AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ హీరో నాకు దేవుడితో సమానం.. ఆయనవల్లే నేను ఈ రోజు నడవగలుగుతున్న: కుమారన్ సేతురామన్

నటుడు కుమారన్ సేతురామన్ తన సినీ ప్రయాణం, ప్రముఖ రమణ లోడ్ ఎత్తాలిరా డైలాగ్ వెనుక ఉన్న ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఈ డైలాగ్ ఎంతగా క్రేజ్ పొందిందో వివరిస్తూ, కోవిడ్ సమయంలో పోలీసుల మధ్య జరిగిన ఒక సరదా సంఘటనను గుర్తు చేసుకున్నారు.

ఆ హీరో నాకు దేవుడితో సమానం.. ఆయనవల్లే నేను ఈ రోజు నడవగలుగుతున్న: కుమారన్ సేతురామన్
Kumanan Sethuraman
Rajeev Rayala
|

Updated on: May 28, 2026 | 9:21 AM

Share

సినిమా హీరోలు, హీరోయిన్స్ మాత్రమే కాదు ఎంతో మంది క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు కూడా తమ నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. వారిలో నటుడు కుమారన్ సేతురామన్ ఒకరు. విలన్ గా పలు సినిమాల్లో నటించిన కుమారన్ సేతురామన్ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. విలన్ గా పలు సినిమాల్లో కనిపించి మెప్పించాడు. ముఖ్యంగా సరిలేరు నీకెవ్వరు సినిమాలో రమణలోడ్ ఎత్తాలిరా..! అనే డైలాగ్ తో పాపులర్ అయ్యాడు కుమారన్ సేతురామన్. కాగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన తన సినీ అనుభవాలను, ముఖ్యంగా ఓ స్టార్ హీరో గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. కుమారన్ సేతురామన్ మాట్లాడుతూ.. ఒక పాత్రను ఎంచుకునేటప్పుడు ప్రజలకు నచ్చే విధంగా ఉండాలనేదే తన లక్ష్యమని కుమారన్ తెలిపారు.

రమణ లోడ్ ఎత్తాలిరా డైలాగ్ గురించి మాట్లాడుతూ, ఈ డైలాగ్ రీల్స్, మీమ్స్‌లో ఎంతగా ప్రాచుర్యం పొందిందో వివరించారు. కోవిడ్ లాక్‌డౌన్ సమయంలో తాను హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్లడానికి పర్మిషన్ కోసం కంట్రోల్ రూమ్‌కు వెళ్ళినప్పుడు, అక్కడి పోలీసులు తనను చూసి ఈ డైలాగ్ చెప్పి సెల్ఫీలు అడిగారని, పర్మిషన్ రావడానికి నాలుగు గంటలు పట్టిందని ఆయన సరదాగా గుర్తు చేసుకున్నారు. ఒక చిత్ర షూటింగ్‌లో మహేష్ బాబుతో కలిసి నటిస్తున్నప్పుడు తనకు జరిగిన తీవ్రమైన కాలు గాయం గురించి కుమారన్ వివరించారు. ఒక ఫైట్ సీన్‌లో భాగంగా రోప్ సరిగా లాగకపోవడం వల్ల కాలుకు తీవ్ర గాయం అయిందని చెప్పారు. మహేష్ బాబు వెంటనే స్పందించి, తనను అపోలో ఆసుపత్రికి తీసుకెళ్లారని, చీఫ్ ఆర్థోపెడిక్ డాక్టర్‌తో స్వయంగా మాట్లాడి చికిత్స చేయించారని గుర్తుచేసుకున్నారు.

మహేష్ బాబు సహాయ గుణాన్ని ప్రశంసిస్తూ, ఆయన తనకు దేవుడితో సమానం అని అన్నారు. ఆయనవల్లే నేను ఈ రోజు నడవగలుగుతున్నా అని గుర్తుచేసుకున్నారు. వైద్యులు ఆరు నెలల విశ్రాంతి సూచించినప్పటికీ, తన దృఢ సంకల్పం, ఇంటి వద్ద ఫిజియోథెరపీ యంత్రాలతో రోజుకు ఎనిమిది గంటల పాటు సాధన చేయడంతో కేవలం 20 రోజులలోనే పూర్తిగా కోలుకుని, మిగిలిన ఫైట్ సన్నివేశాలను పూర్తి చేశానని కుమారన్ గర్వంగా తెలిపారు. ఆయన వేగవంతమైన కోలుకోవడం చూసి మహేష్ బాబు కూడా ఆశ్చర్యపోయారని చెప్పారు. ఇతర నటుల గురించి మాట్లాడుతూ, జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి పనిచేయాలని తనకు ఎంతో ఆసక్తి ఉందని కుమారన్ వెల్లడించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us