Uttarakhand Election: ఎన్నికలు వాయిదా వేయడం కోర్టు పని కాదు.. తేల్చి చెప్పిన ఉత్తరాఖండ్ హైకోర్టు

కరోనా మహమ్మారి నేపథ్యంలో ఎన్నికలను వాయిదా వేయాలన్న డిమాండ్‌పై ఉత్తరాఖండ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

Uttarakhand Election: ఎన్నికలు వాయిదా వేయడం కోర్టు పని కాదు.. తేల్చి చెప్పిన ఉత్తరాఖండ్ హైకోర్టు
Uttarakhand High Court
Follow us

|

Updated on: Jan 13, 2022 | 2:39 PM

Uttarakhand Assembly Election 2022: కరోనా మహమ్మారి నేపథ్యంలో ఎన్నికలను వాయిదా వేయాలన్న డిమాండ్‌పై ఉత్తరాఖండ్ హైకోర్టు(Uttarakhand High Court) కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్నికలను వాయిదా వేయడం కోర్టు పని కాదని తేల్చి చెప్పింది. దీనిపై విచారణ చేపట్టిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సంజయ్‌ కుమార్‌ మిశ్రా(Justice Sanjay Kumar Mishra), జస్టిస్‌ ఎన్‌ఎస్‌ ధనిక్‌లతో కూడిన డివిజన్‌ ​​బెంచ్‌.. ర్యాలీలపై నిషేధం విధిస్తూ ఆదేశాలు ఇవ్వడానికి నిరాకరించింది. భారత ఎన్నికల సంఘం (Election Commission of India) ఇప్పటికే కొన్ని సూచనలు చేసింది. అదొక స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ. ఎన్నికల సంఘం మెచ్చుకోదగిన పని చేస్తోందని ధర్మాసనం తేల్చి చెప్పింది.

ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కోవిడ్ -19 పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజా ప్రయోజన వ్యాజ్యాల (పిల్) పిటిషన్లపై ఉత్తరాఖండ్ హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది. కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఎన్నికలను వాయిదా వేయాలని కోరింది . ఈ పిల్‌లలో న్యాయవాది శివ్‌భట్‌ దరఖాస్తు చేశారు. ఇందులో కోవిడ్-19 కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఎన్నికలను వాయిదా వేయాలనే డిమాండ్ వచ్చింది. ఈ కేసులో పిటిషన్‌పై కోర్టు 2021 డిసెంబర్ 29న ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది.. దీనిపై విచారించిన ముగ్గురు సభ్యుల ధర్మాసనం ఈ విధంగా వ్యాఖ్యానించింది. ఉత్తరాఖండ్‌లో 2022 ఫిబ్రవరి 14న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఇక్కడ ప్రచారాన్ని ప్రారంభించాయి.

ఇదే విషయాన్ని ఎన్నికల కమిషన్ తరఫు న్యాయవాది శోభిత్ సహారియా న్యాయస్థానానికి తెలిపారు. పూర్తి స్థాయి కరోనా నిబంధనలు పాటిస్తూ ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు కోర్టుకు నివేదించారు. ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో ఇప్పటికే జనవరి 15 వరకు ర్యాలీలు నిషేధించింది కేంద్ర ఎన్నిక సంఘం. పరిస్థితిని పరిశీలించిన తర్వాత ఎన్నికల సంఘం తదుపరి మార్గదర్శకాలను జారీ చేస్తుంది. ఆన్‌లైన్ నామినేషన్‌కు ఎన్నికల సంఘం ఇప్పటికే అనుమతి ఇచ్చిందని, స్వయంగా అభ్యర్థి స్వయంగా వెళ్లి నమోదు చేసుకుంటే, అతనితో పాటు వచ్చే వారి సంఖ్య పరిమితం చేయడం జరిగిందని సహరియా చెప్పారు. కరోనా నియంత్రించేందుకు నియంత్రించేందుకు అనేక ఇతర చర్యలతో పాటు స్టార్ క్యాంపెయినర్ల సంఖ్యను కూడా నిషేధించినట్లు ఆయన తెలిపారు.

కొత్త ఓమిక్రాన్ వేరియంట్.. ఇతర కోవిడ్ వేరియంట్ల కంటే 300% వేగంగా వ్యాపిస్తోందని పిటిషన్ పేర్కొన్నారు. దీంతో ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాలంటే ఎన్నికల ర్యాలీల వంటి పెద్ద సమావేశాలకు దూరంగా ఉండాలి. ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల కోసం అన్ని రాజకీయ పార్టీలు భారీ ‘ఎన్నికల ర్యాలీలు’ నిర్వహిస్తున్నాయి. ఈ రాజకీయ పార్టీల ఎన్నికల ర్యాలీలలో సామాజిక దూరాన్ని పాటించలేదు. ప్రజలు మాస్కులు ధరించడంలేదని పిటిషన్‌లో కోర్టుకు వివరించారు. కాగా, దీనిపై తదుపరి విచారణను ఫిబ్రవరి 15కు వాయిదా వేస్తూ ఉత్తరాఖండ్ హైకోర్టు నిర్ణయం తీసుకుంది.

Read Also….  UP Elections: 125 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ తొలి జాబితా విడుదల.. 50మంది మహిళలకు ఛాన్స్