Akash Puri: ‘అమ్మానాన్న విడాకుల విషయంలో అసలు నిజం ఇదే’.. వైరల్ అవుతోన్న ఆకాశ్ పూరీ వ్యాఖ్యలు..
Akash Puri: దర్శకుడు పూరీ జగన్నాథ్ గురించి తెలియని సగటు సినీ ప్రేక్షకుడు ఉండరనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. సాధారణ అసిస్టెంట్ డైరకెక్టర్‌గా కెరీర్ మొదలు పెట్టి టాలీవుడ్‌లో అగ్ర దర్శకుడిగా...
Akash Puri: దర్శకుడు పూరీ జగన్నాథ్ గురించి తెలియని సగటు సినీ ప్రేక్షకుడు ఉండరనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. సాధారణ అసిస్టెంట్ డైరకెక్టర్‌గా కెరీర్ మొదలు పెట్టి టాలీవుడ్‌లో అగ్ర దర్శకుడిగా ఎదిగాడు జగన్నాథ్. ఎన్ని విజయాలను చూశాడో అన్నే అపజయాలను ఎదుర్కొన్నాడు పూరీ. కెరీర్‌లో పీక్ చూసిన పూరీ, చివరికి తాను పెంచుకున్న కుక్కలను సైతం అమ్ముకునే స్థితికి వచ్చాడు. అయితే బంతిని వేగంగా గోడకి కొడితే అంత వేగంతో తిరిగి వస్తుందన్నట్లు మళ్లీ బౌన్స్ బ్యాక్ అయ్యాడు. ఇక జయాపజయాలతో పాటు పూరీ పర్సనల్ లైఫ్ గురించి కూడా చాలా రుమార్లు షికార్లు చేశాయి. ఒకానొక సమయంలో పూరీ తన భార్యకు విడాకులు ఇస్తున్నట్లు, మరో హీరోయిన్‌తో సహజీవనం చేస్తున్నాడు అన్నట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే పూరీ ఈ వార్తలను ఎప్పటికప్పుడు ఖండిస్తూ వచ్చాడు.
అయితే తాజాగా ఈ వార్తలపై పూరీ తనయుడు ఆకాశ్ పూరీ స్పందించాడు. ఆకాశ్ ప్రస్తుతం నటిస్తోన్న చిత్రం ‘చోర్ బజార్’ ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆకాశ్ తన తండ్రిపై వచ్చిన పుకార్లపై స్పందించాడు. ‘అమ్మానాన్న విడాకులు తీసుకుంటారన్న వార్త నేనింతవరకు వినలేదు. నాన్నకు పెద్ద సపోర్ట్ అమ్మే. వారిది ప్రేమ వివాహం. కొందరు టైంపాస్ కోసం వీరు విడాకులు తీసుకుంటున్నారంటూ ఇష్టం వచ్చినట్లు రాస్తూనే ఉంటారు. కానీ అదైతే నిజం కాదు’ అని చెప్పుకొచ్చాడు.
ఇక తన పేరెంట్స్ ప్రేమకు సంబంధించిన ఆసక్తికర విషయాన్ని పంచుకున్న ఆకాశ్.. ‘మా పేరెంట్స్ లవ్‌లో ఉన్న సమయంలో నాన్న అమ్మకు ఫోన్ చేసి పెళ్లి చేసుకుందాం, వస్తావా? అని అడిగాడు. హా, వచ్చేస్తానంది అమ్మ. నా జేబులో రూ.200 మాత్రమే ఉన్నాయి. రేపు ఎలా ఉంటుందో కూడా తెలీదు, నన్ను పెళ్లి చేసుకుంటావా? అని అడిగాడట. క్షణం కూడా ఆలోచించకుండా చేసుకుంటానని వచ్చేసింది. ఇంతలా ప్రేమించేవాళ్లు నిజంగా ఉంటారా? అనిపించింది’ అని తమ తల్లిదండ్రులపై జరిగిన పుకార్లకు చెక్ పెట్టాడు ఆకాశ్.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..