AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రూ. 240 కోట్లు వసూల్ చేసిన హారర్ కామెడీ మూవీ.. త్వరలోనే ఓటీటీలోకి.. స్ట్రీమింగ్ ఎక్కడంటే

హారర్ సినిమాలకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఇప్పటికే విడుదలైన హారర్ సినిమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అలాగే ఇటీవలే విడుదలైన ఓ హారర్ కామెడీ సినిమా భారీ హిట్ అయ్యింది. ఏకంగా రూ. 240కోట్లకు పైగా వసూల్ చేసి నయా రికార్డ్ క్రియేట్ చేసింది.

రూ. 240 కోట్లు వసూల్ చేసిన హారర్ కామెడీ మూవీ.. త్వరలోనే ఓటీటీలోకి.. స్ట్రీమింగ్ ఎక్కడంటే
Ott Movie
Rajeev Rayala
|

Updated on: May 28, 2026 | 8:37 AM

Share

ప్రస్తుతం థియేటర్స్ లో పెద్ద సినిమాలేవీ సందడి చేయడం లేదు. అలాగే చిన్న సినిమాలు కూడా థియేటర్స్ దగ్గర పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నాయి. ప్రస్తుతం థియేటర్స్ లో సందడి చేస్తున్న ఏకైక సినిమా సూర్య నటించిన కరుప్పు తెలుగులో వీరభద్రుడు. ఆర్జే బాలాజీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. తెలుగులోనూ ఈ సినిమాకు మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ఇక వచ్చే నెలలో సినిమా సందడి కథ గట్టిగానే కనిపించనుంది. రామ్ చరణ్ నటించిన పెద్ది సినిమా జూన్ 4న థియేటర్స్ లోకి రానుంది. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురుచూస్తుంది. ఈ సినిమాతో పాటు అఖిల్ లెనిన్ కూడా వచ్చే నెలలో వచ్చే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ఓటీటీల్లో సినిమాలు తెగ సందడి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఓ క్రేజీ హారర్ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రావడానికి రెడీ అవుతుంది.

ఇంతకూ ఆ సినిమా ఎదో కాదు.. స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించిన భూత్ బంగ్లా. చాలా కాలం తర్వాత భారీ హిట్ అందుకున్నాడు అక్షయ్ కుమార్. లెజెండరీ దర్శకుడు ప్రియదర్శన్ ఈ సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. హారర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన భూత్ బంగ్లా సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. థియేటర్లలో విడుదలైన నెల రోజులు దాటినా ఇంకా సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్న ఈ చిత్రం.. త్వరలోనే ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతుంది.

భూత్ బంగ్లా సినిమాను రూ. 120కోట్లతో  తెరకెక్కించారు. తొలి షో నుంచే హిట్ టాక్ రావడంతో ఈ సినిమాకు మంచి కలెక్షన్స్ వచ్చాయి. ఇండియా వైడ్ గా ఈ సినిమా రూ.175 కోట్లు రాబట్టింది. అలాగే వరల్డ్ వైడ్ గా రూ. 240 కోట్లు రాబట్టింది. కాగా ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతుంది. ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ రైట్స్ సొంతం చేసుకుందని తెలుస్తుంది. భూత్ బంగ్లా జూన్ 12న ఓటీటీలో ప్రీమియర్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. దీనిపై నెట్‌ఫ్లిక్స్ సంస్థ నుండి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us