పెళ్లికి వచ్చిన వాళ్లే నన్ను అంతలా అన్నారు, డేటింగ్ వార్తల్లో నిజం లేదు.. మంజిమా మోహన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
కోలివుడ్ ప్రేమ పక్షులు గౌతమ్ కార్తిక్, మంజిమా మోహన్ మూడుముళ్ల బంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. మూడేళ్లు ప్రేమలో ఉన్న ఈ అందమైన జంట ఇటీవల బంధుమిత్రుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా వివాహం తర్వాత తొలిసారి మీడియాతో..
కోలివుడ్ ప్రేమ పక్షులు గౌతమ్ కార్తిక్, మంజిమా మోహన్ మూడుముళ్ల బంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. మూడేళ్లు ప్రేమలో ఉన్న ఈ అందమైన జంట ఇటీవల బంధుమిత్రుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా వివాహం తర్వాత తొలిసారి మీడియాతో మాట్లాడారు మంజిమా. ఈ సందర్భంగా ఆమె ఎదుర్కొన్న పలు అవమానాలు, తమపై వచ్చిన పుకార్లకు సంబంధించి ఓపెన్ అయ్యారు. పెళ్లి ఫొటోల్లో మంజిమా చాలా లావుగా ఉందంటూ నెట్టింట్ కామెంట్స్ వస్తున్నాయి. దీంతో ఈ విషయంపై స్పందించారు.
బాడీ షేమింగ్ గురించి స్పందించిన మంజిమా.. ‘నేను బాడీ షేమింగ్ ఎదుర్కొన్నారు. నిజం చెప్పాలంటే పెళ్లికి వచ్చిన వారు కూడా నేను లావుగా ఉన్నానని కామెంట్ చేశారు. చాలా కాలం నుంచి బాడీ షేమింగ్ ఎదుర్కొంటున్నాను. మొదట్లో చాలా బాధపడ్డాను, కానీ ఇప్పుడు బాధపడడం ఆపేశాను. ప్రస్తుతం నేను ఫిట్‌గా, సంతోషంగా ఉన్నాను. నాకు బరువు తగ్గాలనించినప్పుడు నేను తగ్గుతాను’ అని చెప్పుకొచ్చిందీ బ్యూటీ.
ఇక లాక్‌డౌన్ సమయంలో మంజి, గౌతమ్ డేటింగ్‌లో ఉన్నారంటూ కూడా వార్తలు వచ్చాయి. దీనిపై కూడా ఆమె క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. లాక్‌డౌన్ సమయంలో తాను కుటుంబానికి దూరంగా చెన్నైలో ఒంటరిగా ఉన్నానని, అదే సమయంలో గౌతమ్ ఫ్యామిలీతో ఇంట్లో ఉన్నాడని తెలిపింది. అయితే కొన్నిసార్లు ఇద్దరు కలిసి బయట కనిపించడంతో సహజీవనం చేస్తున్నామని వార్తలు వచ్చాయని, అయితే ఈ వార్తల్లో ఏమాత్రం నిజం లేదని తేల్చి చెప్పింది మంజిమా.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..