Bollywood: సినిమా ఫ్లాప్ అయ్యిందిగా, ఇంకెందుకు బతికున్నావ్ అన్నారు.. నటి ఆవేదన
పలాన హీరోయిన్ నటించిందంటే చాలు సినిమా ఫ్లాప్ అవ్వాల్సిందే అంటుంటారు. మరీ ముఖ్యంగా సోషల్ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత ఈ సంస్కృతి మరింత పెరిగి పోయింది. సినిమా అపజయాలకు హీరోయిన్లను బాధ్యులను చేస్తూ కొందరు సోషల్ మీడియాలో రెచ్చిపోతారు. తనకు కూడా ఇలాంటి ఓ అనుభవమే ఎదురైందని పంచుకుంది బాలీవుడ్ బ్యూటీ డైసీ షా. సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన జయ హో మూవీతో...

సినిమా ఇండస్ట్రీ అంటేనే విచితంగ్రా ఉంటుంది. విజయం దక్కితే ఆకాశానికి ఎత్తేశారు, వైఫల్యం పొందితే పాతాలానికి తొక్కేస్తారు. ఇది సర్వసాధారణమైన విషయం. కొన్ని సందర్భాల్లో విజయంలో తగినంత పాత్ర లభిస్తుందో లేదో తెలియదు కానీ, అపజయంలో మాత్రం కచ్చితంగా బ్లేమ్ అవ్వాల్సిందే. మరీ ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో ఇలాంటి వార్తలు ఎక్కువగా వింటుంటాం. ఒక హీరోయిన్ సినిమాలు వరుసగా ఫ్లాప్ అయితే చాలు, వెంటనే ఐరెన్ లెగ్ అనే ముద్ర వేసేస్తారు.
పలాన హీరోయిన్ నటించిందంటే చాలు సినిమా ఫ్లాప్ అవ్వాల్సిందే అంటుంటారు. మరీ ముఖ్యంగా సోషల్ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత ఈ సంస్కృతి మరింత పెరిగి పోయింది. సినిమా అపజయాలకు హీరోయిన్లను బాధ్యులను చేస్తూ కొందరు సోషల్ మీడియాలో రెచ్చిపోతారు. తనకు కూడా ఇలాంటి ఓ అనుభవమే ఎదురైందని పంచుకుంది బాలీవుడ్ బ్యూటీ డైసీ షా. సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన జయ హో మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ చిన్నది కెరీర్ తొలినాళ్లలో ఎదురైన ఓ చేదు అనుభవాన్ని అభిమానులతో పంచుకుంది.
2014లో వచ్చిన జయహో చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేక పోయింది. దీంతో ఆమెపై ఎన్నో విమర్శలు ఎదరయ్యాయి. సినిమా పరాజయాన్ని మొత్తం డైసీ షాపై నెట్టేసే ప్రయత్నం చేశారు. సినిమా విడుదల సమయంలో ఎన్నో విమర్శలు ఎన్నో ఎదుర్కొన్నానని తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో డైసీ కీలక వ్యాఖ్యలు చేసింది. తన వరకూ జయ హో చిత్రం మంచి విజయాన్నో అందుకున్న బ్యూటీ.. అసలు ఆ సమయంలో ఏం జరిగిందో చెప్పుకొచ్చింది.
డైసీ షా ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్..
View this post on Instagram
జయ హో పరాజయంపై స్పందించిన ఆమె.. ‘ఏక్ థా టైగర్’ సినిమా తర్వాత వచ్చిన చిత్రం కావడంతో జయ హోపై భారీగా అంచనాలు ఉన్నాయి. అయితే సినిమా ఆశించిన స్థాయిలో లేకపోవడం, ఆకట్టుకోలేకపోయింది. అయితే దీనిపై చాలా మంది తనను విమర్శించారని చెప్పుకొచ్చింది. ఎన్నో ట్రోల్స్‌ను ఎదుర్కొన్నానని, అసలు నువ్వు ఎందుకు బతికి ఉన్నావని కొందరు కామెంట్స్ చేశారని వాపోయింది. కొందరైతే ఏకంగా చచ్చిపోవచ్చు కదా, ఇంతకు మించి ఇంకేం చేయాలనుకుంటున్నావ్ అంటూ తీవ్రంగా దూషించారంటూ కామెంట్స్ చేశారి గతాన్ని తలుచుకొని బాధపడిందీ బ్యూటీ. ఇదిలా ఉంటే డైసీ షా అనంతరం.. పలు కన్నడ, తమిళ సినిమాల్లో మంచి విజయాలను అందుకుంది. ఇక బాలీవుడ్‌లోనూ స్పార్క్, హేట్ స్టోరీ3, రేస్ 3, మిస్టర్ ఆఫ్ ది టాటూ వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..
