Stock Market: యుద్ధ భయం నుంచి తేరుకున్న మార్కెట్లు.. వారాంతం కొనుగోళ్ల మద్ధతుతో ఎగబాకిన సూచీలు..

Stock Market: వరుస నష్టాలతో పతనమైన భారత స్టాక్ మార్కెట్లు ఎక్కకేలకు వారాంతంలో లభించిన కొనుగోళ్ల మద్దతుతో తిరిగి కొంత పుంజుకున్నాయి. ట్రేడింగ్ ప్రారంభమైన 5 నిమిషాల్లోనే సెన్సెక్స్ 1000 పాయింట్లకుపైగా పెరుగుదనలను నమోదు చేసింది.

Stock Market: యుద్ధ భయం నుంచి తేరుకున్న మార్కెట్లు.. వారాంతం కొనుగోళ్ల మద్ధతుతో ఎగబాకిన సూచీలు..
Market opening
Follow us
Ayyappa Mamidi

|

Updated on: Feb 25, 2022 | 4:12 PM

Stock Market: ఇవాల్టి మార్కెట్ ను గమనిస్తే.. మార్కెట్లు యుద్ధ భయాల నుంచి కోలుకున్నట్లు(Market recovered) కనిపుస్తోంది. వరుస నష్టాలతో పతనమైన భారత స్టాక్ మార్కెట్లు ఎక్కకేలకు వారాంతంలో లభించిన కొనుగోళ్ల మద్దతుతో(Buy Demand) తిరిగి కొంత పుంజుకున్నాయి. ట్రేడింగ్ ప్రారంభమైన 5 నిమిషాల్లోనే సెన్సెక్స్ 1000 పాయింట్లకుపైగా పెరుగుదనలను నమోదు చేసింది. ఈ క్రమంలో.. 265 పాయింట్ల పెరుగుదలతో ఉదయం ఆరంభమైన జాతీయ స్టాక్ ఎక్ఛేంజ్ సూచీ నిఫ్టీ గరిష్ఠంగా 16749 పాయింట్ల మార్కును తాకి క్లోజింగ్ సమయానికి 410 పాయింట్ల లాభంతో 16658 వద్ద ముగిసింది. ఇదే సమయంలో బెండ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 790 పాయింట్ల పెరుగుదలతో ప్రారంభమై.. గరిష్ఠంగా 56184 పాయింట్ల మార్కును తాకింది. సాయంత్రం ముగింపు నాటిని సెన్సెక్స్ సూచీ 1329 పాయింట్ల పెరుగుదలను నమోదు చేసి 55858 మార్క్ వద్ద స్ధిరపడింది. దీనికి తోడు బ్యాంక్ నిఫ్టీ 3.41 శాతం పెరిగి 1200 పాయింట్లు ఎగబాకింది. ఇదే సమయంలో మిడ్ క్యాప్ ఇండెక్స్ 4.18 శాతం పెరుగుదలతో 1120 పాయింట్లు పాజిటివ్ లో ముగిసింది.

నేడు ప్రధానంగా కోల్ ఇండియా 8.97%, టాటా మోటార్స్ 7.43%, టాటా స్టీల్ 6.64%, అదానీ పోర్ట్స్ 6.15%, ఇండస్ ఇండ్ బ్యాంక్ 5.87%, బజాజ్ ఫైనాన్స్ 5.15%, జేఎస్డబ్ల్యూ స్టీల్ 5.14%, దివిస్ ల్యాబ్స్ 5.12%, ఎన్టీపీసీ 4.78%, టాటా కన్జ్యూమర్ ప్రొడక్స్ 4.69% మేర లాభపడి టాప్ టెన్ గెయినర్స్ గా నిలిచాయి. దాదాపు వారం రోజుల పాటు యుద్ధ బయాలతో ఊగిసలాడి.. నిన్న భారీగా పతనమైన భారత స్టాక్ మార్కెట్లు ఎట్టకేలకు వారాంతంలో పెరుగుదలను నమోదు చేశాయి. నిన్న ఒక్కరోజే గత రెండు సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధంగా 2800 పాయింట్లు సెన్సెక్స్ సూచీ పతనం అవ్వడంతో దాదాపు 10 లక్షల కోట్ల మేర మదుపరుల సంపద ఆవిరైంది. యుద్ధ భయాలతో ఎంతకాలం ఈ మార్కెట్ల పతనం కొనసాగుతుందని అందరూ భయపడినప్పటికీ.. దేశీయ స్టాక్ మార్కెట్లు మాత్రం తొందరగానే దాని ప్రభావం నుంచి బటపడనున్నట్లు నేటి మార్కెట్ రికవరీని చూస్తే అనిపిస్తోందని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఇవీ చదవండి..

Futures Trading: స్టాక్ మార్కెట్లో ఫ్యూచర్స్ ట్రేడింగ్ అంటే ఏమిటి.. షేర్ల ట్రేడింగ్ కు దీనికి వ్యత్యాసం ఏమిటి..

LIC IPO: ఎల్‌ఐసీ ఐపీఓ అప్‌డేట్‌.. రష్యా-ఉక్రెయిన్ యుద్దం ఎఫెక్ట్‌ ఉంటుందా..!

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