Singer Revanth: రేవంత్ ఇంట సంబరాలు.. పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన అన్విత

ఇక సింగర్ గా రేవంత్ తెలుగు ప్రేక్షకులు చాలా దగ్గరయ్యాడు. సూపర్ హిట్ సినిమాల్లో రేవంత్ ప్లే బ్యాక్ సింగర్ గా రాణిస్తున్నాడు. ఇక బిగ్ బాస్ సీజన్ 6 తో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు.

Singer Revanth: రేవంత్ ఇంట సంబరాలు.. పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన అన్విత
Singer Revanth
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 02, 2022 | 9:02 AM

బిగ్ బాస్ సీజన్ 6లో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న కంటెస్టెంట్ ఎవరు అంటే టక్కున చెప్పే పేరు సింగర్ రేవంత్. తనదైన ఆట తో ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. ఇక సింగర్ గా రేవంత్ తెలుగు ప్రేక్షకులు చాలా దగ్గరయ్యాడు. సూపర్ హిట్ సినిమాల్లో రేవంత్ ప్లే బ్యాక్ సింగర్ గా రాణిస్తున్నాడు. ఇక బిగ్ బాస్ సీజన్ 6 తో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. ఇక రేవంత్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే సమయంలో ఆయన సతీమణి నిండు గర్భిణీ. ఇలాంటి సమయంలో భార్యను వదిలి వచ్చానని చాలా సార్లు బాధపడ్డాడు రేవంత్. ఇక హౌస్ లో ఉన్న సమయంలోనే రేవంత్ భార్య అన్విత సీమంతం కూడా జరిగింది . ఆ వీడియోను హౌస్ లో ప్లే చేసి రేవంత్ ను హ్యాపీ చేశారు బిగ్ బాస్. ఈ వీడియో చూస్తూ చాలా ఎమోషనల్ అయ్యాడు.

తాజాగా రేవంత్ సతీమణి అన్విత పండంటి బిడ్డకు జన్మనించింది. నిన్న రాత్రి సమయంలో అన్విత ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు రేవంత్ సన్నిహితులు. మరి బిగ్ బాస్ హౌస్ లో ఉన్న రేవంత్ కు ఈ విషయాన్నీ చెప్పి బిగ్ బాస్ హ్యాపీ చేస్తాడేమో చూడాలి.

ఇవి కూడా చదవండి

గతంలో ఫ్యామిలీ టైం లో ఆదిరెడ్డి కూతురు హౌస్ లోకి వచ్చిన సమయంలో చాలా ఎమోషనల్ అయ్యాడు రేవంత్. మరి బిగ్ బాస్ రేవంత్ కు ఈ హ్యాపీ న్యూస్ చెప్తే ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి. సోషల్ మీడియా వేదికగా ఇప్పటికే రేవంత్ కు విషెస్ తెలుపుతున్నారు నెటిజన్లు. ఇక బిగ్ బాస్ 6 విన్నర్ కూడా రేవంతే అవుతాడని అంటున్నారు ప్రేక్షకులు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

వైకల్యాన్ని ఓడించిన విజయ దీపిక.. టేబుల్ టెన్నిస్‌లో జాతీయ పతకాలు
వైకల్యాన్ని ఓడించిన విజయ దీపిక.. టేబుల్ టెన్నిస్‌లో జాతీయ పతకాలు
అసలే చలికాలం.. కొంపదీసి ఇవి తింటున్నారేమో జాగ్రత్తా.!
అసలే చలికాలం.. కొంపదీసి ఇవి తింటున్నారేమో జాగ్రత్తా.!
బంగాళాఖాతంలో వాయుగుండం.. తమిళనాడు, నెల్లూరులో భారీ వర్షాలు.!
బంగాళాఖాతంలో వాయుగుండం.. తమిళనాడు, నెల్లూరులో భారీ వర్షాలు.!
పాన్ కార్డ్ 2.O.. అసలేంటిది.? మీ కార్డు మళ్లీ మార్చుకోవాలా.?
పాన్ కార్డ్ 2.O.. అసలేంటిది.? మీ కార్డు మళ్లీ మార్చుకోవాలా.?
చల్లని బీరుతో చిల్ అవుదామనుకున్నారు.. తీరా బాటిల్ మూత ఓపెన్ చేయగా
చల్లని బీరుతో చిల్ అవుదామనుకున్నారు.. తీరా బాటిల్ మూత ఓపెన్ చేయగా
పక్షుల్లోనూ విడాకులు.! వాతావరణంలో మార్పులతో విడిపోతున్న పక్షులు..
పక్షుల్లోనూ విడాకులు.! వాతావరణంలో మార్పులతో విడిపోతున్న పక్షులు..
డిసెంబర్‌ 1 నుంచి కీలక మార్పులు. పెట్రోల్,డీజిల్ ధరలు పెరుగుతాయా?
డిసెంబర్‌ 1 నుంచి కీలక మార్పులు. పెట్రోల్,డీజిల్ ధరలు పెరుగుతాయా?
మాయా లేదు.. మర్మం లేదు.. అగ్నిగుండం చుట్టూ గొర్రెల ప్రదక్షిణ.!
మాయా లేదు.. మర్మం లేదు.. అగ్నిగుండం చుట్టూ గొర్రెల ప్రదక్షిణ.!
చేపల పులుసు తినాలనే కోరిక.. ఇట్టా అయితుంది అనుకోలే..
చేపల పులుసు తినాలనే కోరిక.. ఇట్టా అయితుంది అనుకోలే..
నామాల స్వామికే నామాలు పెట్టాలనుకున్నాడు.! శ్రీవారి హుండీలోనే చోరీ
నామాల స్వామికే నామాలు పెట్టాలనుకున్నాడు.! శ్రీవారి హుండీలోనే చోరీ