Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UP Elections: 125 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ తొలి జాబితా విడుదల.. 50మంది మహిళలకు ఛాన్స్

UP Congress list: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు 125 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను యూపీ కాంగ్రెస్ విడుదల చేసింది.

UP Elections: 125 మంది అభ్యర్థులతో కాంగ్రెస్ తొలి జాబితా విడుదల.. 50మంది మహిళలకు ఛాన్స్
Priyanka Gandhi
Follow us
Balaraju Goud

|

Updated on: Jan 13, 2022 | 12:31 PM

Uttar Pradesh Assembly Election 2022: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు 125 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను యూపీ కాంగ్రెస్ విడుదల చేసింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ యూపీ ఇన్‌ఛార్జ్ ప్రియాంక గాంధీ వాద్రా మాట్లాడుతూ మా అభ్యర్థుల్లో 40 శాతం మంది మహిళలే ఉంటారన్నారు. 125 మంది అభ్యర్థుల తొలి జాబితాలో 50 మంది మహిళలు ఉన్నారని ప్రియాంక గాంధీ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా కొత్త రాజకీయాలకు నాంది పలుకుతూ కష్టపడుతున్న వారే మా అభ్యర్థులు కావాలని ప్రయత్నించామన్నారు. ఉన్నావ్ అత్యాచార బాధితురాలి తల్లి ఆశాదేవికి కూడా కాంగ్రెస్ టిక్కెట్టు ఇవ్వడం విశేషం.

ఈ సందర్భంగా ప్రియాంక గాంధీ మీడియాతో మాట్లాడుతూ.. 125 మంది అభ్యర్థుల జాబితాలో 50 మంది మహిళలు ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కొత్త రాజకీయాలకు నాంది పలికే అభ్యర్థులు ఉండాలని మేం ప్రయత్నించాం. వారి ద్వారా యూపీ రాజకీయాలకు కొత్త దిశానిర్దేశం చేయాలన్నదే మా ప్రయత్నమన్నారు. కేంద్ర మాజీ మంత్రి సల్మాన్‌ ఖుర్షీద్‌ భార్య లూయిస్‌ ఖుర్షీద్‌కు కూడా కాంగ్రెస్‌ టిక్కెట్‌ ఇచ్చింది.

జాబితాలో ప్రముఖులు నోయిడా నుండి పంఖురి పాఠక్ లక్నో సెంట్రల్‌కు చెందిన సదాఫ్ జాఫర్, సదాఫ్ ఎన్‌ఆర్‌సి వ్యతిరేక ఉద్యమంలో జైలుకు వెళ్లారు. రాంపూర్ ఖాస్ నుండి ఆరాధన మిశ్రా (ప్రస్తుత ఎమ్మెల్యే) సోన్‌భద్ర ఊచకోత బాధితుల కోసం పోరాడిన నేత ఉంభా నుండి టిక్కెట్ షాజహాన్‌పూర్ నుండి ఆశా వర్కర్ పూనమ్ పాండేకి టిక్కెట్ హస్తినాపూర్‌కి చెందిన అర్చన గౌతమ్‌

ఈ జాబితాలో కొందరు మహిళా జర్నలిస్టులు కూడా ఉన్నారని ప్రియాంక తెలిపారు. ఒకరు నటి, మిగిలినవారు కాంగ్రెస్‌లో ఉండి ఎన్నో ఏళ్లుగా కష్టాలు పడుతున్న మహిళలు. నేడు యూపీలో నియంతృత్వ ప్రభుత్వం నడుస్తోంది. సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకురావడమే మా ప్రయత్నమన్నారు. కాంగ్రెస్‌ను విడిచిపెట్టే నేతలపై ప్రియాంక గాంధీ మాట్లాడుతూ, “ప్రతి ఎన్నికల్లో ఇది జరుగుతుంది. కొంతమంది వస్తారు, మరికొందరు వెళతారు. కొందరు భయపడతారు. మన పోరాటానికి ధైర్యం కావాలి. ఎవరైనా వెళ్లిపోతే బాధ కలుగుతుందన్నారు.

ఉత్తరప్రదేశ్‌లోని 403 అసెంబ్లీ స్థానాలకు ఏడు దశల్లో ఫిబ్రవరి 10 నుంచి పోలింగ్ జరుగనుంది. యూపీలో ఫిబ్రవరి 10, 14, 20, 23, 27, మార్చి 3, 7 తేదీల్లో ఏడు దశల్లో ఓటింగ్ జరగనుంది. కాగా మార్చి 10న ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు. కరోనా దృష్ట్యా యూపీ, పంజాబ్, గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల కోసం జనవరి 15 వరకు ఎటువంటి రాజకీయ ర్యాలీలు, రోడ్ షోలకు ఎన్నికల సంఘం అనుమతించలేదు.

Read Also….  Coronavirus: కాంగ్రెస్‌లో కరోనా ప్రకంపనలు.. మల్లికార్జున ఖర్గే, వీరప్ప మొయిలీకి పాజిటివ్‌..