Meenakshi chaudhary: ఎట్టకేలకు ఛాన్స్‌ కొట్టేసిన హిట్‌ బ్యూటీ.. యంగ్‌ హీరో సరసన నటించే అవకాశం.

ఇచ్చట వాహనాలు నిలపరాదు అనే సినిమాతో తెలుగు తెరకు పరచయమైంది హర్యాన బ్యూటీ మీనాక్షి చౌదరి. తొలి సినిమాతోనే తన అందందో ఆకట్టుకున్న ఈ చిన్నది రెండో సినిమాలోనే ఏకంగా రవితేజ సరసన నటించే లక్కీ ఛాన్స్‌ కొట్టేసింది. ఇక ఈ సినిమా తర్వాత అడవి శేష్‌ హీరోగా తెరకెక్కిన హిట్‌-2 సినిమాలో నటించి..

Meenakshi chaudhary: ఎట్టకేలకు ఛాన్స్‌ కొట్టేసిన హిట్‌ బ్యూటీ.. యంగ్‌ హీరో సరసన నటించే అవకాశం.
Meenakshi Chaudhary
Follow us
Narender Vaitla

|

Updated on: Mar 20, 2023 | 11:10 AM

ఇచ్చట వాహనాలు నిలపరాదు అనే సినిమాతో తెలుగు తెరకు పరచయమైంది హర్యాన బ్యూటీ మీనాక్షి చౌదరి. తొలి సినిమాతోనే తన అందందో ఆకట్టుకున్న ఈ చిన్నది రెండో సినిమాలోనే ఏకంగా రవితేజ సరసన నటించే లక్కీ ఛాన్స్‌ కొట్టేసింది. ఇక ఈ సినిమా తర్వాత అడవి శేష్‌ హీరోగా తెరకెక్కిన హిట్‌-2 సినిమాలో నటించి మెప్పించింది. వరుసగా రెండు విజయాలను అందుకున్నా మీనాక్షికి అవకాశాలు మాత్రం రాలేదనే చెప్పాలి. హిట్‌-2 తర్వాత ఈ బ్యూటీ సినిమా ఆఫర్స్‌ క్యూకడుతాయని అంతా భావించారు. కానీ పరిస్థితి దీనికి పూర్తి భిన్నంగా మారింది. హిట్‌ మూవీ వచ్చి మూడు నెలలు దాటుతోన్నా మీనాక్షి తన తదుపరి చిత్రాన్ని ప్రకటించలేదు.

ఇదిలా ఉంటే మీనాక్షికి ఎట్టకేలకు అవకాశం వచ్చేసింది. విశ్వక్‌ సేన్ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రంలో మీనాక్షి ఛాన్స్‌ కొట్టేసింది. రవితేజ ముళ్లపూడి అనే నూతన దర్శకుడు డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను విశ్వక్‌ సేన్‌ తాజాగా లాంచ్‌ చేశారు. ఈ సినిమాలో విశ్వక్‌కు జోడిగా మీనాక్షిని చిత్ర యూనిట్ ఫైనల్ చేసింది. ఎస్ఆర్టీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రామ్ తాళ్లూరి నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కనుంది.

మరి ఈ సినిమాతో మీనాక్షి ఫేట్ ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి. ప్రస్తుతం ధమ్కీ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న విశ్వక్‌.. ఈ సినిమా విడుదల తర్వాత కొత్త సినిమా షూటింగ్‌లో బిజీగా మారనున్నారు. ఇదిలా ఉంటే.. హిట్‌2 తర్వాత ఆఫర్లు అందుకోని మీనాక్షికి విశ్వక్‌ అయినా కలిసొస్తాడో అనే చర్చ జరుగుతోంది. ఇదిలా ఉంటే హిట్‌2 తర్వాత మీనాక్షి తెలుగులో నటించకపోయినా తమిళంలో మాత్రం ఓ చిత్రంలో తళుక్కుమంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..