రాజమౌళి గురించి తమిళ హీరో ఎవరైనా ఇలాగే మాట్లాడితే ఊరుకుంటారా.? బాలకృష్ణ వ్యాఖ్యలపై ఫైర్‌ అవుతోన్న రెహమాన్‌ ఫ్యాన్స్‌.

Balakrishna AR Rahman: నట సింహం బాలకృష్ణ సినిమాలో ఎంత అగ్రెసివ్‌గా ఉంటారో బయట కూడా అలాగే ఉంటారు. తన మనసులో ఉన్న మాటను ఎలాంటి మొహమాటం లేకుండా చెప్పేస్తుంటారు. ఈ క్రమంలోనే అప్పుడప్పుడు...

రాజమౌళి గురించి తమిళ హీరో ఎవరైనా ఇలాగే మాట్లాడితే ఊరుకుంటారా.? బాలకృష్ణ వ్యాఖ్యలపై ఫైర్‌ అవుతోన్న రెహమాన్‌ ఫ్యాన్స్‌.
Rahaman Balakrishna
Follow us
Narender Vaitla

|

Updated on: Jul 21, 2021 | 11:11 PM

Balakrishna AR Rahman: నట సింహం బాలకృష్ణ సినిమాలో ఎంత అగ్రెసివ్‌గా ఉంటారో బయట కూడా అలాగే ఉంటారు. తన మనసులో ఉన్న మాటను ఎలాంటి మొహమాటం లేకుండా చెప్పేస్తుంటారు. ఈ క్రమంలోనే అప్పుడప్పుడు ఆయన చేసే వ్యాఖ్యలు తీవ్ర కాంట్రవర్సీకి సైతం దారి తీస్తుంటాయి. తాజాగా బాలయ్య బాబు చేసిన ఇలాంటి వ్యాఖ్యలే తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. బాలకృష్ణ కెరీర్‌లో ఉత్తమమైన చిత్రాల్లో ఒకటైన ‘ఆదిత్య 369’ చిత్రం విడుదలై జులై 18 నాటికి 30 ఏళ్లు పూర్తయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌ ఆనాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ ఓ వీడియోను విడుదల చేసింది. ఇదే సందర్భా్న్ని పురస్కరించుకొని టీవీ9 బాలకృష్ణను ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేసింది. ఈ సందర్భంగా ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలే ఇప్పుడు టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారాయి.

వివరాల్లోకి వెళితే.. ‘ఆదిత్య 369′ చిత్రానికి సంబంధించి ప్రశ్నలు అడుగుతూ యాంకర్‌.. సినిమా సంగీతం గురించి ప్రశ్నించారు. ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ.. ‘రెహమాన్ ఎవరో నాకు తెలియదు. నేను పట్టించుకోను. పదేళ్లకు ఓ హిట్ ఇస్తాడు. ఆస్కార్ అవార్డ్.. అందుకే ‘భారతరత్న’ అంటే రామారావు చెప్పుతో సమానం.. కాలి గోటితో సమానం అన్నాను చివరికి. ఇచ్చినోళ్లకు గౌరవం కానీ.. ఆయనకు గౌరవం ఏంటి? పదవులకు ఆయన అలంకారం ఏమో కానీ.. ఆయనకు పదవులు ఎప్పుడూ అలంకారం కాదు అని అన్నాను’ అంటూ వ్యాఖ్యానించారు.

రాజమౌళి గురించి ఇలాగే మాట్లాడితే ఊరుకుంటారా.?

బాలకృష్ణ చేసిన ఈ వ్యాఖ్యలపై ప్రస్తుతం నెట్టింట రచ్చ జరుగుతోంది. బాలయ్య మాట్లాడిన తీరుపై అభిమానులు ఫైర్‌ అవుతున్నారు. ‘అసలు ఈ బాలకృష్ణ ఎవరు..? మొదటి సారి రెహమాన్‌ గారి వార్తల కారణంగా వింటున్నాను’ అంటూ ఓ నెటిజన్‌ ట్వీట్ చేశాడు. ఇక మరో అభిమాని ట్వీట్ చేస్తూ.. ‘బాలకృష్ణ లాంటి ఒక సీనియర్ నటుడు లెజెండ్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ పట్ల అలా ఎలా మాట్లాడతారు. ఎవరైనా తమిళ హీరో దర్శకుడు రాజమౌళి గురించి ఇలాగే మాట్లాడితే తెలుగు ఆడియన్స్‌ ఊరుకుంటారా’ అంటూ ప్రశ్నించాడు. ‘తెలుగు ప్రజలు కూడా దీనిని ఖండిస్తారు. ఎందుకంటే బాలకృష్ణ నటించిన ‘నిప్పు రవ్వ’ చిత్రానికి రెహమాన్‌ సంగీతం అందించారు’ అంటూ మరో నెటిజన్‌ కామెంట్ చేశాడు. ‘రెహమాన్‌ తెలుగులో తొలిసారి సంగీతం అందించింది.. బాలకృష్ణ సినిమాకే’ అంటూ మరో యూజర్ ట్వీట్ చేశాడు. మరి ఈ వ్యవహారం ఎక్కడి వరకు వెళుతుందో చూడాలి.

Also Read: Prabhas: డాన్‏గా ప్రభాస్.. కొత్త సినిమా కాదు గురూ.. అసలు విషయం వీడియోలో చూసేయ్యండి..

Taapsee Pannu: మిషన్ ఇంపాజిబుల్ కోసం తాప్సీ నయా గెటప్.. కీలక పాత్రలో పంజాబీ బ్యూటీ..

Anasuya: వర్షంపై కవిత్వాన్ని షేర్ చేసిన అనసూయ.. ఆ అందమైన కవిత్వం ఎవరు రాసిందో తెలుసా..