- Telugu News Photo Gallery Cinema photos Heroine Anushka Shetty missing in Miss Shetty Mr Polishetty Movie Promotions fans request for anushka interview Telugu Entertainment Photos
Miss Shetty Mr Polishetty: స్వీటీ ఒక ఇంటర్వ్యూ అయినా ఇస్తావా ప్లీజ్..! ఇంక 3 రోజులే ఉంది.
ఖుషి జోష్‌లో ఉన్న ఆడియన్స్‌ను నెక్ట్స్ వీక్ మరో ఇంట్రస్టింగ్ మూవీ పలకరించబోతోంది. మిస్టర్ పొలిశెట్టిగా మిస్ శెట్టి అనుష్కతో కలిసి ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు నవీన్ పొలిశెట్టి. అనుష్క కెరీర్‌కు ఎంతో కీలకమైన ఈ సినిమా ప్రమోషన్ విషయంలో నవీన్ మాత్రమే యాక్టివ్‌గా పాల్గొంటున్నారు. దీంతో అనుష్క ఎక్కడ అక్కడ అన్న డిస్కషన్ గట్టిగా జరుగుతోంది.లాంగ్ గ్యాప్ తరువాత స్వీటీ అనుష్క లీడ్ రోల్‌లో తెరకెక్కిన సినిమా మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి.
Updated on: Sep 04, 2023 | 3:03 PM

ఖుషి జోష్‌లో ఉన్న ఆడియన్స్‌ను నెక్ట్స్ వీక్ మరో ఇంట్రస్టింగ్ మూవీ పలకరించబోతోంది. మిస్టర్ పొలిశెట్టిగా మిస్ శెట్టి అనుష్కతో కలిసి ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు నవీన్ పొలిశెట్టి. అనుష్క కెరీర్‌కు ఎంతో కీలకమైన ఈ సినిమా ప్రమోషన్ విషయంలో నవీన్ మాత్రమే యాక్టివ్‌గా పాల్గొంటున్నారు.

దీంతో అనుష్క ఎక్కడ అక్కడ అన్న డిస్కషన్ గట్టిగా జరుగుతోంది.లాంగ్ గ్యాప్ తరువాత స్వీటీ అనుష్క లీడ్ రోల్‌లో తెరకెక్కిన సినిమా మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి. డిఫరెంట్ జానర్‌లో రూపొందిన ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.

అయితే అదే రోజు జవాన్ లాంటి క్రేజీ మూవీ కూడా ప్రేక్షకుల ముందుకు వస్తుండటంతో అనుష్క సినిమాకు ప్రమోషన్ కూడా కీలకంగా మారింది.ఇప్పటి వరకు జరిగిన ప్రమోషన్ ఈవెంట్స్‌లో నవీన్ పొలిశెట్టి మాత్రమే పాల్గొన్నారు. ఒక్క ఈవెంట్‌లో కూడా అనుష్క ఆడియన్స్ ముందుకు రాలేదు.

దీంతో స్వీటీ ఎక్కడ అని ఎంక్వైరీలు మొదలు పెట్టారు ఆడియన్స్. ఈ సినిమా షూటింగ్‌కు ముందు అనుష్క లుక్ విషయంలో రకరకాల వార్తలు వైరల్ అయ్యాయి. ఇప్పుడు ఆమె ప్రమోషన్‌కు హాజరు కాకపోవటం వెనుక రీజన్ కూడా అదేనా అన్న అనుమానాలు రెయిజ్ అవుతున్నాయి.

అయితే ట్రైలర్, సాంగ్స్‌లో అనుష్క లుక్ బానే ఉంది. అయినా ఆమె డైరెక్ట్‌గా ప్రమోషన్స్‌లో ఎందుకు పాల్గొనటం లేదు? మేకర్స్ కావాలనే స్వీటీని హైడ్ చేస్తున్నారా? లేక మరేదైనా రీజన్ ఉందా..? ఈ విషయం మీద గట్టిగా చర్చ జరుగుతోంది.

ఈ సినిమాను సెమీ పాన్ ఇండియా రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇంత భారీ రిలీజ్ అయినా ప్రమోషన్ భారమంతా హీరో ఒక్కరే మోయటం ఆశ్చర్యంగా ఉందంటున్నారు విశ్లేషకులు.

రిలీజ్‌కు మరో మూడు రోజులు మాత్రమే ఉన్న నేపథ్యంలో కనీసం స్వీటీ ఓ ఇంటర్వ్యూ అయినా ఇస్తారా? లేకపోతే మీడియా ముందుకు జేజమ్మ రాకుండానే ప్రమోషన్స్ ముగించేస్తారా..? చూడాలి.





























