INDW vs AUSW: ఆస్ట్రేలియా ముందు భారీ టార్గెట్.. అర్థసెంచరీలతో ఆకట్టుకున్న మిథాలీ, భాటియా, కౌర్..

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా ఉమెన్స్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 277 పరుగులు సాధించింది. దీంతో ఆస్ట్రేలియా ముందు 278 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.

INDW vs AUSW: ఆస్ట్రేలియా ముందు భారీ టార్గెట్.. అర్థసెంచరీలతో ఆకట్టుకున్న మిథాలీ, భాటియా, కౌర్..
Icc Women World Cup 2022 Ind Vs Aus
Follow us

|

Updated on: Mar 19, 2022 | 10:29 AM

మహిళల ప్రపంచకప్ 18వ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ముందు 278 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 7 వికెట్లు నష్టపోయి 277 పరుగులు సాధించింది. కెప్టెన్ మిథాలీ రాజ్ (68) టాప్ స్కోరర్‌గా నిలిచింది. యాస్టికా భాటియా 59 పరుగులు చేసి ఔట్ కాగా, వైస్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 57 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది. ఆస్ట్రేలియా తరపున డార్సీ బ్రౌన్ 3 వికెట్లు పడగొట్టింది. భారత్ ఆరంభంలోనే వికెట్ కీపర్ రిచా ఘోష్ (8), స్నేహ రాణా (1) వికెట్లను కోల్పోయింది. ఆ తర్వాత హర్మన్‌ప్రీత్ కౌర్, పూజా వస్త్రాకర్ 7వ వికెట్‌కు 47 బంతుల్లో 64 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. కేవలం 28 బంతుల్లో 34 పరుగులు చేసిన పూజా భారత ఇన్నింగ్స్ చివరి బంతికి ఔట్ కాగా, హర్మన్ 47 బంతుల్లో అజేయంగా 57 పరుగులు చేసింది.

హర్మన్‌ప్రీత్ కౌర్ (57) * వన్డేల్లో ఆమెకు ఇది 15వ అర్ధ సెంచరీ కాగా, ఈ ప్రపంచకప్‌లో హర్మన్ 50+ పరుగులు చేయడం మూడోసారి. చివరి 5 ఓవర్లలో భారత్ 1 వికెట్ నష్టానికి 44 పరుగులు చేసింది.

154 బంతుల్లో 130 పరుగుల భాగస్వామ్యం..

ఈ మ్యాచ్‌లో యాస్టికా భాటియా, మిథాలీ రాజ్ 154 బంతుల్లో 130 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. మూడో వికెట్‌కు భారత్‌కు ఇదే అతిపెద్ద భాగస్వామ్యం. జట్టుకు అత్యంత అవసరమైన సమయంలో ఈ భాగస్వామ్యం సాధించారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఇప్పటివరకు ఈ ప్రపంచకప్‌లో యాస్తిక, మిథాలీ ఇద్దరూ ప్రత్యేకంగా ఏమీ చేయలేదు. కానీ, కీలక మ్యాచ్‌లో జట్టును సంక్షోభం నుంచి కాపాడేందుకు పకడ్బందీగా ప్లాన్ చేసిన ఈ జోడీ తమ అత్యుత్తమ ప్రదర్శనను అందించడంలో విజయం సాధించింది.

మిథాలీ రాజ్ కెప్టెన్ ఇన్నింగ్స్..

మిథాలీ రాజ్ 96 బంతుల్లో 68 పరుగులు చేసింది. ఇది ఆమె వన్డే కెరీర్‌లో 32వ అర్ధ సెంచరీ. ఆస్ట్రేలియాపై గత 5 ఇన్నింగ్స్‌ల్లో ఇదే అత్యధిక స్కోరు కావడం విశేసం. అంతకుముందు ఆమె 21 సెప్టెంబర్ 2021న యూకేలో జరిగిన మ్యాచ్‌లో 63 పరుగులు చేసింది. ప్రస్తుత ప్రపంచకప్‌లో మిథాలీ రాజ్‌కి ఇదే తొలి అర్ధ సెంచరీ. ఈ హాఫ్ సెంచరీతో మహిళల ప్రపంచకప్‌లో అత్యధిక హాఫ్ సెంచరీలు సాధించిన బ్యాటర్‌గా మిథాలీ నిలిచింది.

రెండు జట్ల XI ప్లేయింగ్

ఆస్ట్రేలియా ప్లేయింగ్ XI : అలిస్సా హీలీ, రాచెల్ హైన్స్, మాగ్ లెన్నింగ్, ఎల్లీస్ పెర్రీ, బెత్ మూనీ, తహిలా మెక్‌గ్రాత్, ఆష్లే గార్డనర్. డార్సీ బ్రౌన్, జెస్ జోనాస్సేన్, అలానా కింగ్, మేగాన్ షట్

భారత ప్లేయింగ్ XI : స్మృతి మంధాన, యాస్తికా భాటియా, మిథాలీ రాజ్, షెఫాలీ వర్మ, హర్మన్‌ప్రీత్ కౌర్, స్నేహ రాణా, రిచా ఘోష్, పూజా వస్త్రాకర్, ఝులన్ గోస్వామి, మేఘనా సింగ్, రాజేశ్వరి గైక్వాడ్

Also Read: IND vs AUS, WWC 2022: మిథాలీ, భాటియా కీలక ఇన్నింగ్స్.. ఆస్ట్రేలియాపై రికార్డు భాగస్వామ్యంతో ఆదుకున్న జోడీ..

Watch Video: అరబిక్ కుతు పాటకు స్టెప్పులేసిన టీమిండియా ప్లేయర్లు.. వేరే లెవల్ అంటోన్న ఫ్యాన్స్.. వైరల్ వీడియో

YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!