AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vishal: మరోసారి షూటింగ్ సెట్‏లో ప్రమాదం… తీవ్రంగా గాయపడ్డ హీరో విశాల్..

సినిమా షూటింగ్స్ జరుగుతున్న సమయంలో ప్రమాదాలు జరగడం కామన్. అయితే కొన్ని సందర్భాల్లో స్టార్ హీరోహీరోయిన్స్

Vishal: మరోసారి షూటింగ్ సెట్‏లో ప్రమాదం... తీవ్రంగా గాయపడ్డ హీరో విశాల్..
Vishal 1
Rajitha Chanti
|

Updated on: Jul 22, 2021 | 6:55 AM

Share

సినిమా షూటింగ్స్ జరుగుతున్న సమయంలో ప్రమాదాలు జరగడం కామన్. అయితే కొన్ని సందర్భాల్లో స్టార్ హీరోహీరోయిన్స్ సైతం తీవ్రంగా గాయపడిన సంఘటనలు అనేకం. అయితే తాజాగా తమిళ స్టార్ హీరో విశాల్ మరోసారి షూటింగ్‏లో తీవ్రంగా గాయపడ్డారు. గతంలో ఓసారి ఫైట్ సీన్ చిత్రీకరణలో గాయపడిన విశాల్.. ఇప్పుడు కూడా యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించే సమయంలోనే గాయాలపాలయ్యారు. ప్రస్తుతం… విశాల్ నాట్ ఏ కామన్ మ్యాన్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి శరవణన్ దర్శకత్వం వహిస్తుండగా.. కరోనా లాక్ డౌన్ తర్వాత ఇటీవలే తిరిగి ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ తుదిదశకు చేరుకుంది. కేవలం క్లైమాక్స్‏ సన్నివేశాలు మాత్రమే బ్యాలెన్స్ ఉంది.

Vishal

Vishal

అయితే ఇటీవల క్లైమాక్స్‏లో ఓ భారీ యాక్షన్ సీన్ కోసం భారీ సెట్ ఏర్పాటు చేశారు. ఫైట్ మాస్టర్.. యాక్షన్ భారీ స్టంట్లు కంపోజ్ చేశారు. అయితే ఇందులో ఓ స్టంట్ చేసే సమయంలో అంచనా మిస్ కావడంతో విశాల్ గాయపడ్డారు. విలన్ బలంగా విసిరికొట్టడంతో వెళ్లి గోడకు బలంగా తాకాడు. దీంతో.. వెన్నుకు దెబ్బ తగలడంతో హీరో అక్కడే పడిపోయాడు. వెంటనే స్పందించిన చిత్ర యూనిట్ షూటింగ్ ను అర్ధంతరంగా నిలిపేసి.. విశాల్ ను ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో విశాల్ వెన్నుకు కాస్త బలమైన దెబ్బ తగిలినట్టుగా సమాచారం. ఇదిలా ఉంటే.. గతంలోనూ హీరో విశాల్ షూటింగ్ సమయంలో గాయపడ్డాడు. ఫైట్ సీన్ లో నటుల మధ్య కో-ఆర్డినేషన్ మిస్ మ్యాచ్ కావడంతో.. విశాల్ తలకు కన్ను ప్రాంతంలో గాయాలయ్యాయి. హీరో విశాల్ ప్రతిసారీ ఇలా గాయపడుతుండడంతో ఆయన అభిమానులు ఆందోలన వ్యక్తం చేస్తున్నారు.

Also Read: రాజమౌళి గురించి తమిళ హీరో ఎవరైనా ఇలాగే మాట్లాడితే ఊరుకుంటారా.? బాలకృష్ణ వ్యాఖ్యలపై ఫైర్‌ అవుతోన్న రెహమాన్‌ ఫ్యాన్స్‌.

Prabhas: డాన్‏గా ప్రభాస్.. కొత్త సినిమా కాదు గురూ.. అసలు విషయం వీడియోలో చూసేయ్యండి..