War Effect India: రష్యాపై పెరుగుతున్న ఆంక్షలు.. మనపై వార్ ప్రభావం ఎంత.. భారత్ దౌత్యం రూట్ మ్యాప్ ఏంటి..

War Effect India: ఉక్రెయిన్(Ukraine war) లో పరిస్థితులు మరింతగా దిగజారితే రానున్న రోజుల్లో అది యుద్ధం వైపుకు దారితీయవచ్చు. ఇదే సమయంలో అమెరికాతో పాటు ఇతర యూరోపిన్ దేశాలు(European nations) రష్యాపై తమ ఆంక్షలను మరింత కఠినతరం చేస్తున్నాయి.

War Effect India: రష్యాపై పెరుగుతున్న ఆంక్షలు.. మనపై వార్ ప్రభావం ఎంత.. భారత్ దౌత్యం రూట్ మ్యాప్ ఏంటి..
War Effect On India
Follow us
Ayyappa Mamidi

|

Updated on: Feb 25, 2022 | 7:32 PM

War Effect India: ఉక్రెయిన్(Ukraine war) లో పరిస్థితులు మరింతగా దిగజారితే రానున్న రోజుల్లో అది యుద్ధం వైపుకు దారితీయవచ్చు. ఇదే సమయంలో అమెరికాతో పాటు ఇతర యూరోపిన్ దేశాలు(European nations) రష్యాపై తమ ఆంక్షలను మరింత కఠినతరం చేస్తున్నాయి. దీని వల్ల కేవలం రష్యా మాత్రమే ప్రభావితం కాదు.. యూరప్, ఆసియాలోని దేశాలతో పాటు భారత్ ఎక్కువగా ఇబ్బందులను ఎదుర్కోనున్నాయి. ఇప్పటికే నాటో దేశాలు రష్యాపై ఆంక్షల కొరడా ఝుళిపించాయి. ఈ తరుణంలో రానున్న రోజుల్లో దౌత్యపరమైన సంప్రదింపుల ద్వారా సమస్యకు స్వస్తి పలికే అవకాశాలను ఏమాత్రం తోసిపుచ్చలేము. కానీ ఇది రెండు వైపుల ఉన్న దేశాలు ఎలా ప్రవర్తిస్తాయి, అవి ఉక్రెయిన్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయనేదానిపై ఆధారపడి ఉంటుంది. రష్యా మిలిటరీకి కీలకమైన రెండు రష్యన్ ప్రభుత్వరంగ బ్యాంకులపై నాటో దేశాలు ఆంక్షలు విధించాయి. రష్యా స్వతంత్ర ప్రతిపత్తిని ఇచ్చిన లుగాన్స్క్, దొనేత్సక్ లకు ఆంక్షల వల్ల పెద్ద ఇబ్బంది ఉండదు ఎందుకంటే అక్కడ అమెరికన్ కంపెనీలు ఉండటమే.

