AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pushpa 2: పుష్ప సీక్వెల్‌లోనూ ఐటెం సాంగ్‌.. ఈసారి బన్నీతో చిందులేయనుంది ఎవరో తెలుసా.?

Pushpa 2: సుకుమార్‌ (Sukumar) దర్శకత్వంలో అల్లు అర్జున్‌ (Allu Arjun) హీరోగా తెరకెక్కిన పుష్ప సృష్టించిన సంచలనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పాన్‌ ఇండియా చిత్రంగా విడుదలైన ఈ సినిమాకు సౌత్‌లో ఏ రేంజ్‌లో రెస్పాన్స్‌ వచ్చిందో దానికి డబుల్‌ రేంజ్‌లో నార్త్‌లో..

Pushpa 2: పుష్ప సీక్వెల్‌లోనూ ఐటెం సాంగ్‌.. ఈసారి బన్నీతో చిందులేయనుంది ఎవరో తెలుసా.?
Pushpa Moive
Narender Vaitla
| Edited By: Anil kumar poka|

Updated on: Mar 19, 2022 | 6:13 PM

Share

Pushpa 2: సుకుమార్‌ (Sukumar) దర్శకత్వంలో అల్లు అర్జున్‌ (Allu Arjun) హీరోగా తెరకెక్కిన పుష్ప సృష్టించిన సంచలనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పాన్‌ ఇండియా చిత్రంగా విడుదలైన ఈ సినిమాకు సౌత్‌లో ఏ రేంజ్‌లో రెస్పాన్స్‌ వచ్చిందో దానికి డబుల్‌ రేంజ్‌లో నార్త్‌లో ఆడియన్స్‌ బ్రహ్మరథం పట్టారు. రికార్డు కలెక్షన్లతో దేశ వ్యాప్తంగా భారీ విజయాన్ని సొంతం చేసుకుందీ సినిమా. ఒక రకంగా బాహుబలి తర్వాత తెలుగు సినిమా స్థాయిని మరోసారి దేశానికి చాటి చెప్పింది పుష్ప. బన్నీ యాక్టింగ్‌, డైలాగ్‌లు మొదలు పాటల వరకు ఈ సినిమా ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేసింది. ఈ క్రమంలోనే సమంత నటించిన ‘ఊ అంటావా’ పాట కూడా సినిమాకు హైలెట్‌గా నిలిచిన విషయం తెలిసిందే.

ఈ సినిమా ప్రోమోతో ఒక్కసారిగా ప్రమోషన్స్‌ పుంజుకుంది. సినిమా విజయంలో ఈ ఐటెం సాంగ్‌ కూడా ముఖ్య పాత్ర పోషించిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇదిలా ఉంటే ప్రస్తుతం పుష్పకు సీక్వెల్‌గా తెరకెక్కుతోన్న పుష్ప2లో కూడా ఐటెంట సాంగ్‌ ఉండనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈసారి సమంత ప్లేస్‌ను బాలీవుడ్‌ బ్యూటీ దిశా పటానీ రీప్లేస్‌ చేయనుందని తెలుస్తోంది. పుష్ప2ను నార్త్‌ ఆడియన్స్‌ను ఎక్కువగా టార్గెట్‌ చేస్తూ తెరకెక్కిస్తుండడంతో ఇందులో దిశాను తీసుకోవాలని చిత్ర యూనిట్ భావించిందని సమాచారం.

Pushpa Item Song

దిశా పటానీ కూడా పుష్ప ఆఫర్‌కు వెంటనే ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రానుందని టాక్‌. మరి దిశా పటానీ, సమంతను మైమరిపిస్తుందా.? పుష్ప1కు ప్లస్ అయిన ఐటెం సాంగ్‌ సీక్వెల్‌కు ఏమేర ఉపయోగపడుతుందో చూడాలి.

Also Read: Schools: ప్రభుత్వం సంచనల నిర్ణయం.. సర్కారు స్కూళ్లలో చదువుకునే బాలికలకు నెలకు వెయ్యి రూపాయలు..

SBI: కస్టమర్లను అలర్ట్‌ చేసిన ఎస్‌బీఐ.. ఈ లింక్‌లపై క్లిక్‌ చేస్తే అంతే సంగతి..!

RRR Movie: రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు తెలంగాణ సర్కారు భారీ నజరానా..