IND vs AUS: ఆనాడు సెంచరీ, ఈనాడు హాఫ్ సెంచరీ.. ఆసీస్‌పై తగ్గేదేలే అంటోన్న హర్మన్‌ప్రీత్ కౌర్..
Harmanpreet Kaur: భారత వైస్‌కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఆస్ట్రేలియాపై మెరుపు అర్ధశతకం సాధించింది. ఈ ప్రపంచకప్‌లో హర్మాన్‌కి ఇది మూడో ఫిఫ్టీ ప్లస్ స్కోరు కాగా, ఆమె బ్యాట్‌తో నిరంతరం పరుగులు సాధిస్తోంది.
మహిళల ప్రపంచకప్(Icc Womens World Cup 2022)లో శనివారం జరిగిన భారత్, ఆస్ట్రేలియా (India vs Australia) మ్యాచ్‌లో టీమిండియా వైస్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(Harmanpreet Kaur) దూకుడు మరోసారి కనిపించింది. ఆస్ట్రేలియాపై టీమ్ ఇండియా అద్బుతంగా ఆడింది. మొదట్లో మిథాలీ, భాటియా ఆసీస్ బౌలర్లను దంచి కొట్టగా, చివరలో హర్మన్‌ప్రీత్ కౌర్ తుఫాన్ ఇన్నింగ్స్‌తో సత్తా చాటింది. దీంతో టీమిండియా మరోసారి భారీ స్కోరు చేసింది. ఈ క్రమంలో ఆస్ట్రేలియా ముందు 278 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 7 వికెట్లు నష్టపోయి 277 పరుగులు సాధించింది. కెప్టెన్ మిథాలీ రాజ్ (68) టాప్ స్కోరర్‌గా నిలిచింది. యాస్టికా భాటియా 59 పరుగులు చేసి ఔట్ కాగా, వైస్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 57 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది. ఆస్ట్రేలియా తరపున డార్సీ బ్రౌన్ 3 వికెట్లు పడగొట్టింది.
ఆస్ట్రేలియాపై హర్మన్‌ప్రీత్ కౌర్ 32వ ఓవర్‌లో యాస్టికా భాటియా ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చింది. మొదట మిథాలీ రాజ్, ఆ తరువాత పూజా వస్త్రాకర్‌తో కీలక భాగస్వామ్యాన్ని ఏర్పరచింది. హర్మన్‌ప్రీత్ కౌర్ తన ఇన్నింగ్స్‌లో 47 బంతుల్లో 6 ఫోర్లతో 57 పరుగులు చేసింది. ఈ సమయంలో హరన్‌ప్రీత్ కౌర్ స్ట్రైక్ రేట్ 127గా ఉంది.
ఈ మహిళల ప్రపంచకప్‌లో సెంచరీతో సహా హర్మన్‌ప్రీత్ కౌర్‌కి ఇది మూడో 50+ స్కోరుగా నిలిచింది. ప్రపంచ కప్‌కు ముందు పేలవమైన ఫామ్‌తో పోరాడుతున్న హర్మన్‌ప్రీత్ కౌర్‌పై అనేక ప్రశ్నలు తలెత్తాయి. అయితే ఆమె ఐసీసీ టోర్నీలోకి రాగానే.. తన బ్యాట్‌తో సరైన సమాధానం వినిపించింది. అలాగే ఇక్కడ నిరంతరం పరుగుల వర్షం కురిపించి, టీమిండియాలో కీలకంగా మారింది.
మహిళల ప్రపంచ కప్ 2022 హర్మన్‌ప్రీత్ కౌర్ పరుగులు..
• Vs పాకిస్థాన్ 5 పరుగులు
• Vs న్యూజిలాండ్ 71 పరుగులు
• Vs వెస్టిండీస్ 109 పరుగులు
• Vs ఇంగ్లాండ్ 14 పరుగులు
• Vs ఆస్ట్రేలియా 57 పరుగులు (నాటౌట్)
ఈ ప్రపంచ కప్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ –
5 మ్యాచ్‌లు, 5 ఇన్నింగ్స్‌లు, 256 పరుగులు, 64.00 సగటుతో ఒక సెంచరీ, ఒక అర్ధ సెంచరీ, 4 సిక్సర్లు.
ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చేసింది. టీమ్ ఇండియా ఆరంభం మెరుగ్గా లేకపోవడంతో నాలుగో ఓవర్లో స్మృతి మంధాన, ఆరో ఓవర్లో షెఫాలీ వర్మ పెవిలియన్ చేరింది. అయితే ఆ తర్వాత యాస్టికా భాటియా, మిథాలీ రాజ్ ఇన్నింగ్స్‌ను భారీ స్కోర్ దిశగా తీసుకెళ్లారు.
యాస్టికా భాటియా 59, మిథాలీ రాజ్ 68, హర్మన్‌ప్రీత్ కౌర్ 57 నాటౌట్, చివరకు పూజా వస్త్రాకర్ 34 పరుగులు చేశారు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 277 పరుగులు చేసింది.
2017 ప్రపంచకప్‌లో ఆసీస్‌పై 281 పరుగులు చేసిన భారత్..
ఐదేళ్ల క్రితం 2017లో జరిగిన ఐసీసీ మహిళల ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాపై భారత్ అత్యధిక స్కోరు సాధించింది. ఆ తర్వాత హర్మన్‌ప్రీత్ కౌర్ (171 పరుగులు) అద్భుత ఇన్నింగ్స్‌తో ఆస్ట్రేలియాపై భారత జట్టు 4 వికెట్ల నష్టానికి 281 పరుగులు చేసింది. అనంతరం ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 245 పరుగులకే ముగిసింది. దీంతో భారత్ 36 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఆస్ట్రేలియాపై చేసిన రెండో భారీ స్కోరు..
ఈసారి ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాపై భారత్ 277 పరుగులు చేసింది. అంటే గతంలో ఆస్ట్రేలియాపై చేసిన అత్యధిక స్కోరు కంటే 5 పరుగులు తక్కువ. మహిళల వన్డే క్రికెట్‌లో భారత్‌కు ఇది మూడో అత్యధిక స్కోరుగా నమోదైంది.
ప్రపంచకప్‌లో రెండోసారి అద్భుత ప్రదర్శన..
ఆస్ట్రేలియాపై భారత్ నం.3, 4, 5 బ్యాటర్స్ హాఫ్ సెంచరీలు సాధించారు. యాస్తికా భాటియా 59 పరుగులు, మిథాలీ రాజ్ 68 పరుగులు, హర్మన్‌ప్రీత్ 42 బంతుల్లో 50 పరుగులు పూర్తి చేశారు. మహిళల ప్రపంచకప్ చరిత్రలో భారత మహిళలు ఇలా చేయడం రెండోసారి మాత్రమే. అంతకుముందు 2013 ప్రపంచకప్‌లో శ్రీలంకపై భారత్ నం.3, 4, 5 ఫిఫ్టీలు సాధించారు. మహిళల వన్డే చరిత్రలో భారత్ నుంచి ఇలా కనిపించడం మొత్తంగా 7వసారి.
Innings Break!
Solid show by #TeamIndia to post 2⃣7⃣7⃣/7⃣ on the board! ? ? #CWC22 | #INDvAUS
6⃣8⃣ for captain @M_Raj03 5⃣9⃣ for @YastikaBhatia 5⃣7⃣* for vice-captain @ImHarmanpreet 3⃣4⃣ for @Vastrakarp25
Over to our bowlers now. ?
Scorecard ▶️ https://t.co/SLZ4bayb4f pic.twitter.com/EAqhkwqL4O
— BCCI Women (@BCCIWomen) March 19, 2022
Also Read: INDW vs AUSW: ఆస్ట్రేలియా ముందు భారీ టార్గెట్.. అర్థసెంచరీలతో ఆకట్టుకున్న మిథాలీ, భాటియా, కౌర్..