మరోసారి తన నోటికి పని చెప్పిన వనితా విజయ్ కుమార్.. స్టేజ్‏పైనే ఇష్టానుసారంగా మాటలు.. ధీటుగా కౌంటర్ ఇచ్చిన శివగామి..

వనితా విజయ్ కుమార్‏కు వివాదాలు కొత్తేమి కాదు. ముఖ్యంగా పెళ్లి.. విడాకుల విషయంలో గతంలో వనితా నిత్యం వార్తల్లో నిలిచింది. నటిగా ఒక వైపు నటిస్తూనే..

మరోసారి తన నోటికి పని చెప్పిన వనితా విజయ్ కుమార్.. స్టేజ్‏పైనే ఇష్టానుసారంగా మాటలు.. ధీటుగా కౌంటర్ ఇచ్చిన శివగామి..
Vanitha Vijay Kumar
Follow us
Rajitha Chanti

|

Updated on: Jul 22, 2021 | 7:16 AM

వనితా విజయ్ కుమార్‏కు వివాదాలు కొత్తేమి కాదు. ముఖ్యంగా పెళ్లి.. విడాకుల విషయంలో గతంలో వనితా నిత్యం వార్తల్లో నిలిచింది. నటిగా ఒక వైపు నటిస్తూనే..మరోవైపు బుల్లితెర ప్రసారమయ్యే పలు షోలలో వనితా విజయ్ కుమార్ పాల్గోంటుంది. గతంలో బిగ్‏బాస్‏లో ఉన్నప్పుడు వనితా ప్రవర్తన.. మాటలతో వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. గతేడాది ఆమె పెళ్లి సమయంలో నెట్టింట్లో పెద్ద రచ్చే జరిగింది. ఆ తర్వాత పెళ్లి.. విడాకుల గురించి న్యూస్ ఛానెల్స్‏లో మాట్లాడిన వారి పట్ల అత్యంత కఠిన పదాలు వాడుతూ దూషించడం కూడా చేసింది. దీంతో వనితా తీరును కొందరు తమిళ ఇండస్ట్రీ వారు తప్పుబట్టారు. ఇక ఇటీవల జరిగిన పెళ్లిని క్యాన్సిల్ చేసుకుంటున్నట్లుగా ప్రకటించడంతో మరోసారి వార్తల్లో నిలిచింది.

అయితే వనీతా విజయ్ కుమార్.. ప్రముఖ ఛానెల్‏లో ప్రసారమయ్యే బీబీ జోడిగల్ డాన్స్ షోలో పాల్గోంటున్న సంగతి తెలిసిందే. గతంలో ఈ షో నుంచి తప్పుకుంటున్నట్లుగా కూడా ప్రకటించింది. అయితే మళ్లీ ఏం జరిగిందో ఏమో తెలీదు కానీ.. తిరిగి షోలో ఫెర్ఫామెన్స్ చేస్తోంది. ఇక తాజా ఎపిసోడ్ లో వనిత విజయ్ కుమార్ అమ్మవారి వేశంలో డాన్స్ చేసింది. ఆ డాన్స్ గురించి రమ్యకృష్ణ స్పందిస్తూ మేకప్ చాలా బాగుందని పేర్కొన్నారు. అయితే డాన్స్‏లో మాత్రం అంత నైపుణ్యం కనిపించలేదని.. కొరియోగ్రాఫర్‏ను పిలిచి ఇంకా కొంచెం ఎక్కువ ప్రాక్టీస్ చేయించడంతో పాటు బాగా కంపోజ్ చేస్తే బాగుండేది అంటూ వ్యాఖ్యలు చేసింది. అక్కడే ఉన్న వనితా విజయ్ కుమార్ కోపంతో.. జడ్జ్‏మెంట్ ఇవ్వకుండా మీ వ్యక్తిగత అభిప్రాయంను చెబుతున్నారు అంటూ అసహనం వ్యక్తం చేసింది. నా డాన్స్‏ను ఇతర కంటెస్టెంట్స్‏తో పోల్చడం ఎంటీ అంటూ వనిత విజయ్ కుమార్ ఇంకాస్త గట్టిగానే రమ్యకృష్ణ పై విమర్శలు చేసింది. ఇక రమ్య కృష్ణ కూడా తీవ్రంగానే స్పందించింది. ఇలా జడ్జ్‏మెంట్ ఇవ్వడం కొత్తేం కాదని.. రమ్యకృష్ణ సీరియస్‏గా మాట్లాడింది. అదే సమయంలో అక్కడే ఉన్న మరో జడ్డ్ కూడా రమ్యకృష్ణకు సపోర్ట్‏గా మాట్లాడటంతో.. వనితా కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది.

Also Read: Vishal: మరోసారి షూటింగ్ సెట్‏లో ప్రమాదం… తీవ్రంగా గాయపడ్డ హీరో విశాల్..

Sri Rama: తెరపైకి సిక్స్‌ ప్యాక్‌ రాముడు, వీఎఫ్‌ఎక్స్‌ రాముడు వస్తున్నాడు.. మరి ఆ ఎన్టీ రాముడిని మైమరిపిస్తాడంటారా.?

రాజమౌళి గురించి తమిళ హీరో ఎవరైనా ఇలాగే మాట్లాడితే ఊరుకుంటారా.? బాలకృష్ణ వ్యాఖ్యలపై ఫైర్‌ అవుతోన్న రెహమాన్‌ ఫ్యాన్స్‌.