AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Priyamani: ఒక్క ఫోటోతో పుకార్లకు చెక్ పెట్టిన ప్రియమణి.. విడాకుల వార్తలపై చెప్పకనే, చెప్పేసిందిగా..

Priyamani: సినీతారల వ్యక్తిగత విషయాలకు సంబంధించి ఏదో ఒక వార్త నిత్యం వైరల్‌గా మారుతూనే ఉంటుంది. ముఖ్యంగా నటీమణుల వైవాహిక జీవితానికి సంబంధించి రకరకాల వార్తలు..

Priyamani: ఒక్క ఫోటోతో పుకార్లకు చెక్ పెట్టిన ప్రియమణి.. విడాకుల వార్తలపై చెప్పకనే, చెప్పేసిందిగా..
Priyamani
Narender Vaitla
|

Updated on: Nov 07, 2021 | 8:45 AM

Share

Priyamani: సినీతారల వ్యక్తిగత విషయాలకు సంబంధించి ఏదో ఒక వార్త నిత్యం వైరల్‌గా మారుతూనే ఉంటుంది. ముఖ్యంగా నటీమణుల వైవాహిక జీవితానికి సంబంధించి రకరకాల వార్తలు వస్తుంటాయి. ఈ క్రమంలోనే ఇటీవల నటి ప్రియమణి, భర్త ముస్తాఫా రాజ్‌ నుంచి విడిపోతున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ముస్తాఫా మొదటి భార్య, అతనిపై ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తన భర్త నుంచి తాను విడాకులు తీసుకోలేదని, కాబట్టి ప్రియమణితో ముస్తాఫా చేసుకున్న పెళ్లి చెల్లదంటూ ఆమె కీలక వ్యాఖ్యలు చేసింది. దీంతో ఈ విషయంపై ప్రియమణికి ముస్తాఫాకు మధ్య మనస్పార్థాలు వచ్చాయని, ఈ కారణంగానే వీరిద్దరూ విడాకులు తీసుకోనున్నట్లు వార్తలు వచ్చాయి.

అయితే ఈ వార్తలపై ప్రియమణి ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో ఈ వార్తలు ఒకానొక సమయంలో బలం చేకూరినట్లైంది. అయితే తాజాగా ప్రియమణి ఒక ఫోటోతో ఈ పుకార్లన్నింటికీ చెక్‌ పెట్టింది. దీపావళి పండుగను పురస్కరించుకొని భర్తతో దిగిన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలో ప్రియమణి నవ్వుతూ, భర్తతో సాన్నిహిత్యంగా ఉంది. దీంతో వీరిద్దరూ మధ్య తేడా కొట్టిందని జరుగుతోన్న వార్తలకు ఫుల్‌ స్టాప్‌ పడినట్లు అయ్యింది. విడాకుల రూమర్స్‌కు నోరు విప్పకుండానే చెక్‌ పెట్టింది ప్రియమణి.

View this post on Instagram

A post shared by Priya Mani Raj (@pillumani)

ఇక ప్రియమణి కెరీర్‌ విషయానికొస్తే.. ఫ్యామీలీ మ్యాన్‌ వెబ్‌ సిరీస్‌తో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా మళ్లీ అందరి దృష్టిని ఆకర్షించిన ప్రియమణి ప్రస్తుతం పలు సినిమాలతో పాటు ఢీ వంటి రియాలిటీ షోలలో సందడి చేస్తున్న విషయం తెలిసిందే.

Also Read: Heavy rainfall: తమిళనాడులో దంచికొడుతున్న వానలు.. నీటమునిగిన చెన్నై నగరం..

Weight Lose: బరువు తగ్గాలనుకుంటున్నారా.. అయితే ఇవి పాటించండి చాలు..

SBI Customers Alert: ఎస్‌బీఐ కీలక ప్రకటన.. మీరు పొరపాటున ఇలా చేసినట్లయితే మోసపోవాల్సిందే..