సాహో ఎఫెక్ట్.. ప్రభాస్ టీమ్ షాకింగ్ నిర్ణయం

సాహో ఎఫెక్ట్.. ప్రభాస్ టీమ్ షాకింగ్ నిర్ణయం

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఈ మధ్యన సాహోతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. బాహుబలి తరువాత ప్రభాస్ నటించిన ఈ చిత్రంపై అందరూ చాలా అంచనాలను పెట్టుకున్నారు. అయితే అన్ని వర్గాలను మెప్పించలేకపోయిన సాహో బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం పాలైంది. ఉత్తరాదిన ఈ మూవీ మంచి కలెక్షన్లను సాధించినప్పటికీ.. దక్షిణాదిన మాత్రం బయ్యర్లకు భారీ నష్టాలను తెచ్చిపెట్టింది. ఇక దీని ఎఫెక్ట్ ఇప్పుడు ప్రభాస్ నటిస్తున్న చిత్రంపై పడింది. జిల్ ఫేమ్ రాధాకృష్ణ […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Oct 20, 2019 | 12:54 PM

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఈ మధ్యన సాహోతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. బాహుబలి తరువాత ప్రభాస్ నటించిన ఈ చిత్రంపై అందరూ చాలా అంచనాలను పెట్టుకున్నారు. అయితే అన్ని వర్గాలను మెప్పించలేకపోయిన సాహో బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం పాలైంది. ఉత్తరాదిన ఈ మూవీ మంచి కలెక్షన్లను సాధించినప్పటికీ.. దక్షిణాదిన మాత్రం బయ్యర్లకు భారీ నష్టాలను తెచ్చిపెట్టింది. ఇక దీని ఎఫెక్ట్ ఇప్పుడు ప్రభాస్ నటిస్తున్న చిత్రంపై పడింది. జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్ 20వ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. పీరియాడిక్ లవ్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది.

ఇక ప్రభాస్ మార్కెట్ దృష్ట్యా ఈ మూవీని కూడా భారీ బడ్జెట్‌తో తెరకెక్కించాలని దర్శకనిర్మాతలు భావించారు. అయితే సాహో తరువాత ఈ మూవీ స్క్రిప్ట్‌లో దర్శకుడు భారీ మార్పులు చేశాడట. అంతేకాదు నిర్మాతలు కూడా ఈ మూవీ బడ్జెట్‌ను 40శాతం తగ్గించారట. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని 120కోట్లతో తెరకెక్కిస్తున్నారట. కాగా ఈ మూవీ తదుపరి షెడ్యూల్‌లో నవంబర్‌లో హైదరాబాద్లో ప్రారంభం కానుండగా.. ఎలాంటి విరామాలు లేకుండా షూటింగ్‌‌ను ‌జరపనున్నారట. ఇక ఇందులో ప్రభాస్ సరసన పూజా హెగ్డే నటిస్తుండగా.. యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకుంటున్నారు. ఇక మరో మూడు రోజుల్లో ప్రభాస్ పుట్టినరోజు ఉండగా.. ఆ రోజు ఈ మూవీ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయబోతున్నట్లు ఫిలింనగర్‌లో టాక్ వినిపిస్తోంది.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu