ముద్దు ముద్దు మాటలకే లొంగిపోయాడు.. దేశ రహస్యాలను అమ్మేసిన యువకుడు..!
జమ్మూ కాశ్మీర్‌కు చెందిన ఓ యువకుడు సోషల్ మీడియాలో పరిచయమైన మహిళా ఏజెంట్ మాయలో పడి, దేశ రహస్యాలను శత్రు దేశానికి చేరవేస్తూ పట్టుబడటం సంచలనం సృష్టిస్తోంది. జమ్మూ ప్రాంతంలోని మక్వాల్ గ్రామానికి చెందిన 23 ఏళ్ల కరణ్, పాఠశాల విద్యను మధ్యలోనే ఆపేసి ఖాళీగా ఉంటున్నాడు. కొన్ని నెలల క్రితం స్నాప్‌చాట్‌లో ఇతనికి ఒక మహిళా ఐఎస్ఐ (ISI) ఏజెంట్ పరిచయమైంది.

జమ్మూ కాశ్మీర్‌కు చెందిన ఓ యువకుడు సోషల్ మీడియాలో పరిచయమైన మహిళా ఏజెంట్ మాయలో పడి, దేశ రహస్యాలను శత్రు దేశానికి చేరవేస్తూ పట్టుబడటం సంచలనం సృష్టిస్తోంది. జమ్మూ ప్రాంతంలోని మక్వాల్ గ్రామానికి చెందిన 23 ఏళ్ల కరణ్, పాఠశాల విద్యను మధ్యలోనే ఆపేసి ఖాళీగా ఉంటున్నాడు. కొన్ని నెలల క్రితం స్నాప్‌చాట్‌లో ఇతనికి ఒక మహిళా ఐఎస్ఐ (ISI) ఏజెంట్ పరిచయమైంది. ఆమె పంజాబ్‌లో పనిచేస్తున్న బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) మహిళా సైనికురాలిగా తనను తాను పరిచయం చేసుకుంది. నిరంతరం చాటింగ్ చేస్తూ, అసభ్యకరమైన వీడియో కాల్స్‌తో కరణ్‌ను తన బుట్టలో వేసుకుంది.
కరణ్ పూర్తిగా తన మాయలో ఉన్నాడని గ్రహించిన ఆ ఏజెంట్, తనకు రాజౌరి సెక్టార్‌కు బదిలీ అయిందని, అక్కడ నెట్‌వర్క్ సరిగా లేదని నమ్మబలికింది. తన అవసరాల కోసం ఒక వాట్సాప్ OTP కావాలని అడిగింది. ఏమాత్రం ఆలోచించని కరణ్, తన తల్లి ఫోన్‌కు వచ్చిన ఓటీపీని ఆమెకు షేర్ చేశాడు. దీంతో ఆమె ఆ వాట్సాప్ ఖాతాను స్వాధీనం చేసుకుని, దాని ద్వారా గూఢచర్య కార్యకలాపాలు సాగించింది.
ఆమె ఆదేశాల మేరకు కరణ్ జమ్మూ పరిసరాల్లోని ఆర్మీ బంకర్లు, కీలకమైన ఫ్లైఓవర్లు. రక్షణ స్థావరాలతో పాటు వాటిని ఫోటోలు, వీడియోలు తీసి పంపించాడు. ఇందుకు ప్రతిఫలంగా అతని ఖాతాలో రూ. 2,000 జమ అయ్యాయి. అయితే, అతను మరిన్ని ఫోటోల కోసం డబ్బులు డిమాండ్ చేయడం, అతని కదలికలు అనుమానాస్పదంగా ఉండటంతో మిలిటరీ ఇంటెలిజెన్స్ నిఘా పెట్టింది. ఆధారాలు లభించగానే, పోలీసుల సహాయంతో మక్వాల్‌లో అతడిని అరెస్టు చేశారు.
ఇది ఒక్క కరణ్ ఉదంతం మాత్రమే కాదు. ఇటీవల పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌లో బల్జిత్ సింగ్ అనే వ్యక్తిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఇతడు సైనిక కాన్వాయ్‌ల కదలికలను పాకిస్థాన్‌లోని తన హ్యాండ్లర్లకు లైవ్ స్ట్రీమింగ్ చేయడం కోసం నేషనల్ హైవే వద్ద సీసీటీవీ కెమెరాను అమర్చాడు. “సోషల్ మీడియాలో అపరిచిత వ్యక్తులతో స్నేహం చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా ఓటీపీలు, వ్యక్తిగత సమాచారం పంచుకోవద్దు. సైనిక సమాచారం, సున్నితమైన ప్రాంతాల ఫోటోలు అడిగితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలి.” అని పోలీసుల హెచ్చరిస్తున్నారు.
ప్రస్తుతం కరణ్ మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు, అతని డిజిటల్ ఫుట్‌ప్రింట్‌ను విశ్లేషిస్తున్నారు. ఈ హనీట్రాప్ వెనుక ఉన్న నెట్‌వర్క్ ఎంత విస్తరించిందో తెలుసుకునేందుకు దర్యాప్తు వేగవంతం చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
