RRR Movie: మళ్లీ మొదలవుతోన్న ఆర్‌.ఆర్‌.ఆర్‌ సందడి.. ఈసారి ఏకంగా దుబాయ్‌లో..!

RRR Movie: టాలీవుడ్‌ (Tollywood) ప్రేక్షకులు.. ఆమాటకొస్తే యావత్‌ ఇండియన్‌ సినీ లవర్స్‌ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సినిమా ఆర్‌.ఆర్‌.ఆర్‌. దర్శక ధీరుడు రాజమౌళి, యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్‌ రామ్‌ చరణ్‌లు హీరోలుగా తెరకెక్కుతోన్న ఈ సినిమా...

RRR Movie: మళ్లీ మొదలవుతోన్న ఆర్‌.ఆర్‌.ఆర్‌ సందడి.. ఈసారి ఏకంగా దుబాయ్‌లో..!
Follow us
Narender Vaitla

|

Updated on: Feb 26, 2022 | 7:06 AM

RRR Movie: టాలీవుడ్‌ (Tollywood) ప్రేక్షకులు.. ఆమాటకొస్తే యావత్‌ ఇండియన్‌ సినీ లవర్స్‌ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సినిమా ఆర్‌.ఆర్‌.ఆర్‌. దర్శక ధీరుడు రాజమౌళి, యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్‌ రామ్‌ చరణ్‌లు హీరోలుగా తెరకెక్కుతోన్న ఈ సినిమాపై ఎక్కడలేని అంచనాలున్నాయి. నిజానికి ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా కరోనా (Corona) కారణంగా పలుసార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఒకానొక సమయంలో సినిమా విడుదల దాదాపు కన్ఫామ్‌ అయ్యింది. చిత్ర యూనిట్ ప్రిరిలీజ్‌ ఈవెంట్‌లను సైతం నిర్వహించింది. అయితే కరోనా థార్డ్‌ వేవ్‌ రాకతో మరోసారి ఆర్‌.ఆర్‌.ఆర్‌ వెనక్కి తగ్గక తప్పలేదు. అయితే తాజాగా కరోనా తగ్గడంతో చిత్ర యూనిట్ సినిమాను విడుదల చేయడానికి సిద్ధమైంది. ఇందులో భాగంగానే మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

ఇక విడుదల తేదీ వాయిదా పడడంతో ప్రమోషన్స్‌ను తగ్గించిన ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్ర యూనిట్ తాజాగా మరోసారి ప్రచార కార్యక్రమాలను తిరిగి మొదలుపెట్టడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే మరో గ్రాండ్‌ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ను ప్లాన్‌ చేస్తున్నట్లు సమాచారం. అయితే ఈసారి ఏకంగా దుబాయ్‌లో ఈవెంట్‌ను నిర్వహించాలని చిత్రయూనిట్ భావిస్తున్నట్లు సమాచారం. అంతేకాదు ఈ కార్యక్రమానికి ఏకంగా హాలీవుడ్‌ హీరో టామ్‌ క్రూజ్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తున్నట్లు సోషల్‌ మీడియాలో ఓ వార్త తెగ వైరల్‌ అవుతోంది.

ఆర్‌ఆర్‌ఆర్ చిత్రాన్ని ఇతర దేశాల భాషల్లోనూ విడుదల చేస్తున్న నేపథ్యంలో అంతర్జాతీయంగా ప్రచారం కోసమే జక్కన్న ఈ ప్లాన్‌ వేస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ వార్తలో నిజం ఉందా.? లేదా సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారమేనా.? తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. మరి బాహుబలితో ఇండియన్ సినిమా స్థాయిని ఓ రేంజ్‌కు తీసుకుపోయిన రాజమౌళి ఆర్‌.ఆర్‌.ఆర్‌తో ఎలాంటి వండర్స్‌ క్రియేట్ చేస్తాడో తెలియాలంటే మరో నెల రోజులు వేచి చూడాల్సిందే.

Also Read: Viral Video: కంగారూతో మాములుగా ఉండదు మరి.. పంచ్ ఇస్తే పడిపోవాల్సిందే.. అంతేగా..

SebastianPC524 : కుర్ర హీరో కిరణ్ అబ్బవరం నయా మూవీ నుంచి మరో పాట..

Sunflower Oil: మీరు సన్ ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నారా.. అయితే ఈ వార్త మీ కోసమే..

పొట్టకొవ్వును కరిగించే 3 సాధారణ చిట్కాలు.. బెస్ట్ రిజల్ట్ మీసొంతం
పొట్టకొవ్వును కరిగించే 3 సాధారణ చిట్కాలు.. బెస్ట్ రిజల్ట్ మీసొంతం
మ్యాచ్ ఉందని పిలిస్తే.. ఆడటానికి వెళ్లాడు.. పాపం గ్రౌండ్‌లోనే
మ్యాచ్ ఉందని పిలిస్తే.. ఆడటానికి వెళ్లాడు.. పాపం గ్రౌండ్‌లోనే
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!