తారాస్థాయికి చేరిన విభేదాలు.. ‘మా’కి దిక్కెవరు?

తారాస్థాయికి చేరిన విభేదాలు.. 'మా'కి దిక్కెవరు?

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా)లో మరో వివాదం చోటు చేసుకుంది. అధ్యక్షుడు నరేష్‌కు, వైస్ ప్రెసిడెంట్ రాజశేఖర్‌కు మధ్య గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి. జనరల్ బాడీ మీటింగ్ ఉందని జీవితా, రాజశేఖర్‌లు ‘మా’ సభ్యులకు మెసేజ్‌లు పంపారు. నరేష్ మినహా మిగిలినవారంతా ఈ సమావేశానికి హాజరయ్యారు. అయితే అధ్యక్షుడు లేకుండా మీటింగ్ ఎలా నిర్వహిస్తారంటూ నరేష్ తరపు న్యాయవాది జీవితా రాజశేఖర్‌ను ప్రశ్నించారు. ఇది ఫ్రెండ్లీ మీటింగ్ మాత్రమేనని.. కోర్టు ఆర్డర్ ప్రకారం ఇది జనరల్ బాడీ మీటింగ్ […]

Ravi Kiran

|

Oct 20, 2019 | 2:49 PM

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా)లో మరో వివాదం చోటు చేసుకుంది. అధ్యక్షుడు నరేష్‌కు, వైస్ ప్రెసిడెంట్ రాజశేఖర్‌కు మధ్య గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి. జనరల్ బాడీ మీటింగ్ ఉందని జీవితా, రాజశేఖర్‌లు ‘మా’ సభ్యులకు మెసేజ్‌లు పంపారు. నరేష్ మినహా మిగిలినవారంతా ఈ సమావేశానికి హాజరయ్యారు. అయితే అధ్యక్షుడు లేకుండా మీటింగ్ ఎలా నిర్వహిస్తారంటూ నరేష్ తరపు న్యాయవాది జీవితా రాజశేఖర్‌ను ప్రశ్నించారు. ఇది ఫ్రెండ్లీ మీటింగ్ మాత్రమేనని.. కోర్టు ఆర్డర్ ప్రకారం ఇది జనరల్ బాడీ మీటింగ్ కాదని వారు అన్నారు.

అయితే ‘మా’ నిధుల విషయంలో గత మూడు నెలలుగా అధ్యక్షుడు నరేష్, వైస్ ప్రెసిడెంట్ రాజశేఖర్‌ల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. రాజశేఖర్ తనకు అనుకూలంగా ఉన్న 21మందితో కలిసి నరేష్‌కు నోటీసులు పంపించినట్లు తెలుస్తోంది. గత 9 నెలలుగా ‘మా’లో ఏం జరుగుతోంది? ‘మా’లో ఉన్న మూలధనం ఐదున్నర కోట్లు ఏమయ్యాయి? అని పలు అనుమానాలను జీవితా రాజశేఖర్‌లు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఈ వివాదాన్ని సద్దుమణిగించడానికి ఇండస్ట్రీ పెద్దలు ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే ‘మా’లో గొడవలు ఇప్పటివి కావు. గతంలో శివాజీరాజా అధ్యక్షుడిగా, నరేష్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్న తరుణంలో కూడా ఇద్దరి మధ్య నిధుల విషయంలో పలుమార్లు విభేదాలు తలెత్తాయి. గత కొద్దికాలంగా ‘మా’లో ఇంత రచ్చ జరుగుతున్నా.. టాలీవుడ్ స్టార్ హీరోలెవరూ కూడా స్పందించకపోవడం గమనార్హం. చిన్న నటీనటులకు దెబ్బపడుతున్నా.. ఈ నిధుల వ్యవహారానికి మాత్రం ఎవరూ కూడా ఫుల్ స్టాప్ పెట్టలేకపోతున్నారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu