IND vs AUS, WWC 2022: మిథాలీ, భాటియా కీలక ఇన్నింగ్స్.. ఆస్ట్రేలియాపై రికార్డు భాగస్వామ్యంతో ఆదుకున్న జోడీ..

ఈ మ్యాచ్‌లో యాస్టికా భాటియా, మిథాలీ రాజ్ 154 బంతుల్లో 130 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. మూడో వికెట్‌కు భారత్‌కు ఇదే అతిపెద్ద భాగస్వామ్యం. జట్టుకు అత్యంత అవసరమైన సమయంలో..

IND vs AUS, WWC 2022: మిథాలీ, భాటియా కీలక ఇన్నింగ్స్.. ఆస్ట్రేలియాపై రికార్డు భాగస్వామ్యంతో ఆదుకున్న జోడీ..
Icc Women World Cup 2022 Mithali Raj
Follow us
Venkata Chari

|

Updated on: Mar 19, 2022 | 10:17 AM

ఓపెనర్లను త్వరగా పెవిలియన్‌కు చేర్చడం ద్వారా, ఆస్ట్రేలియా(Australia) టీం టీమిండియాపై ఒత్తిడి పెంచేలా చేసింది. అయితే, ఈ క్రమంలో కెప్టెన్ మిథాలీ రాజ్(Mithali Raj), యాస్తిక భాటియా(Yastika Bhatia) జోడీ ఆసీస్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ సత్తా చాటారు. భారత స్కోరు బోర్డును కూడా పరుగులెత్తించారు. దీంతో వీరిద్దరి మధ్య సెంచరీ భాగస్వామ్యం పూర్తి చేశారు. మిథాలీ, యాస్తిక ఇద్దరూ తమ అర్ధ సెంచరీలను పూర్తి చేశారు. దీంతో మూడవ వికెట్‌కు అత్యధిక భారత భాగస్వామ్యానికి రికార్డ్ స్క్రిప్ట్ రాశారు.

ఈ మ్యాచ్‌లో మిథాలీ రాజ్‌ తొలుత హాఫ్‌ సెంచరీ పూర్తి చేసింది. ఆ తర్వాత యస్తికా భాటియా కూడా అర్ధ సెంచరీ చేసింది. యాస్టికా 59 పరుగుల వద్ద ఔటైంది. ఆమె ODI కెరీర్‌లో రెండవ అర్ధ సెంచరీ, ఆస్ట్రేలియా టీంపై, అలాగే ఈ మహిళల ప్రపంచ కప్‌లో మొదటి అర్ధ సెంచరీ పూర్తి చేసింది.

154 బంతుల్లో 130 పరుగుల భాగస్వామ్యం..

ఈ మ్యాచ్‌లో యాస్టికా భాటియా, మిథాలీ రాజ్ 154 బంతుల్లో 130 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. మూడో వికెట్‌కు భారత్‌కు ఇదే అతిపెద్ద భాగస్వామ్యం. జట్టుకు అత్యంత అవసరమైన సమయంలో ఈ భాగస్వామ్యం సాధించారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఇప్పటివరకు ఈ ప్రపంచకప్‌లో యాస్తిక, మిథాలీ ఇద్దరూ ప్రత్యేకంగా ఏమీ చేయలేదు. కానీ, కీలక మ్యాచ్‌లో జట్టును సంక్షోభం నుంచి కాపాడేందుకు పకడ్బందీగా ప్లాన్ చేసిన ఈ జోడీ తమ అత్యుత్తమ ప్రదర్శనను అందించడంలో విజయం సాధించింది.

మిథాలీ రాజ్ కెప్టెన్ ఇన్నింగ్స్..

మిథాలీ రాజ్ 96 బంతుల్లో 68 పరుగులు చేసింది. ఇది ఆమె వన్డే కెరీర్‌లో 32వ అర్ధ సెంచరీ. ఆస్ట్రేలియాపై గత 5 ఇన్నింగ్స్‌ల్లో ఇదే అత్యధిక స్కోరు కావడం విశేసం. అంతకుముందు ఆమె 21 సెప్టెంబర్ 2021న యూకేలో జరిగిన మ్యాచ్‌లో 63 పరుగులు చేసింది. ప్రస్తుత ప్రపంచకప్‌లో మిథాలీ రాజ్‌కి ఇదే తొలి అర్ధ సెంచరీ. ఈ హాఫ్ సెంచరీతో మహిళల ప్రపంచకప్‌లో అత్యధిక హాఫ్ సెంచరీలు సాధించిన బ్యాటర్‌గా మిథాలీ నిలిచింది.

Also Read: Watch Video: అరబిక్ కుతు పాటకు స్టెప్పులేసిన టీమిండియా ప్లేయర్లు.. వేరే లెవల్ అంటోన్న ఫ్యాన్స్.. వైరల్ వీడియో

ICC Women’s World Cup 2022: ఝులన్ గోస్వామి మరో రికార్డు.. ఆ లిస్టులో ప్రపంచంలోనే తొలి బౌలర్‌..