ఉక్రెయిన్ పై దాడి విషయంలో రష్యా అంతర్జాతీయ నిబంధనలను ఉల్లంఘించినట్లు స్పష్టంగా అర్థమవుతోందని నాటో దేశాలు ఇప్పటికే మండిపడుతున్నాయి. రష్యన్ ఆర్మీని ఉక్రెయిన్ భూభాగంలోకి ప్రవేశపెట్టడాన్ని అవి తీవ్రంగా పరిగణిస్తున్నాయి. ఇప్పటికే క్రిమియా ఆక్రమణకు సంబంధించిన విషయంలో.. 2014 నుంచి రష్యా పశ్చిమదేశాల ఆంక్షలను ఎదుర్కొంటోంది. తాజాగా మంగళవారం విధించబడ్జ కొత్త ఆంక్షలు ఉన్నవాటికి అదనంగా జోడయ్యాయి. కానీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు ఒకదానిపై మరొకటి పరస్పర ఆధారపడటం పెరుగుతున్నందున.. అంతర్జాతీయ నిబంధనలను ఉల్లంఘించే దేశాలను ఒంటరిగా చేయడంలో ఆంక్షల ప్రభావంపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రష్యాతో తమకు పోరు అవసరం లేదని కానీ ఉక్రెయిన్ కు తమ సహకారం ఉంటుందని అమెరికా అధ్యక్షుడు జొ బైడెన్ వెల్లడించారు. దీనికి నాటో దేశాలు సైతం తమ వంతు సహకారాన్ని అందిస్తున్నాయి. ఇదే సమయంలో ఉక్రెయిన్ NATO సభ్యుడు కాదు. అయినప్పటికీ అది అట్లాంటిక్ కూటమిలో ఉండాలనుకుంటోంది కాబట్టి.. యుద్ధం సంభవించినప్పుడు US లేదా NATO దాని ప్రత్యక్ష సహాయానికి రావు. అలాంటప్పుడు ఉక్రెయిన్ రష్యాతో ఒంటరిగా పోరాడవలసి ఉంటుంది.

యూరోపియన్ క్యాపిటల్ మార్కెట్‌లకు, EU బ్యాంకుల నుండి నిధులను యాక్సెస్ చేసే సామర్థ్యాన్ని పరిమితం చేస్తూ.. 27 రష్యన్ వ్యక్తులు, సంస్థలపై ఆంక్షలు విధించనున్నట్లు EU ఇప్పటికే హెచ్చరించింది. EU, ఉక్రెయిన్‌లోని తిరుగుబాటు ప్రాంతాల మధ్య వాణిజ్యాన్ని నిషేధించాలని కూడా నిర్ణయించింది. అంతేకాకుండా రష్యన్ డూమాలోని 351 మందిపైన కూడా పార్లమెంట్ దిగువ సభ ఆంక్షలను విధించింది. రష్యా నుంచి వచ్చే గ్యాస్ ను జెర్మనీ నిలిపివేసినప్పటికీ.. ఇతర యూరోపియన్ దేశాలకు తన సరఫరారు నిలుపబోమని రష్యా స్పష్టం చేసింది. దీనికి తోడు రష్యా తన వ్యాపారాల చెల్లింపులకు డాలర్ ను మారకంగా వాడుకోకుండా చూడాలని అమెరికా ప్రయత్నిస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ కారణాలతో ప్రపంచ దేశాల ఎకనమిక్ రికవరీ కరోనా సమయంలో పరింత ప్రభావితం కానుంది.

ఈ తరుణంలో భారత్ కు రష్యా, అమెరికా దేశాలతో మంచి సంబంధాలు ఉన్నాయి. దీనికి తోడు రష్యాలోని ఎనర్జీ సంస్థల్లో పెట్టుబడులు పెట్టగా.. కోల్, గ్యాస్, ఆయిల్, డిఫెన్స్ అవసరాలకోసం ఆ దేశంపై ఆధారపడి ఉంది. గతంలో రష్యా నుంచి భారత్ కొన్న S-400 ట్యాంకులపై అమెరికా వెసులు బాటు కల్పించినప్పటికీ.. రానున్న కాలంలో ఆ సడలింపులు రాకపోవచ్చు. ఈ తరుణంలో భారత్ రెండు దేశాలకు సమానమైన స్థానాన్ని ఇస్తూ దౌత్యపరంగా ముందుకు సాగడం ఎంతో సవాలుతో కూడుకున్న అంశం.

ఇవీ చదవండి..

WhatsApp: వాట్సప్ అందిస్తున్న మరో కొత్త ఫీచర్.. దీంతో మెసేజింగ్ అనుభవం అదిరిపోతుంది..

Airtel: బ్లాక్ చెయిన్ టెక్నాలజీలోకి టెలికాం దిగ్గజం ఎయిర్ టెల్.. సింగపూర్ సంస్థలో పెట్టుబడులు..