AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amala Paul: అమలా పాల్‌ అరాచకం.. గోవా బీచ్‌లో హీటెక్కించే ఫొటోలతో

ఇక ఆ తర్వాత నాయక్, జెండా పై కపిరాజు వంటి చిత్రాల్లో నటించింది. ఓవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు వెబ్‌ సిరీస్‌ల్లోనూ నటించి మెప్పించిందీ బ్యూటీ. కేవలం సినిమాలతోనే కాకుండా పలు రకాల కాంట్రవర్సీలతోనూ నిత్యం వార్తల్లో నిలిచిందీ బ్యూటీ. మనసులో మాటను ఎలాంటి భయం లేకుండా చెప్పే అమలా నిత్యం ఏదో ఒక కాంట్రవర్సీతో సావాసం చేస్తుంటుంది. ముఖ్యంగా సోషల్‌ మీడియాలో...

Amala Paul: అమలా పాల్‌ అరాచకం.. గోవా బీచ్‌లో హీటెక్కించే ఫొటోలతో
Amala Paul
Narender Vaitla
|

Updated on: Sep 04, 2023 | 1:42 PM

Share

అమలా పాల్‌.. ఈ పేరును తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. 2009లో మలయాళం చిత్రం ద్వారా ఇండస్ట్రీకి పరిచయైన ఈ బ్యూటీ అనతికాలంలో మంచి నటిగా పేరు సంపాదించుకుంది. వరుస సినిమాల్లో నటించే ఛాన్స్‌ కొట్టేస్తూ, అగ్ర కథనాయికల్లో ఒకరిగా దూసుకుపోయింది. ఇక 2011లో వచ్చి ‘బెజవాడ’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమాలో నాగ చైతన్య సరసన నటించిన ఈ చిన్నది తనదైన అందం, నటనతో మెస్మరైజ్ చేసింది.

ఇక ఆ తర్వాత నాయక్, జెండా పై కపిరాజు వంటి చిత్రాల్లో నటించింది. ఓవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు వెబ్‌ సిరీస్‌ల్లోనూ నటించి మెప్పించిందీ బ్యూటీ. కేవలం సినిమాలతోనే కాకుండా పలు రకాల కాంట్రవర్సీలతోనూ నిత్యం వార్తల్లో నిలిచిందీ బ్యూటీ. మనసులో మాటను ఎలాంటి భయం లేకుండా చెప్పే అమలా నిత్యం ఏదో ఒక కాంట్రవర్సీతో సావాసం చేస్తుంటుంది. ముఖ్యంగా సోషల్‌ మీడియాలో హాట్‌, హాట్‌ ఫొటోలను పోస్ట్ చేస్తూ కుర్రకారు మతులు పోగొడుతుందీ బ్యూటీ. అలాగే సినిమాలకు ఏమాత్రం బ్రేక్‌ దొరికినా వెంటనే హాలీడే ఎంజాయ్‌ చేస్తుందీ చిన్నది.

ఇవి కూడా చదవండి

ఈ క్రమంలోనే తాజాగా అమలా గోవాలో హాలీడే ఎంజాయ్‌ చేస్తోంది. సముద్రపు ఒడ్డున రిలాక్స్‌ అవుతున్న సమయంలో దిగిన ఫొటోలను పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట తెగ వైరల్‌ అవుతున్నాయి. దీనికి కారణంగా ఈ బ్యూటీ బికినీలో దర్శనమివ్వడమే. బ్లాక్‌ బికినీలో కళ్లకు గాగుల్స్ ధరించిన ఈ చిన్నది స్టన్నింగ్‌ లుక్స్‌తో మెస్మరైజ్‌ చేస్తోంది. బికినీ అందాలకు అభిమానులు ఫిదా అవుతున్నారు. బోల్డ్‌నెస్‌కు పెట్టింది పేరుగా నిలిచే అమలా తాజాగా ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన ఫొటోలతోనూ అలజడి రేపింది.

గోవాలో అమలా సందడి..

View this post on Instagram

A post shared by Amala Paul (@amalapaul)

బీచ్‌లో టేబుల్‌ పై కూర్చున్న ఈ బ్యూటీ పక్కన బీర్‌ బాటిల్‌తో దర్శనమిచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. తన స్టేట్‌మెంట్స్‌తో ఎంత కాంట్రవర్సీలు క్రియేట్ చేస్తుందో ఫొటోతో కూడా అదే స్థాయిలో కాంట్రవర్సీకి తెర తీసిందీ బ్యూటీ. దీంతో ఈ ఫొటో ప్రస్తుతం నెట్టింట తెగ ట్రెండ్‌ అవుతోంది. ఇక అమలా కెరీర్ విషయానికొస్తే ఈ బ్యూటీ ప్రస్తుతం నటించిన మూడు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అయితే అమలా పాల్ తెలుగులో మాత్రం నటించడం లేదు.

View this post on Instagram

A post shared by Amala Paul (@amalapaul)

View this post on Instagram

A post shared by Amala Paul (@amalapaul)

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..