Ivana : లవ్ టు డే బ్యూటీకి వెల్లువెత్తుతున్న తెలుగు ఆఫర్లు.. ఆ హీరో సరసన ఛాన్స్
తమిళ్ మూవీగా వచ్చిన లవ్ టు డే సినిమా మంచి విజయాన్ని అందుకుంది ఈ సినిమా.. ఆ ఆ తర్వాత తెలుగులో విడుదలై ఇక్కడ కూడా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన ఈ సినిమా యూత్ కనెక్ట్ అయ్యే కథ కావడంతో ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.
చిన్న సినిమాలు ఈ మధ్య భారీ విజయాలను అందుకుంటున్నాయి. కథలో బలముంటే చాలు ప్రేక్షకులను సినిమాను బ్లాక్ బస్టర్ చేస్తున్నారు. హిట్ సినిమా తీయాలంటే వందల కోట్లు అవసరం లేదని చిన్న సినిమాలు నిరూపిస్తున్నాయి. ఇలా సంచలనం సృష్టించిన సినిమాల్లో లవ్ టుడే మూవీ ఒకటి. తమిళ్ మూవీగా వచ్చిన లవ్ టు డే సినిమా మంచి విజయాన్ని అందుకుంది ఈ సినిమా.. ఆ ఆ తర్వాత తెలుగులో విడుదలై ఇక్కడ కూడా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన ఈ సినిమా యూత్ కనెక్ట్ అయ్యే కథ కావడంతో ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ మూవీ హీరోయిన్ గురించి ఫిలిం సర్కిల్స్ లో తెగ చర్చించుకుంటున్నారు. లవ్ టు డే సినిమాతో ఇవానా అనే బ్యూటీ క్రేజ్ తెచ్చుకుంది. అంతకు ముందు జోతిక నటించిన జాన్సీ, శివ కార్తికేయన్ ‘హీరో’ మూవీల్లో ఇంపార్టెంట్ రోల్ చేసింది. ఇప్పుడు లవ్ టుడే లో అమ్మడి నటనకు.. అందానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు.
అమ్మాయి అంటే ఇలానే ఉండాలి.. ఫ్యూచర్ లో ఇలాంటమ్మాయి లవర్ గా కుదిరితే వైఫ్ గా రావాలని అని కలలు కంటున్నారు కుర్రకారు. ఇక ఈ అమ్మడి నటన అయితే సూపర్ అనే చెప్పాలి. లవ్ టు డే సినిమా తెలుగులోనూ మెప్పించడంతో ఈ ముద్దుగుమ్మ కు తెలుగు ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయని తెలుస్తోంది. ఇప్పటికే ఓ భారీ అఫర్ కూడా ఈ అమ్మడుకు వచ్చిందట..
ఇవానాను తెలుగులోకి బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు పరిచయం చేస్తున్నారని అంటున్నారు. దిల్ రాజు అన్న కొడుకు ఆశిష్ ఇప్పటికే హీరోగా పరిచయమైన విషయం తెలిసిందే. రౌడీ బాయ్స్ సినిమాతో ఆశిష్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా పర్లేదు అనిపించుకుంది. ఇక ఇప్పుడు సెకండ్ సినిమాతో రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా ఇవానా నటిస్తుందని అంటున్నారు. లవ్ టు డే సినిమాను దిల్ రాజు అదే పేరుతో తెలుగులో రిలీజ్ చేశాడు.. ఇక్కడ కూడా సూపర్ హిట్ అయింది.. దీంతో ఇవానాకి దిల్ రాజు ఇప్పటికే తన బ్యానర్లో హీరోయిన్ అవకాశమిచ్చేశాడని తెలుస్తోంది. త్వరలోనే ఈ వార్త పై క్లారిటీ రానుంది.