హుస్సేన్ సాగర్ కాస్తా.. జై శ్రీరామ్ సాగర్ అయ్యింది.. ఎలా అంటే..?

హుస్సేన్ సాగర్ కాస్తా.. జై శ్రీరామ్ సాగర్ అయ్యింది.. ఎలా అంటే..?

టెక్నాలజీ పెరుగుతుందని ఆనందపడాలో లేక బాధపడాలో అర్థంకాని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. టెక్నాలజీని ఉపయోగించి ఎంతోమంది ఎన్నో విషయాలు నేర్చుకుంటుంటే.. కొంతమంది ఆకతాయిలు మాత్రం ఇదే టెక్నాలజీని దుర్వినియోగం చేస్తూ ఇతరులను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. నిన్నమొన్నటి వరకు ఒకరి ఫోటోలకు బదులు మరొకరి ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఘటనలు చూశాం. ఇప్పుడు ఏకంగా ఎంతో ప్రాముఖ్యత చెందిన పర్యాటక ప్రాంతాల పేర్లను కూడా మార్చేస్తున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఘటన ఈ విషయాన్ని […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Oct 20, 2019 | 2:29 PM

టెక్నాలజీ పెరుగుతుందని ఆనందపడాలో లేక బాధపడాలో అర్థంకాని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. టెక్నాలజీని ఉపయోగించి ఎంతోమంది ఎన్నో విషయాలు నేర్చుకుంటుంటే.. కొంతమంది ఆకతాయిలు మాత్రం ఇదే టెక్నాలజీని దుర్వినియోగం చేస్తూ ఇతరులను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. నిన్నమొన్నటి వరకు ఒకరి ఫోటోలకు బదులు మరొకరి ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఘటనలు చూశాం. ఇప్పుడు ఏకంగా ఎంతో ప్రాముఖ్యత చెందిన పర్యాటక ప్రాంతాల పేర్లను కూడా మార్చేస్తున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఘటన ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్ అంటే తెలియని వారుండరు. సాగర్ మధ్యలో ఉన్న గౌతమ్ బుద్దుడి విగ్రహాన్ని చూడటానికి విదేశాల నుంచి కూడా పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. ఎందుకంటే ఇది ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ది గాంచిన లేక్. ఇప్పుడు ఇలాంటి పర్యాటక స్థలం పేరును మార్చేశారు కొందరు ఆకతాయిలు. ఇది నిజమండీ.. గూగుల్‌లో హుస్సేన్ సాగర్ పేరుకు బదులు జై శ్రీరామ్ సాగర్ అనే పేరును పెట్టేశారు.

గూగుల్ మ్యాప్‌లో ఈ సాగర్ పేరును జై శ్రీరామ్ సాగర్ అని చూసిన తరువాత, గూగుల్ మ్యాపింగ్ పై విమర్శలు వస్తున్నాయి. సోషల్ మీడియా వేదికగా ప్రజలు గూగుల్ మ్యాప్స్‌ను తీవ్రంగా విమర్శిస్తున్నారు. దీంతో తరువాత తప్పును సరిచేయడం జరిగింది.

ఓ వ్యక్తి గూగుల్‌లో హుస్సెన్ సాగర్ అని సెర్చ్ చేయగా.. బుద్దుడి విగ్రహం ఉన్న ఫోటో కింద జై శ్రీరామ్ సాగర్ అనే పేరు వచ్చిందని.. అది చూసిన అతడు ఆశ్చర్యానికి గురైనట్లు ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. పైగా అందులో హుస్సేన్ సాగర్ సరస్సును గల్లి కుతుబ్ షా 1563లో నిర్మించాడని చెప్పడం విశేషం. దీనిపై గూగుల్ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ గూగుల్ మ్యాప్‌ను మెరుగుపరచడానికి కంపెనీ చాలా డబ్బు పెట్టుబడి పెడుతోందని.. ప్రజల స్థానిక సమాచారాన్ని పొందుపరచడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. కొన్నిసార్లు ప్రజలు తప్పు సమాచారం ఇచ్చినప్పుడు ఇలాంటి తప్పిదాలు జరుగుతుంటాయని చెప్పారు.

గతంలో కూడా సాలర్‌గంజ్ వంతెనను గూగుల్ మ్యాప్‌లో ఛత్రపతి శివాజీ వంతెనగా మార్చారు. ఇది మాత్రమే కాదు, వంతెన కింద ప్రయాణిస్తున్న నది పేరును కూడా ముసి నుండి ముచుకుండ్‌గా మార్చడం జరిగింది.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu