Airtel: బ్లాక్ చెయిన్ టెక్నాలజీలోకి టెలికాం దిగ్గజం ఎయిర్ టెల్.. సింగపూర్ సంస్థలో పెట్టుబడులు..

Airtel: టెలికాం రంగంలో ఎదురవుతున్న తీవ్ర ఒత్తిడి తట్టుకుంటూనే రోజురోజుకూ కస్టమర్ల సంఖ్యను పెంచుకుంటోంది భారదీ ఎయిర్ టెల్ సంస్థ. తాజాగా ఎయిర్ టెల్.. సింగపూర్ కు చెందిన టెక్ కంపెనీలో పెట్టుబడులు పెట్టింది.

Airtel: బ్లాక్ చెయిన్ టెక్నాలజీలోకి టెలికాం దిగ్గజం ఎయిర్ టెల్.. సింగపూర్ సంస్థలో పెట్టుబడులు..
Bharati Airtel
Follow us
Ayyappa Mamidi

|

Updated on: Feb 25, 2022 | 4:41 PM

Airtel: టెలికాం రంగంలో ఎదురవుతున్న తీవ్ర ఒత్తిడి తట్టుకుంటూనే రోజురోజుకూ కస్టమర్ల సంఖ్యను పెంచుకుంటోంది భారతీ ఎయిర్ టెల్ సంస్థ. తాజాగా ఎయిర్ టెల్.. సింగపూర్ కు చెందిన ఒక టెక్ స్టార్టప్ కంపెనీ అకిలిజ్(Aqilliz)లో వ్యూహాత్మకంగా పెట్టుబడి పెట్టింది. ఈ టెక్ స్టార్టప్ బ్లాక్ చెయిన్(Block Chain) టెక్నాలజీకి సంబంధించి సేవలను అందిస్తోంది. అకిలిజ్ సంస్థ ఆటమ్ అనే పేటెంటెడ్ హైబ్రిడ్ బ్లాక్ చెయిన్ సాంకేతికతను అభివృద్ధి చేసింది. దీని ద్వారా పంపిణీ చేయబడిన డిజిటల్ లెడ్జర్‌లో గోప్యత, ఫెడరేటెడ్ లర్నింగ్ లను మిళితం చేస్తుంది. ఈ నూతన సాంకేతికతను వినియోగంతో భారత్ లోని తన వినియోగదారులకు మెరుగైన సేవలు అందిచాలని ఎయిర్ టెల్ భావిస్తోంది.

అకిలిజ్ సంస్థ అభివృద్ధి చేసిన బ్లాక్ చెయిన్ సాంకేతికతను ఎయిర్ టెల్ కంపెనీ తన ఎయిర్ టెల్ యాడ్స్, డిజిటల్ ఎంటర్టెయిన్ మెంట్(Wynk Music and Airtel Xstream), డిజిటల్ కామర్స్ (Airtel Thanks App) సేవలను అందించేదుకు వినియోంగించనున్నట్లు తెలుస్తోంది. కొత్త తరం సాంకేతిక కంపెనీలతో జతకట్టి వాటికి ఎయిర్ టెల్ తో పనిచేసేందుకు అవకాశం కల్పించేందుకు ఎయిర్ టెల్ ఇండియా స్టార్టప్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ ను తెచ్చింది. ఇందులో భాగంగా అకిలిజ్ తమతో కలిసి పనియనున్నట్లు ఎయిర్ టెల్ డిజిటల్ సీఈవో ఆదర్శ్ నాయక్ వెల్లడించారు. భారత్ లో ఇటువంటి సాంకేతికతను తొలిసారిగా తీసుకొస్తున్నట్లు అకిలిజ్ సంస్థ వ్యవస్థాపకులు గౌతమన్ వెల్లడించారు.

ఇవీ చదవండి..

Stock Market: యుద్ధ భయం నుంచి తేరుకున్న మార్కెట్లు.. వారాంతం కొనుగోళ్ల మద్ధతుతో ఎగబాకిన సూచీలు..

Stock Market: స్టాక్ మార్కెట్ లో కొన్ని షేర్ల ట్రేడింగ్ ఎందుకు నిషేధిస్తారు.. దీని వెనుక అసలు కారణం ఏమిటి..