- Telugu News Photo Gallery Cricket photos IND vs AUS Women World Cup 2022: Team India Women Player Jhulan Goswami set to play 200th ODI, 1st bowler in Womens Cricket
ICC Women’s World Cup 2022: ఝులన్ గోస్వామి మరో రికార్డు.. ఆ లిస్టులో ప్రపంచంలోనే తొలి బౌలర్..
Jhulan Goswami: జులన్ గోస్వామి ఇప్పటికే మహిళల క్రికెట్‌లో చాలా రికార్డులను కలిగి ఉంది. ఈ ప్రపంచకప్‌లో ఆమె ఇప్పటికే రెండు రికార్డులు కూడా నమోదు చేసింది. నేడు మరో సరికొత్త రికార్డు..
Updated on: Mar 19, 2022 | 8:01 AM

ICC మహిళల ప్రపంచ కప్ 2022 ప్రపంచ క్రికెట్.. చాలా మంది దిగ్గజ ఆటగాళ్ల కెరీర్‌లో చివరిదిగా నిలిచింది. ఇందులో భారతదేశానికి చెందిన ఇద్దరు ఉన్నారు. మిథాలీ రాజ్, ఝులన్ గోస్వామి చివరి టోర్నీ ఆడనున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పటికే ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్న ఈ ఆటగాళ్లు.. కెరీర్ ముగియకముందే సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నారు. అలాంటి ఒక రికార్డును భారత వెటరన్ ఫాస్ట్ బౌలర్ ఝులన్ గోస్వామి మార్చి 19 శనివారం నాడు చేయనున్నారు. (ఫోటో: ఫైల్/BCCI)

ఝులన్ గోస్వామి శనివారం ఆస్ట్రేలియాతో జరిగే ప్లేయింగ్ ఎలెవన్‌లోకి చేరుకోగానే.. ఆమె 200 వన్డే మ్యాచ్‌లు పూర్తి చేసిన మైలురాయిని చేరుకుంది. దీంతో ప్రపంచంలోనే మొదటి మహిళా బౌలర్‌గా అవతరించింది. (ఫోటో: ఫైల్/BCCI)

అంతే కాదు 200 వన్డేలు ఆడిన రెండో మహిళా క్రికెటర్‌గా ఝులన్ నిలిచింది. అంతకంటే ముందు ఈ ఘనత జులన్ సన్నిహితురాలు, టీమిండియా లెజెండరీ కెప్టెన్ మిథాలీ రాజ్ పేరిట ఉంది. మిథాలీ 229 మ్యాచ్‌లు ఆడింది. (ఫోటో: ఫైల్)

ఈ ప్రపంచకప్‌లో ఝులన్ ఇప్పటికే రెండు భారీ విజయాలు సాధించింది. తొలి ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు తీసిన ప్లేయర్‌గా రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు 41 వికెట్లు పడగొట్టింది. దీంతో పాటు ఈ ప్రపంచకప్‌లో వన్డేల్లో 250 వికెట్లు తీసిన ఘనత కూడా సాధించింది. (ఫోటో: BCCI)





























