AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Puneeth Rajkumar: పునీత్ పుట్టిన రోజున నీ స్మృతిలో అంటూ అనాథ వృద్ధులకు అన్నదానం చేసిన హీరో విశాల్.. వీడియో వైరల్

Puneeth Rajkumar : కొందరు మరణించీ చిరంజీవులు .. అలాంటి వ్యక్తుల్లో ఒకరు కన్నడ పవర్ స్టార్(Kannada Power Star)  పునీత్ రాజ్‌‌కుమార్. నిన్న (మార్చి 17 )దివంగత నటుడు, అప్పు(Appu) జయంతి సందర్భంగా అభిమానులు ..

Puneeth Rajkumar: పునీత్ పుట్టిన రోజున నీ స్మృతిలో అంటూ అనాథ వృద్ధులకు అన్నదానం చేసిన హీరో విశాల్.. వీడియో వైరల్
Puneeth Rajkumar Birthday
Surya Kala
|

Updated on: Mar 19, 2022 | 5:05 PM

Share

Puneeth Rajkumar : కొందరు మరణించీ చిరంజీవులు .. అలాంటి వ్యక్తుల్లో ఒకరు కన్నడ పవర్ స్టార్(Kannada Power Star)  పునీత్ రాజ్‌‌కుమార్. నిన్న (మార్చి 17 )దివంగత నటుడు, అప్పు(Appu) జయంతి సందర్భంగా అభిమానులు .. నీ స్మృతిలో అంటూ.. అనేక స్వచ్చంద సేవా కార్యక్రమాలను నిర్వహించారు. అనేక చోట్ల అన్నదాన కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు నిర్వహించారు. పునీత్ రాజ్‌కుమార్ జయంతి సందర్భంగా పునీత్ ఫ్రెండ్, నటుడు విశాల్(Vishal)  చెన్నైలోని పలు ఆశ్రమాలలో 200 మందికి పైగా వృద్ధులకు ఆహరం అందించారు,

ఇదే విషయాన్ని రమేష్ బాలా తన ట్విట్టర్ లో ఓ వీడియో షేర్ చేస్తూవెల్లడించారు. కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ జయంతి సందర్భంగా, నటుడు విశాల్..  చెన్నై సహా చుట్టుపక్కల ఉన్న వివిధ వృద్ధాప్య ఆశ్రయాలలో 200లకు పైగా  వృద్ధులకు ఆహారం అందించారని తెలిపారు.

విశాల్ ట్విట్టర్ వేదికగా అప్పుని తలుచుకుంటూ ఎమోషనల్ ట్వీట్ చేశాడు. ” హ్యాపీ బర్‌డే డియరెస్ట్ బ్రదర్ – పునీత్ రాజ్‌కుమార్… నువ్వు మా మధ్య లేకపోయినా, నీ ఆలోచనలు, నీ అమూల్యమైన చిరునవ్వు ఎప్పటికీ మా హృదయాల్లో నిలిచే ఉంటుంది. మేమందరం నిన్ను రోజూ కోల్పోతున్నాను. మీ జేమ్స్ చిత్రానికి నా శుభాకాంక్షలు. మా ప్రేమ, ఆప్యాయత, గౌరవాన్ని ఎప్పటికీ మీపై కురిపిస్తూనే ఉంటామని ట్విట్ చేశాడు.

కన్నడ చిత్ర పరిశ్రమలో తండ్రి వారసత్వాన్ని పుచ్చుకుని బాలనటుడి నుంచి పవర్ స్టార్‌‌గా ఎదిగిన పునీత్ రాజ్‌‌కుమార్ గతేడాది అక్టోబర్‌‌లో6 ఏళ్ల వయసులో హఠాత్తుగా గుండెపోటుతో కన్నుమూశారు.  అప్పు అకాల మరణాన్ని అభిమానులు ఎవ్వరు ఇప్పటికి జీర్ణించుకోలేకపోతున్నారు. కాగా పునీత్ చివరి చిత్రం జేమ్స్ నిన్న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. దీనికి చేతన్ కుమార్ దర్శకత్వం వహించగా, కిషోర్ పత్తికొండ నిర్మాతగా వ్యవహరించారు.

Also Read:

పవన్ తూర్పుగోదావరిలో ఎక్కడా పోటీ చేసినా ఓడిస్తా.. వైసీపీ ఎమ్మెల్యే ఛాలెంజ్