సాధారణ ఉప్పు కంటే నల్ల ఉప్పే బెస్ట్? ఆరోగ్య రహస్యాలు తెలిస్తే..

27 June 2026

Jyothi Gadda

మన దేశంలో శతాబ్దాల కాలంగా నల్ల ఉప్పును చాట్ మసాలాలు, సలాడ్లు, వివిధ రకాల సాంప్రదాయ వంటకాల్లో రుచి కోసం వాడుతున్నారు. అయితే, ఇది కేవలం రుచిని పెంచే పదార్థం మాత్రమే కాదు, ఆరోగ్య నిధి.

నల్ల ఉప్పులో సహజంగానే జీర్ణక్రియను వేగవంతం చేసే గుణాలు ఉన్నాయి. ఇది కడుపులో గ్యాస్ట్రిక్ రసాల ఉత్పత్తిని ప్రేరేపించి, మనం తిన్న ఆహారం సులభంగా అరిగేలా చేస్తుంది.

రోజూ గ్యాస్, అసిడిటీ, మలబద్ధకం, కడుపు ఉబ్బరం (Bloating) సమస్యలతో బాధపడేవారు తమ ఆహారంలో సాధారణ ఉప్పుకు బదులు నల్ల ఉప్పును వాడటం వల్ల త్వరగా ఉపశమనం లభిస్తుంది.

నల్ల ఉప్పులో సోడియం పరిమాణం చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల, ఇది రక్తపోటును అదుపులో ఉంచడానికి మరియు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఎంతో సహాయపడుతుంది.

బరువు తగ్గాలనే ప్రణాళికలో ఉన్నవారికి నల్ల ఉప్పు ఒక అద్భుతమైన ఎంపిక. ఇది శరీరంలోని అదనపు కొవ్వును కరిగించడంలో తోడ్పడుతుంది. అలాగే, ఊబకాయాన్ని అదుపు చేస్తుంది.

నల్ల ఉప్పులో ఉండే యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ గుణాలు, అవసరమైన ఖనిజాలు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇది శరీరంలోని టాక్సిన్స్ ను తొలగించి, చర్మంపై వచ్చే మొటిమలు, మచ్చలను తగ్గిస్తుంది.

అలాగే, తలలో రక్త ప్రసరణను మెరుగుపరిచి జుట్టు రాలడాన్ని అరికడుతుంది. సాధారణ రసాయన ప్రక్రియలతో తయారయ్యే తెల్ల ఉప్పు కంటే, ప్రకృతి సిద్ధంగా లభించే నల్ల ఉప్పు ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరమైనది.

అయితే, ఏదైనా సరే అతిగా తీసుకుంటే నష్టమే కాబట్టి, రోజువారీ జీవితంలో తగిన మోతాదులో మాత్రమే నల్ల ఉప్పును వాడుకుంటూ సంపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు.