AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆరోగ్యాన్ని ఇచ్చే రాగి పొంగలి.. మార్నింగ్ తింటే చాలు కొండను ఢీ కొట్టే బలం మీ సొంతం

ఆరోగ్యానికి మేలు చేసే టిఫిన్స్‌లో రాగి పొంగలి ఒకటి. రాగులు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఐరన్, కాల్షియం, విటమిన్స్ , మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. అందువలన రాగులను మీ డైట్‌లో చేర్చుకోవడం చాలా మంచిదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా రాగులతో పొంగలి చేసుకొని ప్రతి రోజూ ఉదయం తినడం వలన బోలెడు లాభాలు ఉన్నాయంట. అవి ఏవో ఇప్పుడు చూసేద్దాం.

Samatha J
|

Updated on: May 28, 2026 | 9:19 AM

Share
రాగి పొంగలి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు.. రాగులు, మిరియాలు, పెసర పప్పు, జీలకర్ర, నెయ్యి, ఉప్పు, మిరియాలు, అల్లం తరుగు, పచ్చి మిర్చి, కరివేపాకు, జీడి పప్పు, ఇంగువ.

1 / 5
తయారీ విధానంలోకి వెళితే.. మీరు ఉదయం రాగి పొంగలి బ్రేక్ ఫాస్ట్ చేసుకోవాలి అనుకుంటే, దాని ముందు రోజు రాత్రి సమయంలో ఒక కప్పు రాగులను శుభ్రంగా కడిగి, అందులో నాలుగు కప్పుల నీళ్లు పోసి నానబెట్టుకోవాలి.తర్వాత ఉదయం నానబెట్టుకున్న రాగులను మరోసారి శుభ్రం చేసి, ఫ్రెష్ నీళ్లు పోసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పెసర్లు తీసుకొని వాటిని ఒకసారి పెనంపై దోరగా వేయించాలి. తర్వాత మనం నానబెట్టుకున్న రాగులు, పెసర్లను ఒక బౌల్‌లోకి తీసుకొని నీళ్లు పోయాలి.

2 / 5
తర్వాత గ్యాస్ స్టవ్ ఆన్ చేసి, పాన్ పెట్టి, రాగులు, పెసర్లు ఉడకబెట్టుకోవాలి. దాదాపు 20 నిమిషాల వరకు చాలా మెత్తగా ఉడకనివ్వాలి. తర్వాత అందులో కొంచెం ఉప్పు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి.

3 / 5
ఇప్పుడు మళ్లీ స్టవ్ ఆన్ చేసి, కడాయి పెట్టి అందులో నెయ్యి వేసుకొని , ఆవాలు జీలకర్ర, కరివేపాకు, పచ్చి మిర్చి, జీడి పప్పు, అల్లం తరుగు అన్నీ వేసి దోరగా వేయించుకోవాలి. ఇవి బాగా బంగారు రంగు వచ్చేలా వేయించుకున్న తర్వాత స్టవ్ మీడియం సైజులో పెట్టుకోవాలి.

4 / 5
ఇప్పుడు మనం ముందుగా ఉడకబెట్టుకున్న రాగులు, పెసర్లను తాళింపులో వేసి మరోసారి మంచిగా కలుపుకోవాలి. అంతే టేస్టీ, హెల్దీ రాగి పొంగలి రెడీ. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా రక్తహీనత సమస్యతో బాధపడే వారికి రోగనిరోధక శక్తి తక్కువ ఉన్నవారు వారానికి రెండు సార్లు దీనిని తినడం వలన శరీరానికి  చాలా మంచిది.

5 / 5
Follow Us