Adipurush Trailer: ప్రభాస్ ఫ్యాన్స్ గెట్ రడీ.. ఆదిపురుష్ ట్రైలర్ వచ్చేస్తోంది. అధికారిక తేదీ..
ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న ఆదిపురుష్ చిత్రంపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రామాయణ ఇతిహాసం ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై దేశ వ్యాప్తంగా అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే...
ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న ఆదిపురుష్ చిత్రంపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రామాయణ ఇతిహాసం ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై దేశ వ్యాప్తంగా అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే షూటింగ్ సమయంలో ఈ సినిమాపై ఉన్న అంచనాలు టీజర్ విడుదల తర్వాత ఒక్కసారిగా తగ్గాయి. టీజర్‌లో గ్రాఫిక్స్ నాసిరకంగా ఉందంటూ సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ విపరీతంగా వచ్చాయి. అయితే తాజాగా చిత్ర యూనిట్ విడుదల చేస్తున్న అప్‌డేట్స్‌తో ఒక్కసారిగా ఆ ట్రోలింగ్‌లకు చెక్ పడింది. తాజాగా ఆదిపురుష్ నుంచి ప్రభాస్ లుక్, సీత పాత్రలో నటిస్తున్న కృతి సనన్ పోస్టర్‌కి ఆడియన్స్ ఫిదా అవుతున్నారు.
మొన్నటి వరకు నెగిటివ్ టాక్‌ను సొంతం చేసుకున్న ఆదిపురుష్‌కి ఒక్కసారిగా బజ్ పెరిగింది. దీంతో సినిమా విడుదలపై అందరి దృష్టి పడింది. జూన్ 16వ తేదీన సినిమా విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌లో వేగాన్ని పెంచేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగానే వరుసగా అప్‌డేట్స్ ఇస్తూ వస్తోన్న చిత్ర యూనిట్ తాజాగా ట్రైలర్‌ను విడుదల చేసేందుకు సిద్ధమైంది. మే 9వ తేదీన ట్రైలర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. సుమారు 3 నిమిషాల నిడివి ఉండనున్న ట్రైలర్ మరో కొత్త లోకానికి తీసుకెళ్లడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమాతో ఉంది. ఇసారి ఎలాంటి తప్పు జరగకుండా దర్శకుడు పకడ్బందీ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే రామాయణం ఇతివృత్తంగా తెరకెక్కుతోన్ ఆదిపురుష్ మూవీలో ప్రభాస్ రాముడిగా నటిస్తుండగా.. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ రావణుడి పాత్రలో కనిపించనున్నారు. ఇక సీతగా బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ నటిస్తోంది. అలాగే మరో ముఖ్య పాత్ర లక్ష్మణుడిగా సన్నీ సింగ్ నటించనున్నాడు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమాను జూన్ 16న ప్రేక్షకుల ముందుకు దీసుకురానున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..