఇక ట్రైలర్‌ విషయానికొస్తే.. సారా అలీ ఖాన్‌, ధనుష్‌ ఒకరికొకరు బలవంతంగా పెళ్లి చేసుకునే పాత్రలో అలరించారు. వారిద్దరి మధ్య సరదా సంభాషణలు ఆకట్టుకుంటున్నాయి. ఇక ట్రైలర్‌లో ఏనుగుపై ఎంట్రీ ఇచ్చి అభిమానులను అలరించాడు అక్షయ్‌ కుమార్‌. ఆయన ఈ సినిమాలో ఇంద్రజాలికుడిగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ సినిమా ట్రైలర్‌ను తన ఇన్‌స్టాలో షేర్ చేసింది. ‘అత్రంగి రే’ ట్రైలర్‌ వచ్చేసింది..ఈ అద్భుత క్షణాలను మీ అందరితో షేర్‌ చేసుకోకుండా ఉండలేకపోతున్నాను. మీ అందరికీ నా రింకు పాత‍్రను పరిచయం చేస్తున్నాను’ అని రాసుకొచ్చింది.Also Read:

Sai Dharam Tej : మీతో కలిసి సినిమా చూడటం కుదరలేదు.. సాయి ధరమ్ తేజ్ ఆడియో మెసేజ్..

Mahesh Babu-Rajamouli: టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ చేతికి మహేష్ -రాజమౌళి ప్రాజెక్ట్..

Manchi Rojulochaie: ఓటీటీలో సందడి చేయనున్న మంచి రోజులు వచ్చాయి.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే..