Sunflower Oil: మీరు సన్ ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నారా.. అయితే ఈ వార్త మీ కోసమే..

Sunflower Oil: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వల్ల భారత్ కు రవాణాలో(Transport) ఉన్న 3 లక్షల 80 వేల టన్నుల సన్ ఫ్లవర్ ఆయిల్ షిప్ మెంట్ నల్ల సముద్రం(Black sea) పరిధిలోని పోర్టుల్లో నిలిచిపోయింది. దీనికి తోడు అక్కడి పోర్టులు తమ కార్యకలాపాలను నిలిపివేయడం వల్ల సమస్య తీవ్రతరమైంది.

Sunflower Oil: మీరు సన్ ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నారా.. అయితే ఈ వార్త మీ కోసమే..
Sunflower Oil
Follow us

|

Updated on: Feb 25, 2022 | 8:49 PM

Sunflower Oil : రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వల్ల భారత్ కు రవాణాలో(Transport) ఉన్న 3 లక్షల 80 వేల టన్నుల సన్ ఫ్లవర్ ఆయిల్ షిప్ మెంట్ నల్ల సముద్రం(Black sea) పరిధిలోని పోర్టుల్లో నిలిచిపోయింది. దీనికి తోడు అక్కడి పోర్టులు తమ కార్యకలాపాలను నిలిపివేయడం వల్ల కొత్తగా వంటనూనె ఆర్డర్లు నిలిచిపోయాయి. ఈ నిలిచిపోయిన వంట నూనె ఎప్పటికి తిరిగి రవాణా చేయబడుతుందో సమాచారం లేదు. ఇలా నిలిచిపోయిన వంట నూనెల విలువ ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం 570 మిలియన్ డాలర్ల వరకు ఉంటుందని వాణిజ్య వర్గాలకు చెందిన డీలర్లు చెబుతున్నారు. సన్ ఫవర్ ఆయిల్ రవాణా నిలిచిపోవటం వల్ల దేశీయ ప్రజల మార్చి, ఏప్రిల్ నెలల అవసరాలకోసం పామాయిల్, సోయా ఆయిల్ వినియోగించవలసి ఉంటుందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.

నల్ల సముద్రం ప్రాంతం ప్రపంచంలోని సన్ ఫ్లవర్ ఉత్పత్తిలో 60%, ఎగుమతుల్లో 76% వాటాను కలిగి ఉంది. ప్రస్తుతం భారత్ ప్రపంచంలోనే అత్యధికంగా వంటనూనెలను ఎగుమతి చేసుకుంటున్న దేశాల్లో అగ్రగామిగా ఉంది. దీంతో మలేషియా పామాయిల్, అమెరికా సోయా ఆయిల్ ఫ్యూచర్ రేట్లు అమాంతం పెరిగిపోయాయి. భారత్ కు నల్ల సముద్ర ప్రాంతం నుంచి సుమారు 5.10 లక్షల టన్నుల సన్ ఫ్లవర్ ఆయిల్ ఆర్డర్లు ఉన్నాయి.. కానీ వీటిలో 1.30 లక్షల టన్నులు మాత్రమే ఇప్పటి వరకూ రవాణా అయ్యాయని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. మిగిలిన ఆర్డర్ల పరిస్థితి ఏమిటో చెప్పలేమని వ్యాపార నిపుణులు చెబుతున్నారు.

సాధారణంగా ఇండియా.. ఇండోనేషియా, మలేషియా నుంచి పామాయిల్.. అర్జెంటీనా, బ్రెజిల్ నుంచి సోయా ఆయిల్, ఉక్రెయిన్, రష్యాల నుంచి సన్ ఫ్లవర్ ఆయిల్ దిగుమతులను చేసుకుంటూ ఉంటుంది. ఈ కారణాల వల్ల భారత్ లో రానున్న రోజుల్లో వంట నూనె ధరలు మరింత ప్రియం కానున్నాయి. గత సంవత్సర కాలంగా పెరిగిన వంట నూనె ధరలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సామాన్యులు.. కొంత ఉపశమనం వచ్చిందనుకునే లోపే యుద్ధం రూపంలో మళ్లీ ధరల భారం సమస్యగా మారనుంది.

ఇవీ చదవండి..

War Effect India: రష్యాపై పెరుగుతున్న ఆంక్షలు.. మనపై వార్ ప్రభావం ఎంత.. భారత్ దౌత్యం రూట్ మ్యాప్ ఏంటి..

WhatsApp: వాట్సప్ అందిస్తున్న మరో కొత్త ఫీచర్.. దీంతో మెసేజింగ్ అనుభవం అదిరిపోతుంది..