UP Elections: అభ్యర్థుల ఎంపికపై 14గంటల పాటు చర్చించిన బీజేపీ కోర్ కమిటీ.. ఇవాళ 172మంది పేర్లు ప్రకటించే ఛాన్స్!
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు (UP Election 2022) ఎన్నికల సమరానికి అన్ని పార్టీలు కసరత్తు మొదలు పెట్టాయి. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ (BJP)కోర్ కమిటీ బుధవారం సమావేశమైంది.

Uttar Pradesh Assembly Election 2022: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు (UP Election 2022) ఎన్నికల సమరానికి అన్ని పార్టీలు కసరత్తు మొదలు పెట్టాయి. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ (BJP)కోర్ కమిటీ బుధవారం సమావేశమైంది. ఈ సందర్భంగా మిత్రపక్షాల సీట్ల కేటాయింపులపై చర్చించింది. ఈ సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) అధ్యక్షత వహించారు. దాదాపు 14 గంటల పాటు జరిగిన ఈ సమావేశం కొనసాగింది. కోర్ కమిటీ సమావేశంలో నిషాద్ పార్టీ(Nishad Party)కి చెందిన సంజయ్ నిషాద్, అప్నాదళ్(Apnadal)కు చెందిన అనుప్రియ పటేల్‌తో సీట్ల పంపకాలపై చర్చలు జరిపారు. గురువారం జరిగే సీఈసీ సమావేశం తర్వాత సీట్ల పంపకానికి సంబంధించిన ప్రకటన వెలువడుతుందని విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఈ సమావేశంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను అయోధ్య నుంచి పోటీ చేయించడంపై కూడా చర్చ జరిగినట్లు సమాచారం. అయితే దీనిపై బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం తర్వాత తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఇవాళ జరిగే సమావేశానికి ప్రధాని నరేంద్ర మోడీ కూడా హాజరుకానున్నారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ గోరఖ్‌పూర్ లోక్‌సభ నుంచి ఐదుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. ఆయన ఎప్పుడూ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. దీంతో బుధవారం జరిగిన కోర్ కమిటీ సమావేశంలో తొలి మూడు దశల్లో 172 మంది అభ్యర్థుల పేర్లను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఢిల్లీ హెడ్‌క్వార్టర్స్‌లో జరిగిన ఈ సమావేశంలో 300 సీట్ల పేర్లపై చర్చలు జరిగినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇప్పుడు ఈ పేర్లను గురువారం బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ ముందు ఉంచనున్నారు.
కేంద్ర బీజేపీ ఎన్నికల కమిటీ ఆమోదం తర్వాత ఈ పేర్లను రానున్న రోజుల్లో ప్రకటిస్తారు. బుధవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైన సమావేశం అర్థరాత్రి 1.30 గంటల వరకు కొనసాగింది. అంతకుముందు మంగళవారం కూడా సమావేశం 10 గంటలకు పైగా కొనసాగింది. ఈ సమావేశంలో హోంమంత్రి అమిత్ షా, బీజేపీ ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఇంచార్జి ధర్మేంద్ర ప్రధాన్, డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సాల్, జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు. దీంతో, ఇటీవలే కరోనా పాజిటివ్ బారినపడ్డ బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా ఈ సమావేశంలో వర్చువల్‌గా పాల్గొన్నారు.
UP polls: BJP Core Committee’s meeting ends after 14 hrs, discussions held with allies on seat-sharing
Read @ANI Story | https://t.co/ELdVUWklYM#UttarPradeshElections2022 #BJP pic.twitter.com/txTCxkasAH
— ANI Digital (@ani_digital) January 12, 2022
బీజేపీ మిత్రపక్షం ‘అప్నాదళ్’తో సీట్ల విషయంలోనూ చర్చ జరిగింది. ఇందుకోసం అనుప్రియా పటేల్ బీజేపీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో అప్నాదళ్‌కు బీజేపీ 11 సీట్లు ఇచ్చింది. ఇందులో అనుప్రియా పటేల్ పార్టీ 9 సీట్లు గెలుచుకుంది. ఈసారి అప్నాదళ్ ముందుగా మరిన్ని స్థానాల్లో పోటీ చేయవచ్చు.
Read Also…. AP Good News: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్‌లో 10% ప్లాట్లు రిజర్వ్!