- Telugu News Photo Gallery Cinema photos Sobhan Babu death anniversary special Rare Photos goes viral in social media on 20 03 2023 Telugu Actors Photos
Sobhan Babu: తెలుగుతెరకు అందాలు అద్దిన వెండితెర సోగ్గాడు.. శోభన్ బాబు గురించి మరిన్ని వివరాలు..
తెలుగు చిత్రపరిశ్రమలో ఒకప్పుడు స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగిన హీరో శోభన్ బాబు. అప్పట్లో ఆయన అందానికి ఎంతో మంది ఫిదా అయ్యారు. ముఖ్యంగా ఈ హీరోకు లేడీ ఫాలోయింగ్ ఎక్కువగా ఉండేది.
Updated on: Mar 20, 2023 | 1:08 PM

శోభన్‌బాబు.. టాలీవుడ్ సోగ్గాడిగా గుర్తింపు తెచ్చుకున్న ఈ నటుడి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఎన్టీఆర్, ఏఎన్నార్‌ల హయాంలో ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయారాయన.

అలాగే మాస్ సినిమాలతోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఎన్టీఆర్ తర్వాత రాముని పాత్రలో తెలుగింటి ప్రేక్షకులకు గుర్తుండిపోయే పోయే ముఖం శోభన్‌బాబుదే.

ఇలా అన్ని జానర్లలోనూ నటించి ఎవర్‌గ్రీన్ సోగ్గాడిగా గుర్తింపు పొందిన నటభూషణ శోభన్‌బాబు వర్ధంతి నేడు. ఈ సందర్భంగా హైదరాబాద్ నగరంలో శోభన్ బాబు సేవా సమితి ఆధ్వర్యంలో తార్నాక చౌరస్తాలో శోభన్ బాబు చిత్ర పటాన్ని ఏర్పాటుచేసి నివాళులు అర్పించారు.

ప్రేమ కథలతో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుని అందాల నటుడిగా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయారు. అప్పట్లో ఆయన అందానికి ఎంతో మంది ఫిదా అయ్యారు.

ముఖ్యంగా ఈ హీరోకు లేడీ ఫాలోయింగ్ ఎక్కువగా ఉండేది. కేవలం హీరోయిజం మాత్రమే కాదు.. కథకు ప్రాధాన్యత ఉన్న చిత్రాల్లోనే నటించారు ఆయన.

ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా అప్పట్లోనే సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి అతి తక్కువ సమయంలోనే అగ్రకథానాయకుడిగా కొనసాగారు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన ఆయన..

తరతరాలు తిన్నా తరగని ఆస్తులను సంపాదించిన హీరో అనగానే వెంటనే శోభన్ బాబు గుర్తు కోస్తాడు.. ఎందుకంటే ఆయన కారు డ్రైవర్ కూడా ఇప్పుడు కొన్ని కోట్లకు అధిపతే మరి..

ఈ వెండితెర అందగాడుగా, ఆంధ్రుల అభిమాన హీరోగా శోభన్ బాబు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన కొత్తలో అనేక ఎత్తుపల్లాలు చూశారు. ముక్కుసూటితనంగా మాట్లాడుతూ..

వివాదాలకు దూరంగా ఉంటూ తెలుగు సినిమా గర్వించదగ్గ నటుడిగా మంచి పేరును సంపాదించుకున్న నటుడు శోభన్ బాబు ;లా’ చదువుకున్నారు. అయితే నటనపై ఆసక్తితో సినీ పరిశ్రమలో అడుగు పెట్టారు.

కాస్త వయసు పెరగ్గానే సినిమాలకు దూరమయ్యారు. అయితే సహాయ నటుడిగా శోభన్ బాబుకు ఎన్నో అవకాశాలు వచ్చాయి. కానీ తెలుగు ప్రేక్షకులు తనను ఓ హీరోగానే గుర్తుపెట్టుకోవాలని..

తనను ఎప్పటికీ ఓ సోగ్గాడిగానే చూడాలని సహాయ నటుడిగా కనిపించలేదు శోభన్ బాబు. 70 ఏళ్ల వయసులో 2008లో తుదిశ్వాస విడిచారు శోభన్ బాబు.
