BalaKrishna : బాలయ్య వ్యక్తిత్వం ఎవరిలోనూ చూడలేదు.. ఎమోషనల్ అయిన నటుడు

ఇక ఈ మూవీ టైటిల్ ను కర్నూల్ లో గ్రాండ్ గా లాంచ్ చేశారు. ఇక ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే అఖండ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు బాలయ్య

BalaKrishna : బాలయ్య వ్యక్తిత్వం ఎవరిలోనూ చూడలేదు.. ఎమోషనల్ అయిన నటుడు
Balakrishna Duniya Vijay
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 02, 2022 | 8:30 AM

నటసింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ వీర సింహారెడ్డి. గోపీచంద్ మలినేని దర్శకుడిగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లు, టీజర్ సినిమా పై అంచనాలను భారీగా పెంచేశాయి. ఇక ఈ మూవీ టైటిల్ ను కర్నూల్ లో గ్రాండ్ గా లాంచ్ చేశారు. ఇక ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే అఖండ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు బాలయ్య. బోయపాటి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాతో బాలకృష్ణ 200కోట్ల క్లబ్ లోకి చేరిపోయారు. దాంతో ఇప్పుడు వీర సింహారెడ్డి సినిమా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అటు దర్శకుడు గోపీచంద్ కూడా క్రాక్ సినిమాతో హిట్ అందుకున్నారు. వీర సింహారెడ్డి సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే లాల్, ‘దునియా’ విజయ్, వరలక్ష్మీ శరత్ కుమార్, హనీ రోజు కీలకపాత్రల్లో కనిపించనున్నారు.

దునియా’ విజయ్ పాత్రకు సంబంధించిన షూటింగ్ కంప్లీట్ అయ్యి షూటింగ్ నుంచి వెళ్ళిపోతూ ఎమోషనల్ అయ్యారని తెలుస్తోంది. అయితే దునియా విజయ్ కన్నడ నట దర్శకుడిగా, నిర్మాతగా, హీరోగా చేసి ఆకట్టుకున్నారు. కేవలం బాలకృష్ణ కోసమే ఈ సినిమాలో విలన్ గా నటించడానికి ఒప్పుకున్నారట.

తాజాగా దునియా’ విజయ్ ఓ సందర్భంలో మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడని తెలుస్తోంది. ‘‘బాలయ్య నాకు దేవుడిచ్చిన అన్నయ్య అని అన్నారట విజయ్. ఆయన కోసమే ‘వీర సింహా రెడ్డి’సినిమాలో విలన్ గా చేయడానికి ఓకే చెప్పా. షూటింగ్ సమయంలో బాలకృష్ణగారితో పంచుకున్న అనుభవాల గురించి మాటలతో చెప్పలేను అని అన్నారట. అలాగే బాలయ్య సింహం లాంటి మనిషి.. ఆయన వ్యక్తిత్వం ఎవరిలోనూ చూడలేదు. ఈ సినిమా పెద్ద సక్సెస్ అవుతుంది అని దునియా విజయ్ అన్నారని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి