భార్య తల నరికి సైకిల్ బుట్టలో పెట్టుకున్న భర్త.. తర్వాత వీడియో
అస్సాం లోని చిరంగ్ జిల్లాలో జరిగిన భయానక ఘటన అందరినీ షాక్ కు గురిచేసింది. 67 ఏళ్ల వ్యక్తి కోపంతో తన భార్య తలను నరికేశాడు. ఆ తర్వాత తలను తన సైకిల్ బుట్టలో పెట్టుకొని నేరుగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి లొంగిపోయాడు. అది చూసిన పోలీస్ సిబ్బంది సైతం ఒక్కసారిగా భయపడిపోయారు. భార్యాభర్తల మధ్య మొదలైన గొడవ చివరకు ఈ ఘాతుకాన్నికి దారితీసింది. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. చిరంగ్ జిల్లాకు చెందిన 67 ఏళ్ల బితీష్ హజోంగ్ అతని భార్య బైజంతి మధ్య తరచు గొడవ జరుగుతుండేది. ఈ క్రమంలోనే శనివారం రాత్రి కూడా ఇద్దరి మధ్య వివాదం తలెత్తింది.
ఇద్దరి మధ్య మాటామాట పెరిగింది. చివరకు బితీష్ కోపంతో పదునైన ఆయుధం తీసుకొని భార్య బైజంతి తల నరికేశాడు. ఆపై తన సైకిల్ బుట్టలో ఆ తలను పెట్టుకొని నేరుగా పోలీస్ స్టేషన్ కి చేరుకున్నాడు. పోలీసుల ఎదుట తన నేరాన్ని అంగీకరించి లొంగిపోయాడు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. ఈ భయానక ఘటనతో ఆ ప్రాంతవాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. జరిగిన దారుణం తెలిసిన ప్రతి ఒక్కరు విషాదానికి లోనయ్యారు. హజోంగ్ అతని భార్య బైజంతి మధ్య తరచు గొడవలు జరిగేవని చుట్టుపక్కల వారు చెప్పారు. ప్రతిరోజూ చిన్న చిన్న విషయాలకే ఇద్దరు గొడవ పడేవారని అన్నారు. ఇంట్లో జరిగే చిన్నపాటి గొడవలకే ఇంత దారుణానికి ఒడిగట్టాడని ఊహించలేదని అంటున్నారు.
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
