AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MS Dhoni vs Gambhir: ‘ధోనీకి అండగా నిలిచే మొదటి వ్యక్తిని నేనే.. మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు’

మహేంద్ర సింగ్ ధోని గురించి టీమిండియా మాజీ ప్లేయర్ గౌతమ్ గంభీర్ కీలక ప్రకటన చేశాడు. ధోనీకి ఎప్పుడైనా, ఏదైనా అవసరమైతే, అతని పక్కన నిలబడే మొదటి వ్యక్తి నేనే. అతను భారత క్రికెట్‌కు ఏం చేశాడో నాకు తెలుసంటూ..

MS Dhoni vs Gambhir: 'ధోనీకి అండగా నిలిచే మొదటి వ్యక్తిని నేనే.. మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు'
Dhoni Vs Gautam Gambhir
Venkata Chari
|

Updated on: Mar 19, 2022 | 1:08 PM

Share

భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్(Gautam Gambhir), మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ(MS Dhoni)ల మధ్య సఖ్యత సరిగా లేదనే వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, తాజాగా ఈ విషయంపై గంభీర్ మాట్లాడాడు. ధోనీకి ఎలాంటి అవసరం వచ్చినా, నేనే ముందుగా ఉంటానని, ధోనీ అంటే తనకు ఎంతో ఇష్టమంటూ ప్రకటించాడు. జతిన్ సప్రూ షోలో మాట్లాడిన గౌతమ్ గంభీర్ మరెన్నో విషయాలకు క్లారిటీ ఇచ్చాడు. ‘మహేంద్ర సింగ్ ధోనీ అంటే నాకు చాలా గౌరవం, ఈ విషయాన్ని నేను ఇంతకు ముందు చాలాసార్లు చెప్పాను. నేను దీన్ని ఎక్కడైనా, ఎప్పుడైనా చెప్పగలను. అవసరమైతే 138 కోట్ల మంది ప్రజల ముందు కూడా చెప్పగలను’ అంటూ చెప్పుకొచ్చాడు.

అవసరమైతే ధోనీకి అండగా ఉంటా..

‘ధోనీకి ఎప్పుడైనా ఏదైనా అవసరమైతే, అతని పక్కన నిలబడే మొదటి వ్యక్తి నేనే. అతను భారత క్రికెట్‌కు ఏం చేశాడో నాకు తెలుసు. మనిషిగా కూడా చాలా చేశాడు’ అంటూ పేర్కొన్నాడు.

గౌతమ్ గంభీర్ రెండుసార్లు ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో సభ్యుడి ఉన్నాడు. రెండు ప్రపంచకప్ ఫైనల్స్‌లోనూ గంభీర్ మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌లు ఆడాడు. అంతకుముందు, అతను 2007 టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో పాకిస్థాన్‌పై 54 బంతుల్లో 75 పరుగులు చేశాడు. దీని తర్వాత 2011 వన్డే ప్రపంచకప్‌ ఫైనల్లో గంభీర్ 122 బంతుల్లో 97 పరుగులు చేశాడు. కేవలం మూడు పరుగుల తేడాతో సెంచరీ కోల్పోయాడు.

58 టెస్టులు, 147 వన్డేలు ఆడిన గంభీర్..

గౌతమ్ గంభీర్ ఏప్రిల్ 2003లో టీమ్ ఇండియా తరపున వన్డేల్లో అరంగేట్రం చేశాడు. సుమారు 15 ఏళ్ల కెరీర్ తర్వాత, గంభీర్ డిసెంబర్ 2018లో క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నాడు. గంభీర్ తన కెరీర్‌లో 58 టెస్టులు, 147 వన్డేలు, 37 టీ20లు ఆడాడు. ఈ సమయంలో అతను టెస్టుల్లో 4154 పరుగులు, వన్డేల్లో 5238 పరుగులు చేశాడు. కాగా, టీ20 క్రికెట్‌లో గంభీర్ పేరిట 932 పరుగులు ఉన్నాయి.

Also Read: Glenn Maxwell-Vini Raman: ప్రేయసినే పెళ్లాడిన ఆర్‌సీబీ ఆల్ రౌండర్.. నెట్టింట్లో వైరలవుతోన్న ఫొటోలు..

IND vs AUS: ఆనాడు సెంచరీ, ఈనాడు హాఫ్ సెంచరీ.. ఆసీస్‌పై తగ్గేదేలే అంటోన్న హర్మన్‌ప్రీత్ కౌర్..