- Telugu News Photo Gallery Cinema photos OG Movie Teaser was released on Pawan Kalyan's Birthday Occasion
OG Teaser: మాస్ లుక్ లో ఆకట్టుకున్న పవన్ Kalyan.. అదిరిపోయిన ఓజీ మూవీ టీజర్..
ప్యాన్ ఇండియా లెవల్లో ఓ స్టార్ పరిచయమవుతుంటే ఎలా ఉండాలి? ట్రెండ్‌లో ఉండాలి. ఫెలో ఆర్టిస్టుల్లో టెన్షన్ క్రియేట్ చేయాలి. మాస్ ఎంట్రీ ఉండాలి. అద్దిరిపోయే ఎలివేషన్ ఉండాలి. ఇదిగో... ఇవన్నీ ఉన్నాయంటున్నారు ఓజీ టీజర్ చూసినవారు. ఇన్నాళ్ల వెయిటింగ్‌కి కడుపు నిండిపోయే ఫీస్ట్ ఇచ్చేశారని మెచ్చుకుంటున్నారు. ఇప్పుడు నెట్టింట్లో ఎ టు జెడ్ అంతా ఓజీ మేనియానే. పవన్ కల్యాణ్ పుట్టినరోజు గిఫ్ట్ గా రిలీజ్ అయింది ఓజీ టీజర్. దాదాపు ఐదేళ్ల తర్వాత ఆయన చేస్తున్న స్ట్రెయిట్ సినిమా ఇది. అందులోనూ ప్యాన్ ఇండియా లెవల్‌లో ఎంట్రీని దృష్టిలో పెట్టుకునే తెరకెక్కించినట్టు ప్రతి ఫ్రేమ్‌లోనూ కనిపిస్తోంది.
Lakshminarayana Varanasi, Editor - TV9 ET | Edited By: Prudvi Battula
Updated on: Sep 06, 2023 | 4:41 PM

.ప్యాన్ ఇండియా లెవల్లో ఓ స్టార్ పరిచయమవుతుంటే ఎలా ఉండాలి? ట్రెండ్‌లో ఉండాలి. ఫెలో ఆర్టిస్టుల్లో టెన్షన్ క్రియేట్ చేయాలి. మాస్ ఎంట్రీ ఉండాలి. అద్దిరిపోయే ఎలివేషన్ ఉండాలి.

ఇదిగో... ఇవన్నీ ఉన్నాయంటున్నారు ఓజీ టీజర్ చూసినవారు. ఇన్నాళ్ల వెయిటింగ్‌కి కడుపు నిండిపోయే ఫీస్ట్ ఇచ్చేశారని మెచ్చుకుంటున్నారు. ఇప్పుడు నెట్టింట్లో ఎ టు జెడ్ అంతా ఓజీ మేనియానే.

పవన్ కల్యాణ్ పుట్టినరోజు గిఫ్ట్ గా రిలీజ్ అయింది ఓజీ టీజర్. దాదాపు ఐదేళ్ల తర్వాత ఆయన చేస్తున్న స్ట్రెయిట్ సినిమా ఇది. అందులోనూ ప్యాన్ ఇండియా లెవల్‌లో ఎంట్రీని దృష్టిలో పెట్టుకునే తెరకెక్కించినట్టు ప్రతి ఫ్రేమ్‌లోనూ కనిపిస్తోంది. హీరో ఎలివేషన్‌కి ఫిదా అవుతున్నారు ఆడియన్స్.

మీరు ఎంతయినా ఎక్స్ పెక్ట్ చేయండి, మేం రీచ్ అయి తీరుతాం అని సిగ్నల్స్ ఇచ్చేశారు కెప్టెన్ సుజీత్. గ్యాంగ్‌స్టర్ డ్రామాగా చూపించారు. వర్షాలు, వరదలు కూడా కడగలేనంత నెత్తురు పారించిన వ్యక్తి కథ అనే ఎలివేషనే ఇంకో రేంజ్‌లో ఉందనే డిస్కషన్ జరుగుతోంది నెట్టింట్లో. ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ అనే టైటిల్‌కి పక్కాగా సూట్ అయ్యే కంటెంట్‌ని సెలక్ట్ చేసుకున్నారంటూ మేకర్స్ మీద ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

బెల్ బాటమ్ ప్యాంట్ వేసుకుని కనిపించారు పవర్ స్టార్. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. పవన్ స్టైల్, చరిష్మాను చూసి... ఇది కదా బాస్.. మీ దగ్గర నుంచి మేం కోరుకున్నది. ఇన్నాళ్లు రీమేక్‌ల ముసుగులో ఉండిపోయారు. ఒరిజినల్ స్టఫ్‌లో మీరు కనిపిస్తే మాకు పండగే అంటూ వైరల్ చేస్తున్నారు ఫ్యాన్స్.

సోషల్ మీడియా, యూట్యూబ్ ఓజీ రికార్డులతో షేక్ అవుతోంది. ఓజీ గ్లింప్స్ వస్తుంది, టీజర్ వస్తుందని నిన్నటిదాకా ఆశలు ఉన్నప్పటికీ, ఈ రేంజ్‌ని మాత్రం ఎవరూ ఊహించలేదు. అందుకే సడన్ సర్‌ప్రైజ్ ఇచ్చిన సుజీత్‌ని తెగ మెచ్చుకుంటున్నారు పవన్ సైన్యం.





























