AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas: డాన్‏గా ప్రభాస్.. కొత్త సినిమా కాదు గురూ.. అసలు విషయం వీడియోలో చూసేయ్యండి..

రెబల్ స్టార్ ప్రభాస్.. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా గడిపేస్తున్నాడు. డార్లింగ్ చేస్తున్న మూడు సినిమాలు ప్రస్తుతం సెట్స్ పై ఉండగా.. మరో ప్రాజెక్ట్ ఇంకా స్టార్ట్ కాలేదు.

Prabhas: డాన్‏గా ప్రభాస్.. కొత్త సినిమా కాదు గురూ.. అసలు విషయం వీడియోలో చూసేయ్యండి..
Prabhas
Rajitha Chanti
|

Updated on: Jul 21, 2021 | 9:37 PM

Share

రెబల్ స్టార్ ప్రభాస్.. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా గడిపేస్తున్నాడు. డార్లింగ్ చేస్తున్న మూడు సినిమాలు ప్రస్తుతం సెట్స్ పై ఉండగా.. మరో ప్రాజెక్ట్ ఇంకా స్టార్ట్ కాలేదు. అటు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ చేస్తున్న రెబల్ స్టార్.. బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ డైరెక్షన్‏లో ఆదిపురుష్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఎదురుచూస్తున్న రాదేశ్యామ్ సినిమా చివరి దశ షూటింగ్ జరుపుకుంటుంది. దీంతో ప్రభాస్.. అటు ముంబై, హైదరాబాద్ మధ్య ప్రయాణాలు సాగిస్తూనే ఉన్నాయి. తాజాగా ఈరోజు డార్లింగ్ ప్రభాస్ విమానాశ్రయంలో ప్రత్యక్షమయ్యాడు. ఇటలీ పర్యటనను ముగించి బుధవారం హైదరాబాద్‏లో అడుగుపెట్టాడు.

అయితే ప్రభాస్ ఎయిర్ పోర్ట్‏లో డాన్‏గా ప్రత్యక్షమయ్యాడు. తన బాడీగార్డ్స్ మధ్యలో నడిచోస్తున్న ప్రభాస్.. అచ్చం మాఫియా డాన్‏గా కనిపించడంతో.. అక్కడున్న వారు షాకయ్యారు. లూజ్ బ్లాక్ షర్ట్ .. పెన్సిల్ కట్ ఫ్యాంట్ తో అతడి రూపం ఎంతో ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తోంది. ముఖ్యంగా తన జుట్టును బీనితో కవర్ చేయడంతో అది అందరికీ సర్ ప్రైజింగ్ గా మారింది. అతను సాధారణ దుస్తులు ధరించి సింపుల్ గా కనిపిస్తున్నా.. తన ముఖాన్ని రివీల్ చేసేందుకు మాత్రం అస్సలు ఆసక్తిగా లేడు.

అయితే ప్రభాస్.. రాధేశ్యామ్ మూవీకి సంబంధించిన షూటింగ్ పూర్తి చేసేందుకు ఇటలీ వెళ్లాడట. అక్కడి షూటింగ్ పూర్తి చేసుకుని ఈరోజు హైదరాబాద్ చేరుకున్నాడు. ఇక ఆ తర్వాత సలార్, ఆదిపురుష్ సినిమాల షూటింగ్స్ కోసం తన డేట్స్ కేటాయించనున్నట్లుగా తెలుస్తోంది. ఇక ప్రభాస్.. నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చే సైన్స్ ఫిక్షన్ సినిమా త్వరలోనే ప్రారంభం కానున్నట్లుగా తెలుస్తుంది.

వీడియో..

Also Read: Sekhar Master: శేఖర్ మాస్టర్ అభిమానులకు షాకిచ్చిన గూగుల్.. ఆ విషయంలో పెద్ద పొరపాటే..

Taapsee Pannu: మిషన్ ఇంపాజిబుల్ కోసం తాప్సీ నయా గెటప్.. కీలక పాత్రలో పంజాబీ బ్యూటీ..

Anasuya: వర్షంపై కవిత్వాన్ని షేర్ చేసిన అనసూయ.. ఆ అందమైన కవిత్వం ఎవరు రాసిందో తెలుసా..