Schools: ప్రభుత్వం సంచనల నిర్ణయం.. సర్కారు స్కూళ్లలో చదువుకునే బాలికలకు నెలకు వెయ్యి రూపాయలు..

Schools: స్కూల్‌ డ్రాపవుట్స్‌ను తగ్గించడానికి ప్రభుత్వాలు ఎన్నో రకాల చర్యలు తీసుకుంటున్న కొన్ని చోట్ల ఆశించిన స్థాయిలో ఫలితాలు రావడం లేదు. ముఖ్యంగా బాలికల డ్రాపవుట్స్‌ ఎక్కువగా పెరుగుతున్నాయి. ఈ సమస్యకు చెక్‌పెట్టడానికే తమిళనాడు ప్రభుత్వం సంచలన..

Schools: ప్రభుత్వం సంచనల నిర్ణయం.. సర్కారు స్కూళ్లలో చదువుకునే బాలికలకు నెలకు వెయ్యి రూపాయలు..
Govt Schools
Follow us
Narender Vaitla

|

Updated on: Mar 19, 2022 | 3:08 PM

Schools: స్కూల్‌ డ్రాపవుట్స్‌ను తగ్గించడానికి ప్రభుత్వాలు ఎన్నో రకాల చర్యలు తీసుకుంటున్న కొన్ని చోట్ల ఆశించిన స్థాయిలో ఫలితాలు రావడం లేదు. ముఖ్యంగా బాలికల డ్రాపవుట్స్‌ ఎక్కువగా పెరుగుతున్నాయి. ఈ సమస్యకు చెక్‌పెట్టడానికే తమిళనాడు ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థినులకు నెలకు రూ. 1000 ప్రోత్సాహకంగా అందించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. స్టాలిన్‌ సర్కారు తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది బాలికలకు మేలు జరగనుంది.

ఈ పథకం కింద ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తోన్న బాలికలకు ప్రతి నెలా రూ. 1000 అందించనున్నట్లు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పళనివేల్‌ త్యాగరాజన్‌ తెలిపారు. ఈ పథకంతో రాష్ట్ వ్యాప్తంగా ఉన్న సుమారు 6 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది. ఈ పథకం కోసం ప్రభుత్వం ఏకంగా రూ. 698 కోట్లు కేటాయించారు. ‘మూవలూరు రామామృతం అమ్మాయార్‌ ఉన్న విద్యా భరోసా పథకం’ పేరుతో ప్రభుత్వ పాఠశాలల్లో ఉండే 6 నుంచి 12వ తరగతుల బాలికలందరికీ.. డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ కోర్సులు పూర్తి చేసేంత వరకు ఈ మొత్తాన్ని అందించనున్నారు.

ప్రస్తుతం అందుబాటులో ఉన్న స్కాలర్‌ షిప్‌లతో పాటు ఈ పథకం కూడా వర్తిస్తుందని మంత్రి తెలిపారు. ఇదిలా ఉంటే తమిళనాడు ప్రభుత్వం తాజా బడ్జెట్‌లో పాఠశాల విద్యకు భారీగా కేటాయింపులు చేసింది. రూ. 36,895.89 కోట్లను కేటాయించడం విశేషం. గతేడాది ఈ మొత్తం రూ. 34,181 కోట్లుగా ఉంది.

Also Read: MS Dhoni vs Gambhir: ‘ధోనీకి అండగా నిలిచే మొదటి వ్యక్తిని నేనే.. మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు’

Banks Privatization: ఆ బ్యాంకుల ప్రైవేటీకరణ తప్పదా.. కేంద్రం ఏమంటోందంటే..

Coconut Water Benefits: వేసవిలో కొబ్బరి నీళ్లు తాగితే ఎన్నో ప్రయోజనాలు.. తెలిస్తే ఔరా అనాల్సిందే..