Taapsee: వస్తే చేయడానికి అభ్యంతరం ఏముంది.? ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన తాప్సీ
ఇక 2016లో బాలీవుడ్‌లో నటించిన 'పింక్' మూవీతో తాప్సీ కెరీర్ ఒక్కసారిగా మలుపు తిరిగింది. ఈ సినిమా విజయంతో తాప్సీ పేరు బాలీవుడ్‌లో ఒక్కసారిగా మారుమోగింది. తాప్సీ నటనకు బాలీవుడ్ ప్రేక్షకులు ఫిదా అయ్యారు. దీంతో ఈ బ్యూటీకి వరుస ఆఫర్లు క్యూకట్టాయి. ముఖ్యంగా ఉమెన్ ఓరియెంటెడ్ మూవీలు తాప్సీకి మంచి పేరు తీసుకొచ్చాయి. బాలీవుడ్‌లో హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ అంటే మొదటి...

2010లో వచ్చిన ‘ఝుమ్మంది నాధం’ సినిమాతో వెండి తెరకు పరిచయమైంది అందాల తార తాప్సీ. అనంతరం తెలుగులో పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి మెప్పించిన నటి తెలుగులో దాదాపు అందరు యంగ్ టాప్ హీరోల సరసన నటించింది. ఇక తెలుగులో పలు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు తమిళంలోనూ సినిమాలు చేస్తూ వచ్చిందీ బ్యూటీ.
ఇక 2016లో బాలీవుడ్‌లో నటించిన ‘పింక్’ మూవీతో తాప్సీ కెరీర్ ఒక్కసారిగా మలుపు తిరిగింది. ఈ సినిమా విజయంతో తాప్సీ పేరు బాలీవుడ్‌లో ఒక్కసారిగా మారుమోగింది. తాప్సీ నటనకు బాలీవుడ్ ప్రేక్షకులు ఫిదా అయ్యారు. దీంతో ఈ బ్యూటీకి వరుస ఆఫర్లు క్యూకట్టాయి. ముఖ్యంగా ఉమెన్ ఓరియెంటెడ్ మూవీలు తాప్సీకి మంచి పేరు తీసుకొచ్చాయి. బాలీవుడ్‌లో హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ అంటే మొదటి ఆప్షన్ తాప్సీ అనే స్థాయికి చేరుకుంది. వరుస విజయాలతో దూసుకుపోయింది. దీంతో బాలీవుడ్‌కే ఎక్కువగా పరిమితమైన తాప్సీ తెలుగులో మాత్రం పెద్దగా నటించలేదు.
అడపాదడపా తప్ప మ్యాగ్జిమం బాలీవుడ్ సినిమాలతో బిజీగా మారిందీ బ్యూటీ. ప్రస్తుతం తాప్సీ చేతిలో 4 సినిమాలు ఉండగా అవన్నీ హీందీ చిత్రాలే కావడం గమనార్హం. ఈ క్రమంలోనే తాజాగా తాప్సీకి ఓ ఇంటర్వ్యూలో ఇలాంటి ప్రశ్నే ఎదురైంది. తెలుగు సినిమాల్లో ఎందుకు నటించడం లేదంటూ అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. ‘నేనేం చెయ్యను. సరైన అవకాశాలు రావడంలేదు. అడపాదడపా వచ్చినా కథలేమో నచ్చట్లేదు. కథలు నచ్చకపోతే సినిమాలు చేయను’ అంటూ తేల్చి చెప్పేసిందీ చిన్నది.
తాప్సీ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్..
View this post on Instagram
ఇక కేవలం కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీస్‌లోనే నటిస్తూ వస్తోన్న తాప్సీకి కమర్షియల్ హీరోలతో మాస్ సినిమాల్లో ఎందుకు నటించడం లేదన్న ప్రశ్న ఎదురైంది. దీనికి బధులిస్తూ.. అలాంటి అవకాశాలు రావడం లేదు, వస్తే చేయడానిఇ అభ్యంతం ఏముంది.? అంటూ చెప్పుకొచచింది. అయితే చిన్న సినిమాల్లో నటించడమే బాగుంటుందన్న తాప్సీ.. డబ్బులు తక్కువ వచ్చినా అలాంటి సినిమాల్లో టించడం వల్ల ఆత్మ సంతృప్తి ఉంటుందని తెలిపింది. ఇలాంటి సినిమాల్లో అన్నే తానే అయి ఉంటుందని, కథ అంతా తన చుట్టూ తిరుగుతుందని చెప్పుకొచ్చింది. ఇక ప్రేక్షకులు తన కోసమే థియేటర్లకు వస్తున్నారన్న ఫీలించ్ తెచ్చే ఆలోచన చాలా బాగుంటుందని మనసులో మాన బయట పెట్టిందీ చిన్నది.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..
